రూ.5 లక్షలకే ఎలక్ట్రిక్ కారు.. రోజూ ఆఫీసుకు వెళ్లే వారికి బెస్ట్ అనిపించే టాప్ 4 ఈవీలు ఇవే
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో సామాన్యుడి చూపు ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల(EVs) వైపు మళ్లుతోంది. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కారు అంటే లక్షల్లో ఖరీదు ఉండేది.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కంపెనీలు తీసుకొచ్చిన BaaS సిస్టమ్ ఆధారంగా మిడిల్ క్లాస్ బడ్జెట్‌కు తగ్గట్టుగా, కేవలం రూ.5 లక్షల ప్రారంభ ధరలోనే అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వచ్చేశాయి. మీరు రోజుకు 20 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణించే వారైతే, ఈ కార్లను రోజూ ఛార్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వారం మొత్తం హాయిగా తిరిగేయొచ్చు. సిటీ డ్రైవింగ్‌కు బెస్ట్ అనిపించే ఆ 4 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు తెలుసుకుందాం.
1. ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV):
ఈ జాబితాలో అత్యంత వినూత్నమైన కారు ఎంజీ కామెట్. ఇది చూడటానికి చాలా చిన్నదిగా ఉన్నా, ఫీచర్లలో మాత్రం పెద్ద కార్లకు పోటీ ఇస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని ఇరుకైన సందుల్లో, ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో 17.3 kWh బ్యాటరీ ఉంటుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

దీని అసలు ధర రూ. 7.62 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఎంజీ ప్రవేశపెట్టిన BaaS (Battery-as-a-Service) ప్లాన్ ద్వారా మీరు ఈ కారును కేవలం రూ. 4.99 లక్షలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీనికి అదనంగా కిలోమీటరుకు రూ. 3.2 చొప్పున బ్యాటరీ రెెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
2. టాటా పంచ్ ఈవీ (Tata Punch EV):
మీకు ఒక పవర్‌ఫుల్ ఎస్‌యూవీ (SUV) లుక్ కావాలి కానీ అది ఎలక్ట్రిక్ అయ్యి ఉండాలి అని అనుకుంటున్నారా? అయితే టాటా పంచ్ ఈవీ మీ కోసమే. దీని గ్రౌండ్ క్లియరెన్స్ మరియు లోపల ఉండే విశాలమైన స్థలం కుటుంబంతో ప్రయాణించడానికి చాలా బాగుంటుంది. ఇందులో 30 kWh, 40 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి.

ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 నుండి 421 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. దీని ప్రారంభ ధర రూ.9.69 లక్షలు. ఇందులో కూడా BaaS ఆప్షన్ అందుబాటులో ఉంది. దీనివల్ల కారు ధర రూ.6.49 లక్షలకు తగ్గుతుంది (బ్యాటరీ రెంట్ కిలోమీటరుకు రూ.2.6 అదనం). అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
3. టాటా టియాగో ఈవీ (Tata Tiago EV):
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో టియాగో ఈవీ ఒకటి. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక నమ్మకమైన కారు. ఇందులో 19.2 kWh, 24 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 నుంచి 315 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.

దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మీ రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు, పిల్లలను స్కూల్‌లో వదలడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. టాటా బ్రాండ్ నుంచి వస్తున్న కారు కావడంతో సేఫ్టీ మరియు సర్వీస్ విషయంలో మీకు ఎలాంటి భయం ఉండదు.
4. సిట్రోయెన్ ఈ-సీ3 (Citroen eC3):
ఫ్రెంచ్ కంపెనీ సిట్రోయెన్ నుంచి వచ్చిన ఈ కారు సౌకర్యానికి మారుపేరు. ఇందులో 29.2 kWh బ్యాటరీ ఉంది, ఇది దాదాపు 246 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని కేబిన్ చాలా వెడల్పుగా ఉంటుంది, దీనివల్ల వెనుక కూర్చునే ప్రయాణికులకు కూడా మంచి లెగ్ స్పేస్ లభిస్తుంది.

దీని ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు. ప్రీమియం ఫీచర్లు, మంచి సస్పెన్షన్ కావాలనుకునే వారికి సిట్రోయెన్ ఈ-సీ3 ఒక గొప్ప ఎంపిక. నగరాల్లోని గుంతల రోడ్లపై కూడా ఈ కారు చాలా స్మూత్‌గా సాగిపోతుంది.
ఏది ఎంచుకోవాలి?
మీరు ఒంటరిగా లేదా ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణించేవారైతే ఎంజీ కామెట్ బెస్ట్. కుటుంబంతో పాటు వెళ్లాలనుకుంటే టాటా పంచ్ లేదా టియాగో ఈవీలను ఎంచుకోవచ్చు. పైన పేర్కొన్న కార్లన్నీ కూడా మన దేశ వాతావరణానికి అనుగుణంగా తయారైనవే.
ముఖ్యంగా బ్యాటరీ ఛార్జింగ్ ఖర్చు పెట్రోల్ ఖర్చులో 10వ వంతు మాత్రమే ఉంటుంది. అంటే మీరు నెలకు పెట్రోల్ కోసం రూ.5000 ఖర్చు పెడుతుంటే, ఎలక్ట్రిక్ కారుతో అది కేవలం రూ.500 తోనే అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ బడ్జెట్‌కు సరిపోయే ఈవీని ఇప్పుడే ఎంచుకోండి!


Click it and Unblock the Notifications