కేవలం రూ.5 లక్షలకే 34 కిమీ మైలేజ్ ఇచ్చే కార్లు.. మధ్యతరగతి జనాల పాలిట వరం
భారతదేశంలో రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్య వాహనదారులు కారు కొనాలన్న ఆలోచనను మానుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తక్కువ రన్నింగ్ కాస్ట్‌తో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఇంధన ప్రత్యామ్నాయాల కోసం కస్టమర్లు వెతుకుతున్నారు.
మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు మారుతి సుజుకి, టాటా మోటార్స్ కంపెనీలు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ కిట్లతో బెస్ట్ కార్లను విక్రయిస్తున్నాయి. వీటిలో అత్యంత చౌకైన కారు ప్రారంభ ధర రూ.5 లక్షల కంటే తక్కువగానే ఉండటం విశేషం. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఆ నాలుగు బడ్జెట్ సీఎన్జీ కార్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీ (Maruti Suzuki S-Presso CNG)
మారుతి సుజుకి లైనప్‌లో మైక్రో ఎస్‌యూవీ లుక్‌తో ఆకట్టుకునే ఎస్-ప్రెస్సో ప్రస్తుతం దేశంలోనే అత్యంత చౌకైన సీఎన్జీ కారుగా నిలిచింది. ఈ కారు ప్రారంభ ధర కేవలం రూ.4.62 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. ఇందులో 1.0 లీటర్ నెక్స్ట్-జెన్ కె-సిరీస్ ఇంజన్‌ను అమర్చారు.
ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సీఎన్జీ మోడ్‌లో ఈ కారు 57 పీఎస్ పవర్‌ను, 82.1 ఎన్ఎమ్ టాస్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే.. కేజీ సీఎన్జీకి ఏకంగా 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. సిటీ ట్రాఫిక్‌లో తిరగడానికి తక్కువ బడ్జెట్‌లో ఇదొక అద్భుతమైన ప్రాక్టికల్ కారు.

మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్జీ (Maruti Suzuki Alto K10 CNG)
భారతీయ కుటుంబాలకు దశాబ్దాలుగా నమ్మకమైన బ్రాండ్‌గా మారిన ఆల్టో సిరీస్‌లో కే10 సీఎన్జీ కూడా బడ్జెట్ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. దీని ప్రారంభ ధర రూ.4.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఎస్-ప్రెస్సో తరహాలోనే ఇందులో కూడా అదే 1.0 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు.
ఇది కూడా సుమారు 33.85 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. చిన్న పరిమాణంలో ఉండటం వల్ల ఇరుకైన రోడ్లపై కూడా దీనిని చాలా సులభంగా డ్రైవ్ చేయవచ్చు.

మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ సీఎన్జీ (Maruti Suzuki Wagon-R CNG)
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ ఫ్యామిలీ హాచ్‌బ్యాక్ కారు ఏదైనా ఉందంటే అది వ్యాగన్-ఆర్ మాత్రమే. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ సీఎన్జీ ధర రూ.5.89 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాల్‌బాయ్ డిజైన్‌తో వచ్చే ఈ కారులో లోపలి భాగంలో కూర్చోవడానికి స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇందులో 1.0 లీటర్ పెట్రోల్-సీఎన్జీ ఇంజన్ కలదు, ఇది 57 హార్స్‌పవర్, 82.1 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని మైలేజ్. ఇది కేజీ సీఎన్జీకి ఏకంగా 34.05 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే బడ్జెట్ కార్లలో ఒకటిగా నిలిచింది.

టాటా టియాగో సీఎన్జీ (Tata Tiago CNG)
సేఫ్టీ మరియు స్టైలిష్ లుక్ కోరుకునే కస్టమర్ల కోసం టాటా టియాగో సీఎన్జీ ఒక అద్భుతమైన ఎంపిక. దీని ప్రారంభ ధర రూ.5.49 లక్షలుగా ఉంది. కాగా, ఈ కారు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా ఇదే నెలలో మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఇందులో మరింత పవర్‌ఫుల్ 1.2 లీటర్ పెట్రోల్-సీఎన్జీ ఇంజన్‌ను అమర్చారు.
సీఎన్జీ మోడ్‌లో కూడా ఇది 73 హార్స్‌పవర్, 95 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తూ డ్రైవింగ్‌లో మంచి పికప్‌ను ఇస్తుంది. ఈ సెగ్మెంట్‌లో సాధారణంగా దొరకని మాన్యువల్, ఏఎమ్‌టీ (ఆటోమేటిక్) గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండింటిలోనూ టాటా టియాగో లభిస్తుంది. ఇది కేజీకి 26.49 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

టాటా పంచ్ సీఎన్జీ (Tata Punch CNG)
మీరు తక్కువ బడ్జెట్‌లో ఒక అద్భుతమైన సీఎన్జీ ఎస్‌యూవీ (SUV) కొనాలని ప్లాన్ చేస్తుంటే టాటా పంచ్ ఐసీఎన్జీ బెస్ట్ ఛాయిస్. దీని ధర రూ.6.74 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 1.2 లీటర్ రెవోట్రాన్ ఐసీఎన్జీ ఇంజన్‌ను ఉపయోగించారు.
ఇది సీఎన్జీ మోడ్‌లో 73.3 హెచ్‌పీ పవర్‌ను, 103 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. టాటా కంపెనీ తన వినూత్నమైన ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఈ కారులో సీఎన్జీ సిలిండర్ ఉన్నప్పటికీ బూట్ స్పేస్ (డిక్కీ స్థలం) చాలా బాగా లభిస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పాటు కేజీకి 26.99 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.


Click it and Unblock the Notifications