ధర కేవలం రూ.4.24 లక్షలే.. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 1200 కిమీ రేంజ్ ఇచ్చే కారు..మార్కెట్లో సంచలనం

భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ, ఇంధన ఖర్చులను తగ్గించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వినియోగాన్ని పెంచాలని స్వయంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దీని తర్వాత దేశీయ ఈవీ మార్కెట్‌లో ఊహించని రేంజ్ డిమాండ్ పెరిగింది. చాలా మంది కస్టమర్లు తమ పాత ఐసీఈ (ICE-పెట్రోల్/డీజిల్) వాహనాలను వదిలేసి ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం భారత మార్కెట్లో టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీలు అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లుగా అందుబాటులో ఉన్నాయి. అయితే మధ్యతరగతి ప్రజలు ఇంకా తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ లేదా రేంజ్ ఇచ్చే కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రజల బడ్జెట్ ఈవీ అవసరాలను తీర్చేందుకు చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బెస్ట్‌ట్యూన్ (Bestune) ఒక సూపర్ మైక్రో కారును తీసుకువచ్చింది.

china bestune xiaoma small electric car 1200km range price details launch updates

ఈ కంపెనీ చైనా మార్కెట్లో విడుదల చేసిన షాఓమా (Xiaoma) అనే చిన్న ఎలక్ట్రిక్ కారు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి ప్రధాన కారణం ఈ కారు చాలా తక్కువ ధరలో లభించడమే కాకుండా, ఊహించని రేంజ్ ఇవ్వడమే. చైనా కరెన్సీ ప్రకారం దీని ధర 30,000 నుంచి 50,000 యువాన్ల మధ్య ఉంది, అంటే మన భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.4.24 లక్షల నుంచి రూ.7.07 లక్షల వరకు ఉంటుంది.

ఈ కారులో ఉపయోగించిన అధునాతన బ్యాటరీ టెక్నాలజీ కారణంగా ఇది చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. బెస్ట్‌ట్యూన్ షాఓమా కారును పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం చైనాలో ఇలాంటి మైక్రో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది.

china bestune xiaoma small electric car 1200km range price details launch updates

వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ వంటి కంపెనీలు ఇప్పటికే భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించడంతో.. ఇప్పుడు ఈ చౌకైన చైనా కారు ఎప్పుడు ఇండియాకు వస్తుందా అని ఇక్కడి కస్టమర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కారును కంపెనీ హార్డ్‌టాప్, కన్వర్టిబుల్ (ఓపెన్ రూఫ్) అనే రెండు వేరియంట్లలో డిజైన్ చేసింది, అయితే ప్రస్తుతం హార్డ్‌టాప్ వేరియంట్ మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంది.

ఈ కారు లుక్స్ ఏదైనా యానిమేషన్ సినిమాలో వచ్చే కారు తరహాలో చాలా క్యూట్‌గా ఉంటాయి. ఇందులో రౌండ్ ఎడ్జెస్‌తో కూడిన పెద్ద స్క్వేర్ హెడ్‌ల్యాంప్స్, ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ ఇచ్చారు. కారు లోపల 7 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-టోన్ థీమ్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్ ఉన్నాయి. అలాగే కారు రేంజ్ పెంచడానికి ఉపయోగపడే ప్రత్యేక ఏరోడైనమిక్ వీల్స్‌ను ఇందులో అమర్చారు.

బెస్ట్‌ట్యూన్ షాఓమా కారును ప్రత్యేకమైన ఎఫ్‌ఎమ్ఈ (FME) ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇందులో ప్యూర్ ఈవీ, రేంజ్ ఎక్స్‌టెండర్ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. ప్యూర్ ఈవీ మోడ్‌లో 800 కిలోమీటర్ల వరకు, రేంజ్ ఎక్స్‌టెండర్ టెక్నాలజీతో 1200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ లభిస్తుంది. ఈ మైక్రో కారులో 20 కిలోవాట్ల సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌ను వెనుక భాగంలో అమర్చారు.

దీని కోసం గోషన్, ఆర్‌ఈపీటీ కంపెనీలు సరఫరా చేసిన లిథియం-ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని ఉపయోగించారు. సేఫ్టీ కోసం డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌ను అందించారు. ఈ 3-డోర్ల చిన్న కారు 3000 మిమీ పొడవు, 1510 మిమీ వెడల్పు, 1630 మిమీ ఎత్తు, 1,953 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉండి సిటీ ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది.

Article Published On: Friday, June 12, 2026, 9:02 [IST]
English summary
China bestune xiaoma small electric car 1200km range price details launch updates
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+