ఇది ఆఫర్ కాదు బంపర్ ఆఫర్.. రూ.4.99 లక్షల కారు మీద ఏకంగా రూ.1.1 లక్షల డిస్కౌంట్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ ఇండియా (Citroen India) జూన్ నెలలో కొత్త కారు కొనాలనుకునే వినియోగదారుల కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన ప్రొడక్ట్ రేంజ్‌లోని కార్లపై భారీ ఎత్తున డిస్కౌంట్లను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీకి చెందిన పాపులర్ ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ సిట్రోయిన్ C3 (Citroen C3) మోడల్‌పై ఏకంగా రూ.1.10 లక్షల వరకు భారీ ప్రయోజనాలను అందిస్తోంది. మార్కెట్లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో, సేల్స్ పెంచుకోవడమే లక్ష్యంగా కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ధరను తగ్గించినట్లు ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
ధరల వివరాలు, మార్కెట్ పోటీ
భారత మార్కెట్లో సిట్రోయిన్ C3 కారు సాధారణ ఎక్స్-షోరూమ్ ధరలు రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ మోడల్ రూ.9.60 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ప్రకటించిన రూ.1.10 లక్షల డిస్కౌంట్ కారణంగా బేస్ మోడల్ ధర మరింత తగ్గి సామాన్యులకు సైతం అందుబాటులోకి రానుంది. ఈ కారు మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన టాటా పంచ్ (Tata Punch), హ్యుందాయ్ ఎక్స్టర్, టయోటా టైజర్, మారుతి ఫ్రాంక్స్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ వంటి గట్టి పోటీ ఉన్న కార్లతో తలపడుతోంది.

మరింత లగ్జరీగా సరికొత్త సిట్రోయిన్ C3X
సిట్రోయిన్ సంస్థ తన లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కూడిన C3X మోడల్‌ను కూడా రంగంలోకి దించింది. స్టాండర్డ్ C3 మోడల్‌తో పోలిస్తే ఇందులో ఏకంగా 15 కొత్త ఫీచర్లను అదనంగా జోడించారు. ఇందులో ప్రాక్సీ-సెన్స్ ప్యాసివ్ ఎంట్రీ అండ్ పుష్ స్టార్ట్, కీ-లెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ ప్లస్ స్పీడ్ లిమిటర్ వంటి అత్యాధునిక టెక్నాలజీని అందించారు. కారు లోపల కంఫర్ట్ కోసం 10.25 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, ఆటోమేటిక్ ఏసీ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీకి పెద్దపీట.. 360 డిగ్రీల కెమెరా
ప్రయాణికుల రక్షణ కోసం సిట్రోయిన్ C3X మోడల్‌లో టాప్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను అమర్చారు. ఇందులో చుట్టుపక్కల ప్రాంతాలను క్లియర్ గా చూపే హ్యాలో (HALO) 360 డిగ్రీల కెమెరా సిస్టమ్, ప్రమాద సమయాల్లో రక్షణగా నిలిచే 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా ఇచ్చారు. ఇవి కాకుండా చీకట్లోనూ దారి స్పష్టంగా కనిపించేలా ఎల్‌ఈడీ విజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ (DRLs), ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇందులో భారీగా 315 లీటర్ల బూట్ స్పేస్, వెనుక సీటు ప్రయాణికుల కోసం యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పాయింట్లను కూడా అందించారు. ఇది మార్కెట్లో మారుతి స్విఫ్ట్, వ్యాగన్ ఆర్ లాంటి కార్లకు కూడా పోటీ ఇస్తోంది.

పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్లు, రియల్ మైలేజ్ టెస్ట్
ఇంజన్ విషయానికి వస్తే, ఈ కారు రెండు ఆప్షన్లలో లభిస్తుంది. మొదటిది 82 హార్స్‌పవర్ (hp) ప్రొడ్యూస్ చేసే 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్). ఇక రెండవది మరింత పవర్‌ఫుల్ గా ఉండే 110 హార్స్‌పవర్, 205Nm టార్క్ జనరెట్ చేసే 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో వస్తుంది.
ఆటోకార్ ఇండియా చేసిన రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్ ప్రకారం.. కంపెనీ 18.30 కిలోమీటర్ల మైలేజ్ క్లెయిమ్ చేయగా, సిటీలో 8.46 Kmpl, హైవేపై 13.38 Kmpl మైలేజ్ వచ్చినట్లు తేలింది. దీని యాక్సిలరేషన్ చాలా అద్భుతంగా ఉండి, కేవలం 10 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్లు వేర్వేరు నగరాలు, డీలర్లను బట్టి మారే అవకాశం ఉన్నందున కొనే ముందు ఒకసారి స్థానిక షోరూమ్‌లో కనుక్కోవడం మంచిది.


Click it and Unblock the Notifications