డిసెంబర్ 1 నుంచి కార్ల ధరల పెంపు: నవంబర్ 30 లోపు బిల్లింగ్ చేయించుకుంటే వేలల్లో ఆదా!
కొత్త కారు కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఇది మీకు కీలకమైన వార్త. ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజాలు హ్యుందాయ్, టాటా మోటార్స్ 2026 డిసెంబర్ 1 నుంచి తమ కార్ల ధరలను పెంచబోతున్నాయి. మారుతి సుజుకి ఇప్పటికే నవంబర్ 22 నుంచే ధరల పెంపును అమల్లోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కారు ప్రియులకు నవంబర్ నెలలోనే బిల్లింగ్ పూర్తి చేసుకోవడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈలోపు బిల్ చేయిస్తే పెరుగుతున్న ఆన్-రోడ్ ధరలు, ఎక్కువ పడే ఈఎంఐల భారం నుంచి తప్పించుకోవచ్చు. హ్యుందాయ్ గరిష్టంగా ₹8,000 వరకు పెంచుతుండగా, టాటా సగటున 0.5 శాతం ధరలు పెంచుతోంది. ఇక మారుతి కొన్ని నిర్దిష్ట మోడళ్లపై మాత్రమే ఈ పెంపును వర్తింపజేసింది.
ఈ ధరల పెంపుపై కంపెనీలు ఇప్పటికే స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా సమాచారం ఇచ్చాయి. "డిసెంబర్ 1, 2026 నుంచి సగటున 0.5% ధరలు పెంచుతున్నాం" అని టాటా మోటార్స్ తెలిపింది. తయారీ వ్యయం పెరిగినందున "ఎంపిక చేసిన మోడళ్లపై నవంబర్ 22, 2026 నుంచి ధరలు పెంచుతున్నాం" అని మారుతి స్పష్టం చేసింది. ఇక హ్యుందాయ్ మోటార్స్ కూడా డిసెంబర్ 1 నుంచి సెలెక్టెడ్ మోడళ్లపై "గరిష్టంగా ₹8,000 వరకు" పెంచుతున్నట్లు వెల్లడించింది.

డిసెంబర్ 1 నుంచి హ్యుందాయ్, టాటా కార్ల ధరల పెంపు: AP, TS వినియోగదారులపై పడే ప్రభావమిదే
కారు ఎక్స్-షోరూమ్ ధర పెరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పన్నుల భారం కూడా పెరుగుతుంది. తెలంగాణలో ₹10 లక్షల లోపు కార్లకు 13 శాతం, ₹10–20 లక్షల కార్లకు 14 శాతం లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ పన్ను వరుసగా 12 శాతం, 14 శాతంగా ఉంది. దీనికి అదనంగా లైఫ్ ట్యాక్స్‌పై 10 శాతం రోడ్-సేఫ్టీ సెస్ కూడా పడుతుంది. దీనివల్ల ఎక్స్-షోరూమ్ ధర ₹8,000 పెరిగితే.. తెలంగాణలో ఆన్-రోడ్ ధర సుమారు ₹1,040 నుంచి ₹1,120 వరకు, అలాగే ఎపిలో ₹1,056 నుంచి ₹1,232 వరకు అదనంగా పెరుగుతుంది.
₹5–15 లక్షల బడ్జెట్ కార్లు: వేగంగా బిల్లింగ్ చేసుకోవాల్సిన మోడళ్లు ఇవే
మీరు ₹5-15 లక్షల బడ్జెట్‌లో కారు కొనాలనుకుంటే కొన్ని మోడళ్లను త్వరగా ఫైనల్ చేయడం మంచిది. హ్యుందాయ్ ఎక్స్‌టర్, ఐ20, ఆరా.. అలాగే టాటా పంచ్, నెక్సాన్, టియాగో, టిగోర్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. హ్యుందాయ్ కారు కొంటే ఎక్స్-షోరూమ్ ధర ₹8,000 వరకు పెరగొచ్చని గుర్తుంచుకోండి. దీనివల్ల స్టేట్ లైఫ్ ట్యాక్స్ కూడా పెరుగుతుంది. ఇక టాటా కారు విషయానికొస్తే.. ₹9 లక్షల కారుపై 0.5 శాతం పెంపు అంటే సుమారు ₹4,500 అదనంగా పడుతుంది. అలాగే ఐదేళ్ల కాలవ్యవధికి లోన్ తీసుకుంటే, ప్రతి ₹10,000 రుణానికి నెలకు దాదాపు ₹210 నుంచి ₹215 వరకు ఈఎంఐ పెరుగుతుంది.
AP, TS ఆన్-రోడ్ ధరలు, ఈఎంఐల లెక్కలు ఇవే
మీ అవగాహన కోసం కింద ఉన్న చార్ట్‌ను పరిశీలించండి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని లైఫ్ ట్యాక్స్ స్లాబ్‌లు, ఎపి రోడ్-సేఫ్టీ సెస్ ఆధారంగా అంచనాలను అందించాం. ఈ ఈఎంఐ లెక్కలు 10 శాతం వడ్డీ రేటుతో ఐదేళ్ల లోన్ ప్రాతిపదికన తయారు చేసినవి. మీ బ్యాంక్ వడ్డీ రేటు, ఇన్సూరెన్స్, డౌన్ పేమెంట్‌ను బట్టి చివరి మొత్తంలో కాస్త మార్పులు ఉండవచ్చు. కానీ ధరల పెంపు వల్ల పడే అదనపు భారం స్పష్టంగా తెలుస్తుంది.
| పరిస్థితి / పెంపు | తెలంగాణ ఆన్-రోడ్ వ్యత్యాసం | ఆంధ్రప్రదేశ్ ఆన్-రోడ్ వ్యత్యాసం | ఈఎంఐలో మార్పు |
|---|---|---|---|
| ₹8,000 పెంపు; ₹10 లక్షల లోపు స్లాబ్ | ≈₹1,040 (13% LTT) | ≈₹1,056 (12% LTT + 10% సెస్) | తీసుకునే ప్రతి ₹10,000 లోన్‌పై నెలకు ≈₹210 |
| ₹8,000 పెంపు; ₹10–20 లక్షల స్లాబ్ | ≈₹1,120 (14% LTT) | ≈₹1,232 (14% LTT + 10% సెస్) | తీసుకునే ప్రతి ₹10,000 లోన్‌పై నెలకు ≈₹210 |
నవంబర్ 30కి ముందే డీలర్ బిల్లింగ్ పూర్తి చేయండి
కారు బుక్ చేసుకున్నంత మాత్రాన పాత ధర వర్తించదు; ఇన్వాయిస్ (బిల్లింగ్) తేదీ మాత్రమే ప్రామాణికం. అందుకే నవంబర్ 30 లోపే రిటైల్ ఇన్వాయిస్ పూర్తి చేయాలని మీ డీలర్‌ను కోరండి, దానిపై లిఖితపూర్వక ధృవీకరణ తీసుకోండి. పాత టాటా నిబంధనల ప్రకారం కూడా కట్-ఆఫ్ తేదీకి ముందు బిల్లింగ్ అయిన వాహనాలకే ధరల రక్షణ వర్తిస్తుంది. ప్రోఫార్మా కొటేషన్లకు కాలం చెల్లుతుందని, అసలు బిల్లింగ్ ఆధారంగానే ధర ఖరారవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే తేదీలతో సహా ప్రతీ డాక్యుమెంట్‌ను భద్రంగా ఉంచుకోండి.
డిసెంబర్ తర్వాత కొనాలా? వేచి చూడాలా? VIN సంవత్సరం, స్టాక్ విశేషాలు
ఇప్పుడే కారు కొనడం వల్ల డిసెంబర్ 1 నాటి ధరల పెంపు, దాని ఆధారంగా పెరిగే పన్నుల భారం నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ డిసెంబర్‌లో కొంటే ఆఫర్లు, డిస్కౌంట్లు రావచ్చు కానీ, ఆ కార్లన్నీ 2026 విఐఎన్ (VIN) తయారీ సంవత్సరంతో వస్తాయి. మీకు 2027 VIN మోడల్ కారే కావాలనుకుంటే జనవరి డెలివరీ కోసం ప్లాన్ చేసుకోండి. అయితే ఆ సమయంలో కొన్ని రంగులు లేదా వేరియంట్లు అందుబాటులో ఉండకపోవచ్చు. ఏదేమైనా పూర్తి డబ్బులు చెల్లించే ముందే కారు కేటాయింపు (Allotment), VIN, బిల్లింగ్ తేదీని డీలర్ వద్ద కన్ఫర్మ్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని తెలివైన కారు కొనుగోలుదారులు నవంబర్ నెలలోనే బిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని, తమకు నచ్చిన రంగును ఎంచుకుని ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీకు 2027 VIN లేదా నిర్దిష్ట వేరియంట్ మాత్రమే కావాలనుకుంటే, పెరిగే ధరలు-పన్నులను బడ్జెట్‌లో లెక్కలోకి తీసుకోండి. అలాగే యాక్సెసరీలు లేదా ఫైనాన్సింగ్ డిస్కౌంట్ల కోసం డీలర్లతో బేరమాడండి. స్పష్టమైన డాక్యుమెంట్లు, సరైన ప్లానింగ్ ఉంటే మీ జేబుకు చిల్లు పడకుండా సమయానికి కారు సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications
