మరో 4 రోజుల్లో ఆటోమొబైల్ మార్కెట్ షేక్ అవ్వబోతుంది.. నిస్సాన్ అసలైన అణుబాంబును దింపుతోంది
జనవరి 21.. దేశవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తేదీ. జపనీస్ కార్ల దిగ్గజం నిస్సాన్ (Nissan) తన సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ తరహా ఎంపీవీ గ్రావైట్(Nissan Gravite)తో భారత మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. కేవలం 4 రోజుల్లోనే ఈ కారు ధరలు, ఫీచర్లు అధికారికంగా వెల్లడి కానున్నాయి. మరి ఈ కారులో మీరు ఏమేం ఆశించవచ్చు? నిస్సాన్ ప్లాన్ ఏంటి? ఈ విశేషాలన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం.
నిస్సాన్ ఇండియా 2026 సంవత్సరంలో తన మొదటి బాంబును పేల్చబోతోంది. అదే నిస్సాన్ గ్రావైట్. ఇది రెనో ట్రైబర్ (Renault Triber) నిర్మించబడిన అదే అడ్వాన్స్‌డ్ CMF-A+ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించబడింది. అయితే, ట్రైబర్ కంటే భిన్నమైన, ప్రీమియం లుక్‌ను గ్రావైట్‌లో చూడవచ్చు. నిస్సాన్ ఇటీవల తన ఎగుమతులలో రికార్డు సృష్టించింది. 2025 డిసెంబర్‌లో ఏకంగా 13,470 వాహనాలను ఎగుమతి చేసి, గత 10 ఏళ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ నమ్మకంతోనే ఇప్పుడు గ్రేవైట్‌ను మార్కెట్లోకి తెస్తోంది.

గ్రావైట్ ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. ముందు భాగంలో హనీకోంబ్ ప్యాటర్న్ గ్రిల్, గంభీరమైన బోనెట్, నిస్సాన్ సిగ్నేచర్ స్టైలింగ్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. వెనుక వైపు కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, ఆకర్షణీయమైన రూఫ్ స్పాయిలర్ దీనికి మోడరన్ లుక్‌ను ఇస్తాయి. లోపల మూడు వరుసల సీటింగ్ తో 7 మంది హాయిగా ప్రయాణించేలా క్యాబిన్‌ను డిజైన్ చేశారు. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
గ్రావైట్‌లో ప్రధానంగా 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది దాదాపు 71 BHP పవర్‌ను ఇస్తుంది. అయితే, కారులో లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు పవర్ తగ్గకుండా ఉండేందుకు నిస్సాన్ ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా ఇచ్చే అవకాశం ఉంది. గేర్ బాక్స్ విషయానికి వస్తే 5-స్పీడ్ మాన్యువల్, AMT (ఆటోమేటిక్) ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

ప్రస్తుతం నిస్సాన్ కేవలం మాగ్నైట్ (Magnite) కారుతోనే నెట్టుకొస్తోంది. అందుకే గ్రావైట్ వంటి కొత్త మోడల్స్ సక్సెస్ అవ్వాలంటే సర్వీస్ నెట్‌వర్క్ కూడా పెరగాలి. ఈ విషయాన్ని గ్రహించిన నిస్సాన్, 2027 నాటికి దేశవ్యాప్తంగా తన టచ్ పాయింట్లను ప్రస్తుతమున్న 155 నుండి 250కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రావైట్ కారు మార్చి 2026 కల్లా షోరూమ్‌లలో సందడి చేయనుంది. దీని తర్వాత ఫిబ్రవరి 4న నిస్సాన్ తన అద్భుతమైన టెక్టాన్ (Tekton) ఎస్‌యూవీని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.
నిస్సాన్ గ్రేవైట్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, భారత మార్కెట్లో తన ఉనికిని చాటుకోవాలని నిస్సాన్ వేస్తున్న బలమైన అడుగు ఎలా పడుతుందో చూడాలి. మరి ఈ 4 రోజుల్లో ఈ కారు ధర ఎంత ఉంటుంది, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications








