ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 1000 కిమీ.. జూన్ 9న దేశం షేక్ అయ్యే కారు రాబోతుంది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చైనా దిగ్గజం బీవైడీ (BYD) సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇప్పటివరకు మనదేశంలో కేవలం ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయిస్తున్న ఈ సంస్థ.. ఇప్పుడు తన మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) మోడల్‌ను లాంచ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. జూన్ 9న ఈ సరికొత్త హైబ్రిడ్ కారును భారత మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశపెట్టబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.

మే 26న విడుదల చేసిన టీజర్‌తోనే ఈ కారుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మోడల్‌లో బీవైడీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన DM-i సూపర్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఈవీ పవర్‌ట్రెయిన్ టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు. ప్రస్తుతం రాబోయే మోడల్ పేరుపై సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ, మార్కెట్లో రెండు కార్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

byd first plug in hybrid car launch india june 9 atto 2 sealion 6 range features

భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోయే కార్లలో మొదటి స్థానంలో వినిపిస్తున్న పేరు బీవైడీ అట్టో 2 (BYD Atto 2 DM-i). ఈ కారు కొలతలు మన దేశంలో ఎంతో పాపులర్ అయిన హ్యుందాయ్ క్రెటాకు దాదాపు సమానంగా ఉంటాయి. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. దీనితో పాటు వినియోగదారులకు 7.8kWh లేదా 18kWh కెపాసిటీ ఉన్న రెండు బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి.

ఇవి వరుసగా 166 హార్స్‌పవర్ (hp), 212 హార్స్‌పవర్ (hp) శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాల (WLTP) ప్రకారం చిన్న బ్యాటరీ వేరియంట్ మొత్తం 928 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, పెద్ద బ్యాటరీ వేరియంట్ ఏకంగా 998 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఈ కారు 39 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

byd first plug in hybrid car launch india june 9 atto 2 sealion 6 range features

భారతదేశం కోసం బీవైడీ పరిశీలిస్తున్న రెండో పవర్‌ఫుల్ మోడల్ సీలియన్ 6 (BYD Sealion 6). ఇది అట్టో 2 కంటే ఒక సెగ్మెంట్ పైన కేటగిరీలో లగ్జరీగా ఉండబోతోంది. లుక్ పరంగా ఇది బీవైడీ సీలియన్ 7 ఈవీని పోలి ఉంటుంది. ఈ ప్రీమియం ఎస్‌యూవీలో 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్, టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటికి 18.3kWh లేదా 26.6kWh బ్యాటరీలను జత చేశారు.

దీని ఎన్ఏ హైబ్రిడ్ సెటప్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) ఆప్షన్‌తో 218hp పవర్‌ను జనరేట్ చేస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఇది 140 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఇక టర్బో-పెట్రోల్ పవర్‌ట్రెయిన్ మోడల్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) టెక్నాలజీతో 344hp వరకు పవర్‌ను ఇస్తూ, ఎలక్ట్రిక్ మోడ్‌లో 128 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది. పెట్రోల్, బ్యాటరీ రెండు కలిపి వాడితే ఈ కారు ఏకంగా 1,092 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ టాప్ లేపే క్లెయిమ్ చేస్తోంది.

byd first plug in hybrid car launch india june 9 atto 2 sealion 6 range features

భారతదేశంలో లాంచ్ కంటే ముందే బీవైడీ సంస్థ గ్లోబల్ మార్కెట్ కోసం సరికొత్త డాల్ఫిన్ జీ డిఎమ్-ఐ (New Dolphin G DM-i) కాంపాక్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ హ్యాచ్‌బ్యాక్ కారును అధికారికంగా లాంచ్ చేసింది. దీనిని ప్రత్యేకంగా యూరోపియన్ మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా డిజైన్ చేశారు. చార్జింగ్ మౌలిక వసతులపై పూర్తిగా ఆధారపడకుండా, ప్యూర్ ఈవీ కార్ల లాంటి డ్రైవింగ్ అనుభూతిని పొందాలనుకునే కస్టమర్లను టార్గెట్ చేస్తూ ఈ కారును తీసుకొచ్చారు.

యూరప్‌లో దీని డెలివరీలు 2026 చివరి నాటికి ప్రారంభం కానున్నాయి. దీని ధరను ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, యూకే మార్కెట్లో ఉన్న హోండా జాజ్ హైబ్రిడ్ (ధర సుమారు రూ.36.65 లక్షలు) కంటే చాలా తక్కువ ధరకే ఇది లభించే అవకాశం ఉంది. యూరప్‌లోని బి-సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ బీవైడీ డాల్ఫిన్ జీ కారు పొడవు 4,160 మిమీ ఉంటుంది. ఇది మార్కెట్లో ఉన్న ప్రముఖ మోడల్స్ అయిన ఫాక్స్‌వ్యాగన్ పోలో, రెనో క్లియో, టొయోటా యారిస్ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

సాధారణంగా చాలా కంపెనీలు మైల్డ్-హైబ్రిడ్ లేదా స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను వాడుతుంటే, బీవైడీ మాత్రం ఇందులో పూర్తి స్థాయి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్‌ను అమర్చింది. ఈ సరికొత్త హ్యాచ్‌బ్యాక్ కారు ఒక్కసారి ఫుల్ ట్యాంక్, ఫుల్ చార్జింగ్ చేస్తే 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను సునాయాసంగా ఇస్తుందని బీవైడీ గట్టిగా చెప్తోంది. ఇది యూరప్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ప్యూర్ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ కంటే చాలా ఎక్కువ కావడం విశేషం.

Article Published On: Wednesday, June 3, 2026, 7:28 [IST]
English summary
Byd first plug in hybrid car launch india june 9 atto 2 sealion 6 range features
Read more on: #electric car #byd #china
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+