డెలివరీకి ముందే ఘోరం.. షోరూమ్ లిఫ్ట్ నుంచి కిందపడి ముక్కలైన బ్రాండ్ న్యూ కియా కారు

సొంతంగా ఒక కారు కొనుగోలు చేసి, దానిని ఫ్యామిలీతో కలిసి డెలివరీ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి. కానీ ఒక కస్టమర్‌కు మాత్రం ఈ సంతోషం కాస్తా పెద్ద షాక్‌గా మారింది. కియా షోరూమ్‌లో కారు కొనుగోలుకు సంబంధించిన అన్ని రకాల పేపర్‌వర్క్, డాక్యుమెంటేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.

ఆ తర్వాత కారును కస్టమర్‌కు అప్పగించడం కోసం షోరూమ్ మొదటి అంతస్తు నుంచి కార్ లిఫ్ట్ ద్వారా కిందకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో షోరూమ్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆ కారు లిఫ్ట్ నుంచి కిందపడిపోయి, దారుణంగా డ్యామేజ్ అయింది. ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న ఫోటోలను బట్టి అది కియా సెల్టోస్ (Kia Seltos) కారుగా తెలుస్తోంది.

Brand New Kia Seltos Crashes Before Delivery Showroom Lift Mishap Sparks Massive Outrage

ఈ ప్రమాదం జరిగిన వెంటనే కస్టమర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. షోరూమ్ వాళ్ల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి, తనకు పూర్తిగా సరికొత్త కారును (New Car Replacement) ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశాడు. అయితే డీలర్‌షిప్ యాజమాన్యం మాత్రం ఇందుకు నిరాకరించింది. ఇప్పటికే పేపర్‌వర్క్ పూర్తయింది కాబట్టి, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చే నష్టపరిహారాన్ని తీసుకోవాలని కస్టమర్‌కు ఆఫర్ చేసింది.

ఈ సమాధానం విన్న కస్టమర్ తో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. అసలు కారు డెలివరీ తీసుకుని షోరూమ్ బయటకు రాకముందే.. షోరూమ్ లోపల జరిగిన ప్రమాదానికి కస్టమర్ ఎందుకు ఇన్సూరెన్స్ భరించాలనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వివరాలు ఎక్స్‎లో ప్రత్యక్షం కావడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

డీలర్ల నిర్లక్ష్యంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. శైలేష్ వర్మ అనే నెటిజన్ స్పందిస్తూ.. "కారు షోరూమ్ దాటి బయట రోడ్డుపైకి వచ్చేంతవరకు దానికి సంబంధించిన పూర్తి బాధ్యత షోరూమ్ యాజమాన్యానిదే. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీతో సంబంధం లేకుండా డీలరే కస్టమర్‌కు వెంటనే కొత్త కారు ఇవ్వాలి" అని డిమాండ్ చేశారు. మరో నెటిజన్ సమీర్ స్పందిస్తూ.. "షోరూమ్ చేసిన తప్పుకు కస్టమర్ ఎందుకు నష్టపోవాలి? ఇన్సూరెన్స్ సాకులు చెప్పడం చాలా తప్పు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Brand New Kia Seltos Crashes Before Delivery Showroom Lift Mishap Sparks Massive Outrage

కారు కొనుగోలు అనేది ఒక మధ్యతరగతి కుటుంబానికి ఎంతో కాలం దాచుకున్న సొమ్ము, కలలతో కూడుకున్న విషయం అని ప్రియాన్షు కుమార్ అనే నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సామాన్య వ్యక్తి ఎంతో కష్టపడి డబ్బులు పొదుపు చేసి కారు కొంటే.. డెలివరీకి ముందే ఇలా ముక్కలవ్వడం ఆ కుటుంబానికి ఎంత పెద్ద మానసిక వేదన కలిగిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు. మోహిత్ కుమార్ అనే మరో నెటిజన్ మాట్లాడుతూ.. డెలివరీకి ముందే జరిగిన నష్టాన్ని బీమా క్లెయిమ్ ద్వారా కస్టమర్ పై నెట్టేయాలని చూడటం డీలర్ల మోసపూరిత బుద్ధికి నిదర్శనమన్నారు.

మోటారు వాహన చట్టాలు, వినియోగదారుల హక్కుల ప్రకారం.. ఒక వాహనం కస్టమర్ చేతికి అంది, గేటు దాటి బయటకు వెళ్లేవరకు దాని భద్రతకు షోరూమ్ దే పూర్తి బాధ్యత. డెలివరీ తీసుకోకుండా, రోడ్డుపైకి రాకుండా జరిగిన ఏ ప్రమాదానికైనా డీలర్‌షిప్ మాత్రమే సమాధానం చెప్పాలి. కస్టమర్ పై ఎలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఒత్తిడి తీసుకురాకూడదు. ఈ వివాదం ఇప్పుడు కియా ఇండియా దృష్టికి కూడా వెళ్లడంతో, కంపెనీ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది. సదరు కస్టమర్‌కు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Article Published On: Sunday, June 21, 2026, 13:33 [IST]
English summary
Brand new kia seltos crashes before delivery showroom lift mishap sparks massive outrage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+