బంగారం లాంటి 3 CNG కార్లు.. రూ.5–7 లక్షల రేంజ్‌లో కొనచ్చు! 33 కి.మీ+ మైలేజ్
గత కొన్నేళ్లుగా CNG కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, సాధారణ వినియోగదారులు తక్కువ ఖర్చుతో నడిచే ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో CNG కార్లు మంచి ఎంపికగా మారాయి. ఇటీవల CNG ధరలు కూడా కొంత పెరిగినప్పటికీ, పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఇది ఇంకా చాలా తక్కువ ఖర్చుతో ఉండటంతో వినియోగదారులు CNG వైపే ఎక్కువగా ఆకర్షితమవుతున్నారు. రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు CNG కార్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మారుతి CNG మోడళ్లలో కొన్ని కార్లు దాదాపు లీటర్‌కు సమానంగా 30 నుండి 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తున్నాయి. ఈ కథణంలో మారుతి ఈకో, ఎస్ ప్రెస్సో, ఆల్టో కె10 సీఎన్‌జీ కార్ల గురించి చూద్దాం.
Maruti Suzuki Eeco: మారుతి సుజుకి ఈకో భారత మార్కెట్లో ఒక ప్రాక్టికల్, బడ్జెట్ ఫ్రెండ్లీ వాహనంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, వాణిజ్య రవాణా సేవలు, చిన్న వ్యాపారాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ వాహనం K-సిరీస్ 1.2 లీటర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. పెట్రోల్ వెర్షన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ 80.76 PS పవర్‌ను, 104.5 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

CNG మోడ్‌లో ఈకో 71.65 PS పవర్,95 Nm టార్క్‌ను అందిస్తుంది. CNG సుమారు 27.05 కి.మీ/కేజీ వరకు మైలేజ్ ఇస్తుంది. ధర విషయానికి వస్తే, మారుతి ఈకో రూ.6.47 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర నుంచి రూ.7.90 లక్షల వరకు లభిస్తోంది. ఈకోను ప్రధానంగా వ్యాన్ విభాగంలో ఉపయోగిస్తారు. స్కూల్ వ్యాన్‌గా, ఆసుపత్రి రవాణా వాహనంగా, అలాగే చిన్న వాణిజ్య ప్రయాణీకుల రవాణా సేవల్లో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు.
Alto K10 LXi (O) CNG: ఈ కారు ధర రూ.4.82 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇంజిన్ విషయానికి వస్తే, మారుతి ఆల్టో కె10 LXi (O) CNG వేరియంట్‌లో 998 cc సామర్థ్యం గల 3 సిలిండర్ ఇన్‌లైన్ ఇంజిన్‌ను అందించారు. ఇది 4 వాల్వ్స్ పర్ సిలిండర్, SOHC టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ రోజువారీ నగర ప్రయాణాలకు సరిపడే స్మూత్ పనితీరు, మైలేజ్ అందిస్తుంది.

సుమారు 33.85 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ఈ స్థాయి మైలేజ్ వినియోగదారులకు పెద్ద ఉపశమనంగా మారుతోంది. ఈ కారు ధర రూ.4.77 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. అలాగే USB, బ్లూటూత్, AUX కనెక్టివిటీ, కొత్త డిజైన్ చేసిన స్టీరింగ్ వీల్ మొదలగునవి సౌకర్యంగా ఉన్నాయి.
S-Presso LXi (O) CNG: మారుతి S-Presso LXi (O) CNG వేరియంట్‌లో K10C CNG ఇంజిన్‌ను అందించారు. ఇది 998 cc సామర్థ్యం గల 3 సిలిండర్ ఇన్‌లైన్ ఇంజిన్, 4 వాల్వ్స్ పర్ సిలిండర్, DOHC టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 56 bhp పవర్‌ను 5300 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. CNG వేరియంట్ విషయానికి వస్తే, ఇది సుమారు 32.73 కి.మీ/కేజీ మైలేజ్‌ను అందిస్తుంది.

ఇది రూ.5.51 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఫీచర్ల పరంగా చూస్తే, S-Pressoలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు, ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. అలాగే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications