ఖర్చు తక్కువ.. లైఫ్ ఎక్కువ.. గ్యారెంటీగా 15 ఏళ్లు గ్యారేజీకి వెళ్లకుండా నడిచే కార్లు ఇవే
కారు కొనడం అనేది ఈ రోజుల్లో సామాన్యుడికి ఒక జీవితకాల కల. లక్షలు పోసి కొన్న కారు కనీసం పది, పదిహేనేళ్లయినా గట్టిగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ, మార్కెట్లో ఉన్న అన్ని కార్లు ఆ గ్యారెంటీని ఇవ్వలేవు. ఇంజిన్ లైఫ్, బాడీ స్ట్రెంత్, మెయింటెనెన్స్.. ఇలా అన్ని విషయాల్లో తోపు అనిపించుకునే వెహికల్స్ మార్కెట్లో కొన్ని మాత్రమే ఉంటాయి. మీరు గనుక ఒకసారి కొంటే మరో 15 ఏళ్ల వరకు కొత్త కారు వైపు చూడాల్సిన అవసరం లేని 5 బెస్ట్ ఎస్‌యూవీల (SUVs) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. స్కోడా కుషాక్ (Skoda Kushaq):
డ్రైవింగ్ అంటే ప్రాణం ఇచ్చే వారికి స్కోడా కుషాక్ ఒక బ్రహ్మండమైన ఆప్షన్. దీని జర్మన్ టెక్నాలజీ ఇంజిన్ చాలా కాలం వరకు మొరాయించదు. రెండు రకాల టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ పవర్ డెలివరీలో రాజీ పడదు. దీని ధర రూ.10.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్ల వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బాడీ క్వాలిటీ విషయంలో స్కోడాను మించిన వారు లేరు కాబట్టి, 15 ఏళ్ల లైఫ్ దీనికి చాలా ఈజీ.

2. రెనాల్ట్ డస్టర్ (Renault Duster):
భారతీయ రోడ్లపై ఒకప్పుడు ప్రభంజనం సృష్టించిన డస్టర్, ఇప్పుడు మరింత పవర్ఫుల్గా తిరిగి వచ్చింది. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి దీని స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.10.49 లక్షల నుంచి మొదలవుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నప్పటికీ, దీని అసలైన బలం దీని సస్పెన్షన్, ఇంజిన్. ఎలాంటి రోడ్ల మీదైనా ఇది సాఫీగా సాగిపోతుంది. హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల మైలేజీ కూడా తోపుగా ఉంటుంది, కాబట్టి లాంగ్ రన్‌లో ఇది జేబుకు భారం కాదు.

3. మహీంద్రా బొలెరో (Mahindra Bolero):
నిజానికి ఇది కారు కాదు, ఒక ఎమోషన్.. దశాబ్దాలుగా ఎటువంటి మార్పులు లేకపోయినా బొలెరోను ప్రజలు ఎందుకు కొంటారంటే దాని మన్నిక అలాంటిది. లాడర్ ఫ్రేమ్ చాసిస్ మీద తయారయ్యే ఈ వాహనం భారీ లోడ్లను మోయడానికి, పల్లెటూరి గతుకుల రోడ్లపై పరిగెత్తడానికి పుట్టింది. దీని mHawk75 డీసెల్ ఇంజిన్ అత్యంత నమ్మదగినది. కేవలం రూ. 7.99 లక్షల నుంచే లభించే ఈ కారును సరిగ్గా మెయింటైన్ చేస్తే 20 ఏళ్లయినా చెక్కుచెదరదు. ఇప్పుడు వస్తున్న కొత్త వెర్షన్లలో టచ్ స్క్రీన్ వంటి సౌకర్యాలు కూడా జోడించారు.

4. హోండా ఎలివేట్ (Honda Elevate):
విశ్వసనీయతకు మారుపేరు హోండా. హోండా సిటీలో ఉండే అదే శక్తివంతమైన 1.5 లీటర్ ఇంజిన్‌తో ఎలివేట్ దూసుకొచ్చింది. దీని ధర రూ.11.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫ్యామిలీతో కలిసి ప్రయాణించే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. విశాలమైన బూట్ స్పేస్, లెగ్ రూమ్ దీని ప్రత్యేకత. సేఫ్టీ కోసం ఇందులో హోండా సెన్సింగ్ (ADAS) ప్యాకేజీ ఉంది. హోండా ఇంజిన్లు ఎంత స్మూత్ గా ఉంటాయో అందరికీ తెలిసిందే, అందుకే త్వరగా రిపేర్లు రావు. 15 ఏళ్ల పాటు ఫ్యామిలీ కారుగా ఇది గ్యారెంటీగా సేవలందిస్తుంది.

5. కియా సెల్టోస్ (Kia Seltos):
స్టైల్, టెక్నాలజీ రెండూ కావాలనుకునే వారికి కియా సెల్టోస్ సరైన ఎంపిక. పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్.. ఇలా అన్ని రకాల ఇంజిన్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. దీని ధర రూ.10.99 లక్షల నుంచి మొదలవుతుంది. డ్యూయల్ పాన్ సన్‌రూఫ్, 64 కలర్ల యాంబియంట్ లైటింగ్, అడ్జస్టబుల్ సీట్లు వంటి ఫీచర్లు దీనిని ఒక లగ్జరీ ఎస్‌యూవీగా మారుస్తాయి. కొరియన్ టెక్నాలజీతో తయారయ్యే ఈ కారు క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గదు. మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే కాబట్టి దీర్ఘకాలం పాటు వాడుకోవచ్చు.
ఈ 5 ఎస్‌యూవీలు తయారీ పరంగా, ఇంజిన్ పరంగా ఎంతో మేలైనవి. అయితే కారు 15 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం కంపెనీని నమ్ముకుంటే సరిపోదు. టైమ్ కి సర్వీసింగ్ చేయించడం, ఇంజిన్ ఆయిల్ మార్చడం, టైర్ల ప్రెజర్ చూసుకోవడం వంటివి యజమాని బాధ్యత. మీ అవసరాలకు తగ్గట్టుగా.. అంటే రఫ్ రోడ్ల కోసమైతే బొలెరో, సిటీ డ్రైవింగ్ కోసం సెల్టోస్ లేదా కుషాక్, మైలేజీ కోసం డస్టర్ వంటివి ఎంచుకుంటే మీ పెట్టుబడికి పూర్తి న్యాయం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








