కారు కొంటే ఇలాంటిదే కొనాలి.. రెనాల్డ్ సంచలనం.. 25 వేల ఇళ్లలోకి చేరిన సరికొత్త 7-సీటర్
భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు కార్లంటే కేవలం ప్రయాణ సాధనాలు మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండే మన దేశంలో 7 సీటర్ కార్లకు ఎప్పుడూ భలే డిమాండ్ ఉంటుంది. అయితే బడ్జెట్ లోపల మంచి ఫీచర్స్ ఉన్న ఫ్యామిలీ కారు దొరకడం కాస్త కష్టమే. ఇలాంటి సమయంలో రెనాల్డ్ ట్రైబర్ (Renault Triber) మధ్యతరగతి ప్రజల పాలిట వరంగా మారింది. కేవలం రూ.5.76 లక్షల ప్రారంభ ధరతో దొరుకుతున్న ఈ కారు, ప్రస్తుతం మార్కెట్‌లో రికార్డు స్థాయి అమ్మకాలతో దూసుకుపోతోంది.
రెనాల్డ్ ట్రైబర్ ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఎంపీవీ (MPV) విభాగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం (FY2026)లో ఈ కారు ఏకంగా 25,174 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయానికి 19,905 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి అమ్మకాలు ఏకంగా 26.5 శాతం పెరగడం విశేషం. అంటే సగటున నెలకు 2 వేలకు పైగా కుటుంబాలు ఈ కారును తమ ఇంటికి తీసుకెళ్తున్నాయి. మారుతి అర్టిగా, టయోటా ఇన్నోవా వంటి దిగ్గజ కార్లు ఉన్నప్పటికీ, తక్కువ ధరలోనే లభిస్తుండటంతో సామాన్యులు ట్రైబర్ వైపే మొగ్గు చూపుతున్నారు.

చూడటానికి ఈ కారు ఒక మినీ ఎస్‌యూవీలా మస్కులర్ లుక్‌తో ఉంటుంది. ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్, రూఫ్ రైల్స్ ఈ కారుకు స్పోర్టీ అప్పీల్‌ను ఇస్తాయి. 4 మీటర్ల లోపు పొడవు ఉన్నప్పటికీ, లోపల స్థలం మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. నగరాల్లో ట్రాఫిక్ లో నడపడానికి, పార్కింగ్ చేయడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీని ఎక్స్‌టీరియర్‌ను రెనాల్డ్ రూపొందించింది.
ట్రైబర్ లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏదైనా ఉందంటే అది దాని సీటింగ్ అరేంజ్మెంట్. ఇందులో మూడవ వరుస సీట్లను అవసరమైనప్పుడు పూర్తిగా తొలగించవచ్చు. ఒకవేళ మీరు కేవలం ఐదుగురు మాత్రమే ప్రయాణిస్తూ, ఎక్కువ లగేజీ తీసుకెళ్లాలనుకుంటే.. వెనుక సీట్లు తీసి పడేస్తే మీకు చాలా పెద్ద బూట్ స్పేస్ లభిస్తుంది. దీన్నే రెనాల్డ్ ఫ్లెక్సిబుల్ సీటింగ్ అని పిలుస్తుంది. దీనివల్ల ప్రయాణికుల సంఖ్యను బట్టి కారును ఎలాగైనా మార్చుకోవచ్చు.

ఈ కారులో 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది నగర ప్రయాణాలకు, హైవేలపై ఒక మోస్తరు వేగంతో వెళ్ళడానికి చాలా స్మూత్ గా ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ (AMT) ఆప్షన్లతో లభిస్తుంది. అయితే దీని అసలైన బలం మైలేజీ. లీటరు పెట్రోలుకు సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ప్రస్తుత పెట్రోల్ ధరల కాలంలో 7-సీటర్ కారు ఇంత మైలేజీ ఇవ్వడం అంటే మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఉపశమనమే అని చెప్పాలి.
తక్కువ ధర కదా అని రెనాల్డ్ భద్రతను విస్మరించలేదు. గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్టులో ట్రైబర్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో 4 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD) వంటి ఫీచర్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సురక్షితంగా ప్రయాణించవచ్చని ఈ రేటింగ్ నిరూపించింది. భారతదేశంలో సేఫ్టీకి ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి చూస్తే, ట్రైబర్ ఒక నమ్మకమైన కారుగా నిలిచింది.

రెనాల్డ్ ట్రైబర్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర కేవలం రూ.5.76 లక్షలు. టాప్ వేరియంట్ ధర రూ.8.60 లక్షల వరకు ఉంటుంది. మార్కెట్‌లో నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి కార్లు ఉన్నప్పటికీ.. 7-సీటర్ సౌకర్యం కేవలం ట్రైబర్ లోనే లభిస్తుంది. తక్కువ ఖర్చుతో కూడిన మెయింటెనెన్స్, అద్భుతమైన రీసేల్ వాల్యూ దీని సొంతం. మీరు తక్కువ బడ్జెట్ లో ఒక మంచి ఫ్యామిలీ కారు కొనాలనుకుంటే ట్రైబర్ కు మించిన ఆప్షన్ ప్రస్తుతం మార్కెట్‌లో లేదనే చెప్పాలి.


Click it and Unblock the Notifications








