ఒక్కసారి ఛార్జ్ చేస్తే 638 కిమీ.. సామాన్యుడి బడ్జెట్లోనే 5 అదిరిపోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే!
పెట్రోల్ బంకుకు వెళ్లాలంటేనే భయమేస్తోందా ? పెట్రోల్, డీజిల్ ధరలు(petrol diesel price) సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్న వేళ, ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మళ్లుతోంది. కేవలం పర్యావరణం కోసమే కాదు, భారీగా డబ్బు ఆదా చేసేందుకు ఇవి చక్కని మార్గంగా మారాయి. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra modi) కూడా ఇంధన పొదుపుపై పిలుపునివ్వడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. మీరు కూడా కొత్తగా ఒక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ(electric SUV) కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న, అత్యధిక రేంజ్ ఇచ్చే టాప్-5 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఈ-విటారా:
చాలా కాలం నిరీక్షణ తర్వాత మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ-విటారా(Maruti Suzuki E vitara)తో మార్కెట్లోకి భారీగా ఎంట్రీ ఇచ్చింది. దీని స్పెషాలిటీ ఏమిటంటే, కేవలం 10.99 లక్షల రూపాయల (బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ మోడల్) ప్రారంభ ధరకే ఇది లభిస్తోంది. ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీని ఎంచుకుంటే ఏకంగా 543 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక వరం లాంటిది.

మహీంద్రా బిఈ 6:
మహీంద్రా నుంచి వచ్చిన బిఈ 6(mahindra be6) తన గంభీరమైన లుక్‌తో యువతను కట్టిపడేస్తోంది. దీని రేంజ్ వింటే మీరు షాక్ అవ్వాల్సిందే.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 638 కిలోమీటర్లు దూసుకుపోతుంది. కేవలం 6.7 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు ధర 18.90 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
ఎంజీ విండ్సర్ ప్రో :
మీరు కారులో విలాసాన్ని, ఎక్కువ స్థలాన్ని కోరుకునే వారైతే ఎంజీ విండ్సర్ ప్రో(mg windsor pro) మీ కోసమే. దీని లోపల స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది, లాంగ్ జర్నీలో కూడా అలసట అనిపించదు. ఇందులో ఉన్న పెద్ద బ్యాటరీ సాయంతో 449 కిలోమీటర్ల ప్రయాణాన్ని నిశ్చింతగా పూర్తి చేయవచ్చు. కుటుంబం మొత్తం కలిసి సౌకర్యవంతంగా వెళ్లడానికి ఇది సరైన కారు.

టాటా పంచ్ ఈవీ:
బడ్జెట్ లో మంచి ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే వారికి టాటా పంచ్ ఈవీ(tata punch ev) కంటే మెరుగైన ఆప్షన్ లేదు. దీని ధర కేవలం 9.69 లక్షల రూపాయల (BaaS మోడల్) నుంచే మొదలవుతుంది. చిన్న కారు అయినప్పటికీ, ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 355 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. సిటీ ట్రాఫిక్ లో తిరగడానికి, చిన్న చిన్న ట్రిప్పులకు ఇది ఎంతో అనువైనది.
విన్‌ఫాస్ట్ విఎఫ్ 7:
వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ కంపెనీ భారత మార్కెట్లోకి విఎఫ్ 7(vinfast vf 7) మోడల్‌తో అడుగుపెట్టింది. సుమారు 4.5 మీటర్ల పొడవు ఉండే ఈ కారు రోడ్డుపై చాలా గంభీరంగా కనిపిస్తుంది. దీని పవర్ఫుల్ బ్యాటరీ 510 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. దీని ప్రారంభ ధర 21.89 లక్షల రూపాయలు. కొత్త రకం డిజైన్, అదిరిపోయే పవర్ కోరుకునే వారు దీనిని పరిశీలించవచ్చు.

పెట్రోల్ బిల్లుల భారం నుంచి తప్పించుకోవడానికి ఈ ఐదు కార్లు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యుత్తమ ప్రత్యామ్నాయాలు. తక్కువ ధరలో కావాలంటే టాటా పంచ్ లేదా మారుతి ఈ-విటారా, ఎక్కువ రేంజ్ కావాలంటే మహీంద్రా బిఈ 6 ఉత్తమమైనవి. మీ అవసరానికి తగ్గట్టుగా సరైన కారును ఎంచుకుని స్మార్ట్ గా ప్రయాణించండి.


Click it and Unblock the Notifications