వర్షాకాలంలో కార్ డ్రైవర్లకు బంపర్ ట్రిక్.. అద్దాలపై బంగాళాదుంప రుద్దితే నీటి చుక్కలు మాయం

వర్షాకాలం వచ్చిందంటే చాలు కార్లు, ఇతర వాహనాలు నడిపేవారు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటారు.. వర్షం పడుతున్నప్పుడు కార్ల సైడ్ మిర్రర్లు, విండ్‌షీల్డ్‌లపై నీటి చుక్కలు దట్టంగా పేరుకుపోతాయి.. దీనివల్ల వెనుక నుంచి ఏ వాహనాలు వస్తున్నాయో డ్రైవర్లకు అస్సలు కనిపించదు.. అంతా గందరగోళంగా, ధుంధులాగా మారుతుంది.. అయితే, ఈ సమస్యకు మన వంటింట్లో దొరికే ఒక సాధారణ కూరగాయతో శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చని సోషల్ మీడియాలో ఒక క్రేజీ ట్రిక్ వైరల్ అవుతోంది.

సాధారణంగా వర్షం పడే రోజుల్లో సోషల్ మీడియా వ్యాప్తంగా వాహనదారులకు ఉపయోగపడే ఎన్నో రకాల చిట్కాలు, వీడియోలు విపరీతంగా షేర్ అవుతుంటాయి. ప్రస్తుతం అటువంటి వాటిలో పచ్చి బంగాళాదుంప (Potato) సహాయంతో కారు అద్దాలపై పేరుకుపోయే వర్షం నీటిని నివారించే ఒక వినూత్నమైన ట్రిక్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ట్రిక్ నిజంగానే పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నప్పటికీ, ఇది వంద శాతం పక్కాగా పనిచేస్తుందని రీల రూపంలో లైవ్ డెమోలతో సహా నిరూపిస్తున్నారు.

car glass cleaning potato trick rainy season driving tips news

లైవ్ డెమోతో క్లారిటీ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్
ఈ ఉపయోగకరమైన చిట్కాను కేవలం సాధారణ నెటిజన్లే కాకుండా, నిత్యం రోడ్లపై ట్రాఫిక్ నిబంధనలను పర్యవేక్షించే వివేకానంద్ తివారీ అనే ట్రాఫిక్ పోలీస్ అధికారి స్వయంగా వివరించారు. ఆయన ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో దీని గురించి మాట్లాడుతూ.. వర్షం పడుతున్నప్పుడు కార్ల సైడ్ మిర్రర్లపై నీటి బిందువులు నిలిచిపోవడం వల్ల వెనుక వచ్చే వాహనాలు డ్రైవర్లకు స్పష్టంగా కనిపించవని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని చెప్పారు. దీనిని నివారించడానికి ఆయన ఒక అద్భుతమైన లైవ్ ప్రయోగాన్ని చేసి చూపించారు.

బంగాళాదుంపను ఎలా ఉపయోగించాలి?
ఈ ఆలూ ట్రిక్‌ను ఉపయోగించడం చాలా సులభం. మొదటగా కారు సైడ్ మిర్రర్‌ను లేదా గ్లాస్‌ను ఒక పొడి గుడ్డతో శుభ్రంగా తూడ్చుకోవాలి. ఆ తర్వాత ఒక పచ్చి బంగాళాదుంపను మధ్యలోకి కట్ చేసి, ఆ కట్ చేసిన లోపలి తడి భాగాన్ని కారు అద్దంపై అన్ని వైపులా బాగా రుద్దాలి. అలా రుద్దిన తర్వాత ఆ గ్లాస్ పైన ఎంత నీరు పోసినా.. ఒక్క నీటి చుక్క కూడా అక్కడ నిలవకుండా కిందకు జారిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి రుద్దితే దాదాపు 10 గంటల పాటు వర్షం పడినా అద్దాలపై నీరు అస్సలు నిలవదని పోలీస్ అధికారి స్పష్టం చేశారు. అందువల్ల లాంగ్ జర్నీలు చేసే డ్రైవర్లు ఎప్పుడూ తమ వెంట ఒక ఆలూను ఉంచుకోవడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు.

car glass cleaning potato trick rainy season driving tips news

ఈ ట్రిక్ వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటి?
బంగాళాదుంపను అద్దంపై రుద్దినప్పుడు నీరు ఎందుకు నిలవడం లేదనే దానికి ఒక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. బంగాళాదుంపలో సహజసిద్ధంగా ఆక్సాలిక్ యాసిడ్ (Oxalic Acid), పిండి పదార్థం (Starch) ఉంటాయి. పచ్చి ఆలూను గ్లాస్‌పై రుద్దినప్పుడు ఈ యాసిడ్ అద్దం పైన ఒక సన్నటి అదృశ్య రక్షణ పొరను (Hydrophobic Layer) ఏర్పరుస్తుంది. ఈ పొర కారణంగా నీటి అణువులు అద్దానికి అంటుకోలేవు. దీనివల్ల వర్షం నీరు పడగానే ఏమాత్రం ఆగకుండా వెంటనే కిందకు జారిపోతుంది. ఈ ట్రిక్ కేవలం సైడ్ మిర్రర్లకే కాకుండా కారు విండో గ్లాసులకు కూడా అప్లై చేసుకోవచ్చు.

Article Published On: Wednesday, June 24, 2026, 12:43 [IST]
English summary
Car glass cleaning potato trick rainy season driving tips news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+