మహీంద్రాకు పెద్ద తలనొప్పిగా మారిన కారు.. ఏడాది మొత్తం మీద అమ్ముడైంది కేవలం 381 కార్లే

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అంటేనే ఎస్‌యూవీ (SUV)లకు కేరాఫ్ అడ్రస్. స్కార్పియో, బొలెరో, XUV 700 వంటి కార్లతో మార్కెట్‌ను ఏలుతున్న ఈ కంపెనీకి ఒక మోడల్ మాత్రం పెద్ద తలనొప్పిగా మారింది. అదే మహీంద్రా మరాజో (Marazzo). ఒకప్పుడు ఇన్నోవాకు గట్టి పోటీ ఇస్తుందని భావించిన ఈ 7-సీటర్ కారు, ఇప్పుడు కనీసం బోణీ కొట్టడానికి కూడా తెగ కష్టపడుతోంది. గడిచిన ఏడాది కాలంలో ఈ కారు అమ్మకాలు చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 365 రోజుల్లో కేవలం 381 యూనిట్లు మాత్రమే అమ్ముడై, మహీంద్రా చరిత్రలోనే అత్యంత తక్కువ సేల్స్ నమోదైన కారుగా నిలిచింది.

ఆర్థిక సంవత్సరం 2026లో మహీంద్రా కార్ల అమ్మకాలను గమనిస్తే మరాజో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ ఏడాదిలో స్కార్పియో ఏకంగా 1,78,800 యూనిట్లు అమ్ముడవగా, బొలెరో 1,10,136 యూనిట్లు సేల్ అయ్యింది. కానీ మరాజో మాత్రం కేవలం 381 యూనిట్ల వద్దే ఆగిపోయింది. 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక్క కారు కూడా అమ్ముడవకపోవడం గమనార్హం. 2025 డిసెంబర్‌లో చివరిసారిగా కేవలం 80 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే సగటున నెలకు 34 కార్లు కూడా అమ్మలేని స్థితికి ఈ ఎంపీవీ (MPV) చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ మిగిలిపోయిన స్టాక్‌ను క్లియర్ చేసే పనిలో ఉందని సమాచారం.

From Hero to Zero Why Mahindra Marazzo Sold Just 381 Units in a Year A Shocking Collapse

మహీంద్రా మరాజోను చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. దీని డిజైన్ సముద్రపు వేటగాడు షార్క్ (Shark) నుంచి స్ఫూర్తి పొందింది. కారు ముందు భాగం గ్రిల్ షార్క్ పళ్ళలా, వెనుక టెయిల్ లైట్స్ షార్క్ తోకలా కనిపిస్తాయి. చూడటానికి కారు చాలా ప్రీమియం లుక్‌తో ఉంటుంది. లోపల డ్యాష్‌బోర్డ్ కూడా డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌తో, లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. కానీ ఇంత గొప్ప డిజైన్ ఉన్నా కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమైంది. దీనికి ప్రధాన కారణం ఈ సెగ్మెంట్లో ఎర్టిగా వంటి కార్ల నుంచి వస్తున్న గట్టి పోటీయే.

మరాజోలో 7-సీటర్, 8-సీటర్ ఆప్షన్లు ఉన్నాయి. దీనిలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కారులో రూఫ్ మౌంటెడ్ ఎయిర్ వెంట్స్ (Roof Mounted Air Vents) ఇచ్చారు. అంటే ఏసీ గాలి నేరుగా వెనుక సీట్లలో ఉన్న వారికి కూడా చాలా వేగంగా అందుతుంది. 1.2GB నుంచి 8GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కూడా దీని సొంతం. సేఫ్టీ పరంగా చూస్తే డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఐసోఫిక్స్ వంటి ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి.

From Hero to Zero Why Mahindra Marazzo Sold Just 381 Units in a Year A Shocking Collapse

మరాజోలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 121 హార్స్‌పవర్ శక్తిని, 300 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. కారు ఇంజన్ చాలా నిశ్శబ్దంగా ఉంటుందని పేరున్నప్పటికీ, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ లేకపోవడం, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేకపోవడం దీనికి పెద్ద మైనస్ పాయింట్లుగా మారాయి. మారుతి ఎర్టిగా, ఎక్స్‌ఎల్6 వంటి కార్లు పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉండటంతో కస్టమర్లు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు.

మరాజో భవిష్యత్తు ఏంటి?
ప్రస్తుతం మరాజో ఎక్స్-షోరూమ్ ధర రూ.14.06 లక్షల నుంచి రూ.16.38 లక్షల వరకు ఉంది. అయితే ఈ ధర వద్ద కస్టమర్లు మహీంద్రా నుంచి స్కార్పియో ఎన్ లేదా XUV 700 వంటి కార్లనే ఎంచుకుంటున్నారు. అమ్మకాలు లేకపోవడంతో మహీంద్రా త్వరలోనే ఈ మోడల్‌ను పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ మోడల్ ఉన్నప్పటికీ, కొత్తగా తయారు చేస్తున్న దాఖలాలు లేవు. బహుశా రాబోయే రోజుల్లో దీని స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీని ప్రవేశపెట్టే ప్లాన్‌లో మహీంద్రా ఉన్నట్టు తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, April 17, 2026, 7:39 [IST]
English summary
From hero to zero why mahindra marazzo sold just 381 units in a year a shocking collapse
Read more on: #mahindra #mpv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+