6, 7 సీటర్ ఆప్షన్లతో 485 కిమీలు ప్రయాణించే చైనా కారు.. మీ ఫ్యామిలీ కోసం అదిరిపోయే ఈవీ

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తుండగా, అంతర్జాతీయ కంపెనీలు కూడా తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనా ఆటోమొబైల్ దిగ్గజం BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం దేశీయ EV మార్కెట్‌లో టాటా మోటార్స్, మహీంద్రా, ఎంజీ మోటార్ వంటి కంపెనీలు బలమైన స్థానంలో ఉన్నప్పటికీ, BYD కూడా ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. నాణ్యమైన ఉత్పత్తులు, అధునాతన బ్యాటరీ టెక్నాలజీ, అత్యాధునిక ఫీచర్లతో భారత వినియోగదారులను ఆకట్టుకునే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది.

ఈ వ్యూహంలో భాగంగానే BYD ఇప్పుడు తన ప్రముఖ ఎలక్ట్రిక్ MPV అయిన Emax 7కు కొత్త మిడ్-స్పెక్ Comfort వేరియంట్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వేరియంట్ల మధ్య సమతుల్యమైన ఫీచర్లు, పోటీ ధరతో మరింత మంది కస్టమర్లను ఆకర్షించడమే ఈ కొత్త ట్రిమ్ లక్ష్యం. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ MPVలో విశాలమైన క్యాబిన్, ఫీచర్లు, సౌకర్యవంతమైన సీటింగ్ ఉన్నాయి.

Byd Emax 7 Comfort Variant Launched In India Price Features Details

BYD Emax 7 Comfort 6-సీటర్ వేరియంట్‌ను రూ. 27.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే 7-సీటర్ వేరియంట్ ధరను రూ. 28.30 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త వేరియంట్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ MPV సెగ్మెంట్‌లో మరింత పోటీని పెంచాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే భారత మార్కెట్‌లో మంచి గుర్తింపు పొందిన BYD, ఈ వేరియంట్ ద్వారా మరింత అమ్మకాలను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దీనిలో 71.8 kWh సామర్థ్యమైన బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. ఈ బ్యాటరీని ఇప్పటికే ఉన్న టాప్-స్పెక్ Superior వేరియంట్ నుంచి తీసుకురాగా, ఎలక్ట్రిక్ మోటార్ మాత్రం ఎంట్రీ-లెవల్ Premium వేరియంట్‌లో ఉన్నదే. దీంతో ఈ ఎలక్ట్రిక్ MPV గరిష్టంగా 161 bhp పవర్, 310 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 485 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండటం దీని ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.

Byd Emax 7 Comfort Variant Launched In India Price Features Details

అలాగే 115 kW DC ఫాస్ట్ ఛార్జింగ్, 7 kW AC ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీని తక్కువ సమయంలోనే రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రంగుల ఎంపికలో క్వార్ట్జ్ బ్లూ, హార్బర్ గ్రే, క్రిస్టల్ వైట్, కాస్మోస్ బ్లాక్ అనే నాలుగు కలర్స్‌లో ఈ ఎలక్ట్రిక్ MPVను కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు ఫీచర్ల విషయంలో కూడా కొత్త కంఫర్ట్ ట్రిమ్ ఏమాత్రం నిరాశపరచదు.

12.8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, పూర్తి LED లైటింగ్, డైనమిక్ రియర్ టర్న్ సిగ్నల్స్ వంటి ఆధునిక ఫీచర్లను ఇందులో అందించారు. అంతేకాకుండా, పవర్ అడ్జస్టబుల్, ఫోల్డబుల్ ORVMలు, రియర్ వైపర్, సింథటిక్ లెదర్ అప్‌హోల్స్టరీ, 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Byd Emax 7 Comfort Variant Launched In India Price Features Details

భద్రత విషయంలో కూడా BYD ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ప్రయాణికులకు మెరుగైన రక్షణ కల్పించే ఆధునిక సేఫ్టీ ఫీచర్లతో ఈ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్, ABS, ESC, ట్రాక్షన్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరాలు, లెవెల్ 2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రేమ్‌లెస్ వైపర్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, పవర్-ఓపెనింగ్ బూట్ వంటి ఫీచర్లు కూడా లేవు.

Article Published On: Thursday, July 2, 2026, 13:35 [IST]
English summary
Byd emax 7 comfort variant launched in india price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+