ధురంధర్ సినిమాలో ఇవి గమనించారా? కార్లు, బైక్‌లే హైలైట్! ఒక్కో సీన్‌లో ఒక్కోటి.. ఏం వాడారో చూడండి!
భారతదేశంలో భారీ విజయాన్ని నమోదు చేసిన ధురందర్ (Dhurandhar) మొదటి భాగానికి సీక్వెల్‌గా వచ్చిన ధురందర్ ది రివెంజ్ (Dhurandhar The Revenge) మార్చి 18 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఈ చిత్రం, దేశవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధిస్తుందనే అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. మొదటి భాగం ఇచ్చిన ఇంపాక్ట్ కారణంగా, రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. యాక్షన్ ప్రధానంగా నడిచే ఈ సినిమాలో, హై-ఆక్టేన్ ఛేజ్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా అంతటా కార్లు, బైక్‌లు వేగంగా దూసుకుపోతూ కనిపిస్తూ, ప్రేక్షకులకు థ్రిల్‌ను అందిస్తాయి. ముఖ్యంగా, సినిమాలో ఉపయోగించిన వాహనాలను సాధారణంగా కాకుండా, మరింత అగ్రెసివ్‌గా కనిపించేలా మాడిఫై చేయడం విశేషం.
ఈ మార్పులు కేవలం లుక్‌కే కాకుండా, యాక్షన్ సీన్స్‌ను మరింత రియలిస్టిక్‌గా చూపించడానికి కూడా ఉపయోగపడ్డాయి. ఈ నేపథ్యంలో, ధురందర్ మొదటి భాగంలో ఉపయోగించిన కార్లు, బైక్‌లు కూడా ప్రత్యేక చర్చకు వస్తున్నాయి. అవి సినిమా స్టోరీకి అనుగుణంగా ఎంపిక చేయబడటం, అలాగే వాటి డిజైన్, మాడిఫికేషన్ కలిసి ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రత్యేకమైన ఫీలింగ్‌ను తీసుకువచ్చాయి. వాటి గురించి ఈ కథణంలో చూద్దాం.

Triumph Bonneville T120: కథానాయకుడు రణవీర్ సింగ్ (Ranveer Singh) వాడే బైక్‌పై చాలా మంది ప్రేక్షకులకు ఒక అపోహ ఉంది. చాలా మంది అది మోడిఫై చేసిన Royal Enfield బైక్ అని భావిస్తారు. కానీ వాస్తవానికి అది ట్రయంఫ్ మోటార్‌సైకల్స్ తయారు చేసిన 1200cc ఇంజిన్‌తో వచ్చే బైక్. ఇది క్లాసిక్ లుక్‌తో పాటు పవర్‌ఫుల్ పనితీరును అందిస్తూ సినిమాలో హీరో క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది.
Lexus LX470: ఎస్పీ చౌదరి అస్లాం పాత్రలో కనిపించిన సంజయ్ దత్(Sanjay Dutt) ఉపయోగించిన SUV కూడా ప్రత్యేకంగా నిలిచింది. సినిమాలో ఆయన ఎక్కువగా తెల్లటి SUVలో కనిపిస్తారు. ముఖ్యంగా సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) మొదటిసారి కలుసుకునే సన్నివేశంలో, షూటింగ్ జరుగుతున్న సమయంలో సంజయ్ దత్ ఈ SUVలో కూర్చుని ఉండే షాట్ గుర్తుండేలా ఉంటుంది. అది లగ్జరీ బ్రాండ్ Lexusకు చెందిన Lexus LX470.

Toyota Land Cruiser 60 Series: టయోటా ల్యాండ్ క్రూయిజర్ 60 సిరీస్ పవర్‌ఫుల్ SUVను అనేక సన్నివేశాల్లో చూపించారు. ముఖ్యంగా 'ఫాలా' అనే హిట్ పాటలో అక్షయ్ ఖన్నా బలూచిస్తాన్‌కు ప్రయాణించే సమయంలో ఈ వాహనాన్ని ఉపయోగించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో ఉపయోగించినది 60 సిరీస్‌లోని FJ60 మోడల్, ఇది 1980లు, 90లలో తయారైన అత్యంత నమ్మకమైన, దృఢమైన ల్యాండ్ క్రూయిజర్ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
Land Rover Defender 110: ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 విషయానికి వస్తే, సినిమాలో మేజర్ ఇక్బాల్ పాత్రలో కనిపించే వ్యక్తి ఎక్కువగా ఈ కారే ఉపయోగిస్తాడు. ఈ వాహనం దృఢత్వం, ఆఫ్-రోడ్ సామర్థ్యం, మిలిటరీ స్టైల్ డిజైన్ కారణంగా యాక్షన్ సన్నివేశాలకు చాలా బాగా సరిపోతుంది. ముఖ్యంగా ఆయుధాల డీలింగ్, హై టెన్షన్ సీన్స్‌లో ఈ SUV పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపించడంలో సహాయపడింది.

Ford Zodiac Mark III: ముఖ్యంగా అక్షయ్ ఖన్నా పాత్రలో కనిపించే సన్నివేశాల్లో, పలు క్లాసిక్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వాటిలో ఫోర్డ్ జోడియాక్ మార్క్ 3 ప్రత్యేక ఆకర్ణణగా నిలుస్తుంది. 1965లో తయారైన ఈ కారు, 1962 నుంచి 1966 మధ్య ఫోర్డ్ రూపొందించిన ప్రీమియం సెడాన్‌లలో ఒకటి. ఈ వాహనం సినిమాలో కనిపించడం వల్ల క్లాసిక్ ఫీల్‌తో పాటు స్టైల్‌కు కూడా ప్రత్యేక టచ్ వచ్చింది.
ఇక ఇతర వాహనాల విషయానికి వస్తే, సినిమాలో రియలిస్టిక్ టచ్ కోసం పలు పాపులర్ కార్లు, పికప్ ట్రక్కులను ఉపయోగించారు. పోలీస్ వాహనాలుగా Honda City 1998, Mitsubishi Lancer కార్లను చూపించగా, Tata Xenon వాహనాలు కూడా కనిపిస్తాయి. Isuzu D-Max కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ వాహనాలు యాక్షన్ సన్నివేశాలకు మరింత రియలిస్టిక్ ఫీల్ ఇవ్వడమే కాకుండా, సినిమా వాతావరణాన్ని కూడా బలంగా చూపించడంలో సహాయపడ్డాయి.


Click it and Unblock the Notifications








