ఎలక్ట్రిక్ కార్ల పని అయిపోయినట్లేనా.. త్వరలోనే మార్కెట్లోకి ఇథనాల్‌తో నడిచే 5 సరికొత్త కార్లు

భారత ఆటోమొబైల్ రంగం రాబోయే రోజుల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు సాక్ష్యంగా నిలవబోతోంది. నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశీయ రోడ్లపై 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ కలిగిన ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel) ఇంధనంతో నడిచే కార్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

మారుతి సుజుకి ఇప్పటికే వ్యాగన్ఆర్ మోడల్ ఆధారంగా దేశంలోనే మొట్టమొదటి మాస్-మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్రోటోటైప్ వాహనాన్ని ప్రదర్శించింది. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా రాబోయే కొన్ని నెలల్లోనే దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలు తమ సరికొత్త ఇథనాల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

ethanol flex fuel cars launch india creta punch hycross fronx nitin gadkari update

మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఎంట్రీ
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మోస్ట్ పాపులర్ సబ్-కాంపాక్ట్ క్రాస్ఓవర్ కార్ అయిన ఫ్రాంక్స్ (Fronx)ను ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌లో తీసుకురావడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కారు ప్రధానంగా E85 ఇంధనం అంటే 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో నడుస్తుంది.

ఇథనాల్ ఇంధనానికి అనుగుణంగా ఈ కారు ఇంజన్ లో ప్రత్యేక మార్పులు చేయనున్నారు. ఇథనాల్-సేఫ్ ఫ్యూయల్ లైన్స్, మోడిఫైడ్ ఇంజెక్టర్లతో పాటు కారులో ఒక స్పెషల్ ఇథనాల్ సెన్సార్‌ను అమర్చనున్నారు. ఈ సెన్సార్ ఇంధనంలోని ఇథనాల్ శాతాన్ని బట్టి కారు పర్ఫార్మెన్స్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. అయితే కారు లుక్, ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండవు.

ethanol flex fuel cars launch india creta punch hycross fronx nitin gadkari update

టయోటా ఇన్నోవా హైక్రాస్, కొరొల్లా హైబ్రిడ్
జపాన్ దిగ్గజం టయోటా ఈ రేసులో అందరికంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో దూసుకుపోతోంది. కంపెనీ తన ఐకానిక్ ఎంపీవీ కార్ అయిన ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross)ను ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో సిద్ధం చేస్తోంది. ఈ కారు ఫ్లెక్స్-ఫ్యూయల్‌తో పాటు స్ట్రాంగ్-హైబ్రిడ్ టెక్నాలజీతో పనిచేస్తుంది.

దీనివల్ల ఇది దేశంలోనే అత్యధిక మైలేజీనిచ్చే మోడ్రన్ కార్లలో ఒకటిగా నిలవనుంది. దీనితో పాటు, టయోటా భవిష్యత్తులో తన ప్రీమియం సెడాన్ కార్ కొరొల్లా (Corolla) ఫ్లెక్స్-ఫ్యూయల్ హైబ్రిడ్ మోడల్‌ను కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది వంద శాతం స్వచ్ఛమైన ఇథనాల్ (E100)తో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ethanol flex fuel cars launch india creta punch hycross fronx nitin gadkari update

హ్యుందాయ్ క్రెటా ఇథనాల్ వెర్షన్
భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తిరుగులేని రారాజుగా వెలుగుగొందుతున్న హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) కూడా త్వరలోనే ఇథనాల్ అవతారంలో దర్శనమివ్వనుంది. హ్యుందాయ్ కంపెనీ గతంలోనే దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించింది, ఆ ప్రోటోటైప్ కారు పూర్తి 100 శాతం ఇథనాల్ (E100) ఇంధనంతో నడిచేలా డిజైన్ చేయబడింది.

రాబోయే ప్రొడక్షన్ మోడల్‌లో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను అందించే అవకాశం ఉంది. దీనిని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయనున్నారు. క్రెటా ఇథనాల్ వెర్షన్ మార్కెట్లోకి వస్తే అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.

టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ రెడీ
దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది చివరి నాటికి తన మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును భారత మార్కెట్లో విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసింది. కంపెనీ ఈ సరికొత్త ఇథనాల్ టెక్నాలజీ వారి మోస్ట్ పాపులర్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) పై బేస్ అయి ఉంటుంది.

దీనిని భారత్ మోబిలిటీ ఎక్స్‌పో 2025లో కూడా ప్రదర్శించారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సీఈఓ శైలేష్ చంద్ర స్వయంగా ఈ కారు లాంచ్‌ను ధృవీకరించారు. ఈ కారు E20 (20% ఇథనాల్) నుంచి E100 (100% ఇథనాల్) వరకు ఎలాంటి మిశ్రమంతోనైనా చాలా ఈజీగా రోడ్లపై పరుగులు తీస్తుంది.

రేసులో దూసుకుపోతున్న ఎంజీ మోటార్
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రిటీష్ బ్రాండ్ ఎంజీ (MG Motor) కూడా భారతదేశం కోసం ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్స్ పై చాలా వేగంగా పని చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ భారత మార్కెట్లో హెక్టర్ మరియు ఆస్టర్ వంటి పాపులర్ పెట్రోల్ కార్లను విక్రయిస్తోంది.

అయితే తమ మొదటి ఇథనాల్ కారు ఏది అనేదానిపై ఎంజీ మోటార్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, భారత్‌లో ఎంజీ హెక్టర్ (MG Hector) కారుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, దీనినే మొదట ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజన్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Article Published On: Wednesday, June 17, 2026, 9:15 [IST]
English summary
Ethanol flex fuel cars launch india creta punch hycross fronx nitin gadkari update
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+