టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ సిట్రోయెన్ ఈసీ3ఎక్స్.. రెండింటిలో ఏ కారు బెస్ట్?

భారతదేశంలో ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పోటీ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. రోజువారీ సిటీ ప్రయాణాలతో పాటు అప్పుడప్పుడు హైవే రైడ్స్ కు వెళ్లాలనుకునే వారి కోసం కంపెనీలు తక్కువ ధరలోనే ఈవీలను అందిస్తున్నాయి. ఈ రేస్ లో ఇప్పటివరకు టాటా మోటార్స్ హవా నడుస్తుండగా, ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ తన కారును సరికొత్తగా అప్‌డేట్ చేసి టాటాకు గట్టి సవాల్ విసిరింది. తన ఎక్స్ (X) లైనప్ లో భాగంగా సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ మోడల్ ను లాంచ్ చేయగా, టాటా సైతం అదనపు ఫీచర్లు, కొత్త లుక్స్ తో టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ ను రంగంలోకి దించింది.

లుక్స్, డిజైన్ పరంగా తేడాలు
మొదటగా డిజైన్ విషయానికి వస్తే, ఈ రెండు కార్లు కాంపాక్ట్ సైజులోనే ఉన్నప్పటికీ వాటి ఐడెంటిటీ వేరుగా ఉంటుంది. సిట్రోయెన్ తన ఈసీ3ఎక్స్ మోడల్ ను ఒక క్రాస్‌ఓవర్ లాగా డిజైన్ చేసింది. ఇది చూడటానికి ఒక ఎస్‌యూవీ లాంటి లుక్ ను ఇస్తుంది. ఇందులో సరికొత్త ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, డిఆర్ఎల్స్, ఎల్ईడీ ఫాగ్ ల్యాంప్స్, 15-ఇంచుల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఇచ్చారు.

Citroen eC3X Vs Tata Tiago EV Facelift Has Citroen Finally Outsmarted Tata In Affordable EV Race

దీనికి భిన్నంగా టాటా టియాగో ఈవీ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ శైలిని కొనసాగిస్తోంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ లో లక్స్ బీమ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 14-ఇంచుల హైపర్‌స్టైల్ వీల్స్, డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ ఇచ్చి మరింత మోడ్రన్ గా మార్చారు.

బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ వివరాలు
ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత కీలకమైన బ్యాటరీ విషయానికి వస్తే, సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ లో 20.2 కిలోవాట్ అవర్ (kWh) బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. ఇది 57 పీఎస్ పవర్, 143 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఇది గరిష్టంగా 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Citroen eC3X Vs Tata Tiago EV Facelift Has Citroen Finally Outsmarted Tata In Affordable EV Race

మరోవైపు టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ లో వినియోగదారులకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 19.2 కిలోవాట్ అవర్, 24 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్‌లు లభిస్తాయి. ఇది గరిష్టంగా 55 కిలోవాట్ల పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. దీని గరిష్ట రేంజ్ 285 కిలోమీటర్లు. రియల్ వరల్డ్ రేంజ్ పరంగా రెండింటి మధ్య పెద్ద తేడా లేకపోయినప్పటికీ, సిట్రోయెన్ కాస్త ఎక్కువ మైలేజ్ ఆఫర్ చేస్తోంది.

సైజు, క్యాబిన్ స్పేస్
కారు సైజు, లోపల ఉండే స్థలం (డైమెన్షన్స్) విషయంలో సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. దీని పొడవు 3981 మిల్లీమీటర్లు, అలాగే వీల్‌బేస్ 2540 మిల్లీమీటర్లుగా ఉంది. కారు పెద్దదిగా ఉండటం వల్ల వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు మంచి లెగ్‌రూమ్, సౌకర్యం లభిస్తాయి. ఇందులో బూట్ స్పేస్ కూడా 315 లీటర్లుగా కాస్త ఎక్కువగా ఉంటుంది.

టాటా టియాగో ఈవీ పొడవు 3825 మిల్లీమీటర్లు, వీల్‌బేస్ 2400 మిల్లీమీటర్లు మాత్రమే. ఇది సిటీ రోడ్లపై సులభంగా డ్రైవ్ చేయడానికి, పార్కింగ్ చేయడానికి వీలుగా చిన్న సైజులో ఉంటుంది. ఇందులో బూట్ స్పేస్ 240 లీటర్లుగా ఉంటుంది.

Citroen eC3X Vs Tata Tiago EV Facelift Has Citroen Finally Outsmarted Tata In Affordable EV Race

ఫీచర్లు, టెక్నాలజీ
ఆధునిక ఫీచర్లు, అధునాతన టెక్నాలజీ విషయానికి వస్తే టాటా మోటార్స్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ లో సెగ్మెంట్ లోనే బెస్ట్ ఫీచర్లను జోడించారు. ఇందులో 26.03 సెంటీమీటర్ల ఆల్ట్రావ్యూ హెచ్‌డీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఐఆర్ఏ ఈవీ (iRA.ev) కనెక్టెడ్ టెక్నాలజీతో 40కి పైగా ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఐపీ67 బ్యాటరీ ప్రొటెక్షన్ వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ లో కేవలం అవసరమైన ప్రాక్టికల్ ఫీచర్లపైనే దృష్టి పెట్టారు. ఇందులో 10.25 ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 6 జేబీఎల్ స్పీకర్లు, డ్యాష్‌క్యామ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు. టెక్నాలజీ పరంగా టాటా కారే ఎక్కువ వాల్యూ ఇస్తుంది.

ధర, తుది తీర్పు
చివరగా ధరల విషయానికి వస్తే, టాటా టియాగో ఈవీ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.99 లక్షలుగా ఉంది. ఒకవేళ బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) విధానంలో తీసుకుంటే ఈ కారు కేవలం రూ.4.69 లక్షలకే లభిస్తుంది. అదే సమయంలో సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ ప్రారంభ ధర రూ.10.25 లక్షలుగా కొంచెం ప్రీమియంగా ఉంది. కానీ దీనిని కూడా బాస్ (BaaS) స్కీమ్ కింద రూ.6.89 లక్షల ప్రారంభ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఫైనల్లీ.. తక్కువ బడ్జెట్ లో, ఎక్కువ ఫీచర్లు, సిటీ ఫ్రెండ్లీ కారు కావాలనుకునే వారికి టాటా టియాగో ఈవీ బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా ఎక్కువ స్పేస్, ఎస్‌యూవీ లాంటి రోడ్ ప్రెజెన్స్, అదనపు మైలేజ్ కోరుకునే వారికి సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ సరైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

Article Published On: Friday, June 19, 2026, 11:53 [IST]
English summary
Citroen ec3x vs tata tiago ev facelift has citroen finally outsmarted tata in affordable ev race
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+