1200 కి.మీ రేంజ్‌తో కొత్త హైబ్రిడ్ కార్.. పెట్రోల్ + ఎలక్ట్రిక్‌తో నడుస్తుంది.. EV మార్కెట్‌కు పోటీ!

చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడీ (BYD) ఇప్పుడు తన దిశను మరింత విస్తరించుకుంటూ, కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) ప్రపంచానికే పరిమితం కాకుండా హైబ్రిడ్ టెక్నాలజీ వైపు కూడా బలంగా అడుగులు వేస్తోంది. తాజాగా ఈ కంపెనీ ఆవిష్కరించిన DM-i (Dual Mode Intelligent) ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆటోమొబైల్ రంగంలో కొత్త చర్చకు దారితీసింది. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్‌ను తెలివిగా కలిపి పనిచేసే ఈ సిస్టమ్, డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సమర్థవంతంగా, స్మూత్‌గా మార్చడమే కాకుండా ఇంధన వినియోగాన్ని కూడా గణనీయంగా తగ్గించగలదని కంపెనీ చెబుతోంది. ఈ టెక్నాలజీ ఆధారంగా రానున్న కొత్త హైబ్రిడ్ మోడల్ భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్నట్లు సమాచారం.

ముఖ్యంగా దీని ప్రత్యేకత ఏమిటంటే, ఒకసారి ఫుల్ ఛార్జ్, ట్యాంక్‌తో కలిపి 1,200 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్‌ను అందించగల సామర్థ్యం ఉందని కంపెనీ పేర్కొనడం. అంటే దూర ప్రయాణాలు చేసే వినియోగదారులకు ఒక పెద్ద ఆప్షన్‌. EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని భారతదేశంలో, ఈ తరహా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీ వినియోగదారులకు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్‌గా నిలవొచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Byd Hybrid Technology Dm i India Launch Upcoming Car Details

ఈ కారును కంపెనీ ఇప్పటికే ప్రదర్శించి, రాబోయే నెలల్లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఏడాది చివరి నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని DM-i (Dual Mode Intelligent) హైబ్రిడ్ సిస్టమ్. ఇందులో 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ ప్రధాన శక్తి కేంద్రంగా పనిచేస్తుంది.

దీనితో పాటు BYD అభివృద్ధి చేసిన 18.3 kWh సామర్థ్యం గల బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ కూడా ఇందులో ఉంటుంది. ఈ కలయిక వల్ల కారు ఒకేసారి పెట్రోల్, ఎలక్ట్రిక్ మోడ్‌లలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సిస్టమ్‌లో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. వాటిలో ఒక మోటార్ జనరేటర్‌గా పనిచేసి బ్యాటరీకి ఎనర్జీ అందిస్తే, మరొక మోటార్ నేరుగా చక్రాలకు శక్తిని అందిస్తూ వాహనాన్ని నడిపిస్తుంది.

Byd Hybrid Technology Dm i India Launch Upcoming Car Details

ఈ కారులోని బ్యాటరీని బయట నుండి కూడా ఛార్జ్ చేయవచ్చు. అంటే ఇది కేవలం హైబ్రిడ్ మాత్రమే కాకుండా ప్లగ్-ఇన్ హైబ్రిడ్‌గా కూడా పనిచేస్తుంది. రోజువారీ ప్రయాణాల్లో దీన్ని పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనంలా 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించడం పెద్ద ప్లస్ పాయింట్. చిన్న దూరాల కోసం పెట్రోల్ అవసరం లేకుండా EVలా నడిపించవచ్చు, అలాగే దూర ప్రయాణాల్లో హైబ్రిడ్ మోడ్‌తో 1,200 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యంగా ఇది రూపొందుతోంది.

ఈ మోడల్ కేవలం టెక్నాలజీ పరంగానే కాకుండా, డిజైన్, కంఫర్ట్ పరంగా కూడా ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. ఇందులో ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చునేలా విశాలమైన కేబిన్‌ను అందించారు, దూర ప్రయాణాల్లో కూడా సౌకర్యం తగ్గకుండా ఉండేలా ఇంటీరియర్‌ను ప్రీమియం ఫీల్‌తో డిజైన్ చేశారు. ఇంటీరియర్‌లో ప్రధాన ఆకర్షణగా మధ్య భాగంలో అమర్చిన తిప్పగలిగే పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉంటుంది.

Byd Hybrid Technology Dm i India Launch Upcoming Car Details

ఇది నావిగేషన్ నుంచి ఎంటర్టైన్‌మెంట్ వరకు అన్ని ఫీచర్లను సులభంగా యాక్సెస్ చేయడానికి సహాయపడుతుంది. డ్రైవర్ ముందు భాగంలో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్‌, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. సేఫ్టీ, డ్రైవింగ్ అసిస్టెన్స్ పరంగా, లెవెల్ 2 ADAS ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇవి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్ వంటి ఆధునిక సేఫ్టీ టెక్నాలజీలను కలిగి ఉంది.

Article Published On: Wednesday, June 10, 2026, 10:19 [IST]
English summary
Byd hybrid technology dm i india launch upcoming car details
Read more on: #byd #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+