సెడాన్ లవర్లకు పండగే.. త్వరలో మార్కెట్లోకి నాలుగు సరికొత్త కార్లు.. లిస్టులో మోస్ట్ పాపులర్ మోడల్
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల (SUV) హవా ఎంత నడుస్తున్నప్పటికీ, లగ్జరీగా, క్లాస్‌గా ఉండే సెడాన్ కార్లకు ఉండే క్రేజ్ ఎప్పుడూ సపరేటే. మీకూ లాంగ్ డ్రైవ్స్ కోసం అదిరిపోయే లగ్జరీ సెడాన్ కొనాలనే ప్లాన్ ఉంటే మాత్రం, ఇంకొద్ది రోజులు ఓపిక పట్టడం చాలా మంచిది. ఎందుకంటే వచ్చే కొన్ని నెలల్లో ఇండియన్ రోడ్లపై సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడానికి నాలుగు అత్యంత పవర్‌ఫుల్ సెడాన్ కార్లు గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి.
ఈ లిస్టులో స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ లతో పాటు ఒకప్పుడు భారత మార్కెట్‌ను ఏలిన హోండా కంపెనీకి చెందిన రెండు అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. అత్యాధునిక హైబ్రిడ్ టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో రాబోతున్న ఆ 4 అప్‌కమింగ్ సెడాన్ కార్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. హోండా అకార్డ్ హైబ్రిడ్ (Honda Accord Hybrid)
హోండా కార్లలో అత్యంత లగ్జరీ, ప్రీమియం మోడల్‌గా ఒకప్పుడు భారతీయ సెలబ్రిటీల మనసు గెలుచుకున్న హోండా అకార్డ్ సరికొత్త హైబ్రిడ్ అవతారంలో ఇండియాలోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది. గతంలో తక్కువ అమ్మకాల కారణంగా ఈ కారును కంపెనీ నిలిపివేసినప్పటికీ, ఇప్పుడు ప్రీమియం హైబ్రిడ్ మార్కెట్‌కు ఉన్న డిమాండ్ చూసి హోండా దీనిని మళ్లీ తీసుకురావాలని గట్టిగా డిసైడ్ అయ్యింది.
ఈ సరికొత్త 4-డోర్ ప్రీమియం సెడాన్‌లో విలాసవంతమైన కేబిన్ స్పేస్, అత్యాధునిక డ్రైవింగ్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉండబోతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఉన్న ఈ మోడల్‌ను ఇండియాలో కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU) లేదా సీకేడీ (CKD) రూట్‌లో దిగుమతి చేసుకుని అసెంబుల్ చేసి విక్రయించే అవకాశం ఉంది. టయోటా కామ్రీ లాంటి లగ్జరీ కార్లకు ఈ కారు గట్టి పోటీ ఇవ్వనుంది.

2. హోండా సివిక్ హైబ్రిడ్ (Honda Civic Hybrid)
తన సరికొత్త బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా రాబోయే రోజుల్లో 6 కొత్త మోడళ్లను లాంచ్ చేస్తామని గతంలో హోండా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ లిస్టులో ఉన్న మోస్ట్ ఎవైటెడ్ కార్లలో హోండా సివిక్ ఒకటని ఆటోమొబైల్ వర్గాల తాజా సమాచారం.
గతంలో 10త్ జనరేషన్ సివిక్ మోడల్ ఉత్పత్తిని 2021 లో నిలిపివేసిన హీరో, ఈసారి కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా దీనిని కూడా 'హైబ్రిడ్' ఇంజన్ ఆప్షన్‌తో లాంచ్ చేయబోతోంది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో పాటు మైండ్ బ్లోయింగ్ మైలేజ్ ఇచ్చేలా ఈ కారును డిజైన్ చేశారు. స్పోర్టీ లుక్, రోడ్ ప్రెజెన్స్‌తో యువతను ఆకట్టుకునేందుకు ఈ లగ్జరీ సెడాన్ కారు సిద్దమవుతోంది.

3. స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ (Skoda Slavia Facelift)
మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇస్తున్న స్కోడా స్లావియా చాలా త్వరలోనే సరికొత్త ఫేస్‌లిఫ్ట్ (Facelift) వెర్షన్‌తో మార్కెట్లోకి రాబోతోంది. ఈ కొత్త కారుకు సంబంధించిన టెస్టింగ్ మోడల్స్ ఇప్పటికే ఇండియన్ రోడ్లపై కెమెరాలకు చిక్కాయి. ఈ 2026 మోడల్‌లో రీ-డిజైన్ చేసిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ (LED DRLs) తో కూడిన అప్‌డేటెడ్ హెడ్‌లైట్స్, సరికొత్త రేర్ ప్రొఫైల్ ఉండబోతున్నాయి.
కార్ కేబిన్ లోపల లగ్జరీ ఫీచర్లతో పాటు స్కోడా కుషాక్‌లో ఇచ్చే అడ్వాన్స్‌డ్ రేర్ సీట్ మసాజర్ ఫంక్షన్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో, పవర్‌ఫుల్ 1.5-లీటర్ టిఎస్ఐ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి (DSG) గేర్ బాక్స్‌తో రానుంది. ఈ ఏడాది చివర్లో ఈ కారు లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

4. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ (Volkswagen Virtus Facelift)
భారతీయ మార్కెట్లో ప్రస్తుత ఏడాది మూడో త్రైమాసికం (Q3) లోనే లాంచ్ అయ్యేందుకు ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ రెడీ అవుతోంది. ఇటీవల కాలంలోనే ఈ సరికొత్త వర్టస్ కారు దేశీయ రోడ్లపై మొదటిసారి టెస్టింగ్ చేస్తూ కనిపించింది. బయటకు వచ్చిన స్పై చిత్రాల ప్రకారం.. వర్టస్ ఒరిజినల్ సిగ్నేచర్ బాడీ ప్యానెల్స్, షేప్‌లో కంపెనీ ఎలాంటి పెద్ద మార్పులు చేయడం లేదు.
అయితే దీని ఫ్రంట్ బంపర్, ఫ్రంట్ గ్రిల్స్ మరింత అగ్రెసివ్ లుక్‌తో అప్‌డేట్ అవ్వబోతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రాబోతున్న సరికొత్త 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (Automatic Transmission) గేర్‌బాక్స్ అతిపెద్ద హైలైట్ కానుంది. ఇది కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుంది.


Click it and Unblock the Notifications