మైలేజ్ కోసం ఎక్కువ మంది కొంటున్న కారు ఇదే.. సగం మంది ఈ CNGనే ఎంచుకుంటున్నారు!

భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki)కి ఇటీవల కాలంలో భారీ సక్సెస్ అందించిన మోడళ్లలో మారుతి విక్టోరిస్ (Victoris) ఒకటి. మిడ్-సైజ్ SUV విభాగంలో ఎన్నో ఏళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో కంపెనీ ఈ SUVని మార్కెట్లో ప్రవేశపెట్టింది. విడుదలైన కొద్ది కాలంలోనే విక్టోరిస్ కస్టమర్ల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుని, ఈ సెగ్మెంట్‌లో మెరుగైన స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం భారత మిడ్-సైజ్ SUV మార్కెట్లో అమ్మకాల పరంగా హ్యుందాయ్ క్రెటా మొదటి స్థానంలో కొనసాగుతుండగా, విక్టోరిస్ రెండో స్థానంలో నిలుస్తోంది. ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్లు, మంచి మైలేజ్, బలమైన బ్రాండ్ ఇమేజ్ వంటి అంశాలు ఈ SUV సక్సెస్‌కు ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ముఖ్యంగా మైలేజ్‌కు ప్రాధాన్యత ఇచ్చే భారతీయ కస్టమర్లను ఈ మోడల్ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. అమ్మకాల గణాంకాలను చూసినట్లయితే, విక్టోరిస్ CNG వెర్షన్‌కు మార్కెట్లో మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా మారుతి సుజుకి సగటున 10,000 గ్రాండ్ విక్టోరిస్ యూనిట్లను విక్రయిస్తుండగా, అందులో దాదాపు 5,000 యూనిట్లు CNG వేరియంట్‌వే కావడం విశేషం. అంటే మొత్తం అమ్మకాల్లో దాదాపు సగం వరకు CNG మోడళ్లే ఉన్నాయి.

Half Of Maruti Suzuki Victoris Suv Buyers Choose Cng Variant Details

పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ వెర్షన్‌ను ఎంతగా ఇష్టపడుతున్నారో స్పష్టం చేస్తోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో తక్కువ నిర్వహణ ఖర్చుతో పాటు ఎక్కువ మైలేజ్ అందించే CNG వాహనాలకు డిమాండ్ పెరగడం కూడా విక్టోరిస్ CNG అమ్మకాలకు బాగా కలిసివచ్చింది. అయితే, CNG కార్లలో చాలామందిని ఇబ్బంది పెట్టే అంశం బూట్ స్పేస్. సాధారణంగా CNG సిలిండర్‌ను డిక్కీలో అమర్చడం వల్ల లగేజీ పెట్టుకునే స్థలం బాగా తగ్గిపోతుంది.

కుటుంబంతో ప్రయాణించే వారికి ఇది ఒక ప్రధాన లోపంగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు మొదట టాటా మోటార్స్ ట్విన్-సిలిండర్ CNG టెక్నాలజీని పరిచయం చేసింది. రెండు చిన్న సిలిండర్లను కార్ ఫ్లోర్ కింద అమర్చడం ద్వారా డిక్కీలో కొంత ఎక్కువ స్థలాన్ని అందించింది. దీంతో వినియోగదారులు CNG ప్రయోజనాలతో పాటు మరింత బూట్ స్పేస్‌ను కూడా ఉపయోగించవచ్చు. అయితే మారుతి ఈ విషయంలో మరో అడుగు ముందుకేసింది.

Half Of Maruti Suzuki Victoris Suv Buyers Choose Cng Variant Details

మారుతి విక్టోరిస్ CNGలో CNG ట్యాంక్‌ను నేరుగా కారు అండర్‌బాడీలో అమర్చింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ తరహా అండర్‌బాడీ CNG ట్యాంక్ లేఅవుట్‌ను అందిస్తున్న ఏకైక కారు ఇదేనని చెబుతున్నారు. దీంతో డిక్కీ స్పేస్‌పై పెద్దగా ప్రభావం పడకుండా CNG సౌకర్యాన్ని కస్టమర్లు పొందే అవకాశం కలిగింది. ఎక్కువ లగేజీతో ప్రయాణించే కుటుంబాలకు ఇది ఒక ముఖ్యమైన ఉపయోగకరంగా నిలుస్తుంది.

ప్రస్తుతం మారుతి సుజుకి మారుతి విక్టోరిస్‌ను పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్, CNG అనే మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో విక్రయిస్తోంది. అయినప్పటికీ కొనుగోలుదారుల ఆసక్తి ఎక్కువగా CNG వేరియంట్‌పైనే కనిపిస్తోంది. కంపెనీ అమ్మకాల గణాంకాల ప్రకారం, మారుతి విక్టోరిస్ మొత్తం అమ్మకాల్లో దాదాపు 50 శాతం వాటా CNG వేరియంట్‌దే. ఇది భారతీయ వినియోగదారులు మైలేజ్‌తో పాటు ఉపయోగకరమైన ఫీచర్లకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో మరోసారి నిరూపిస్తోంది.

Half Of Maruti Suzuki Victoris Suv Buyers Choose Cng Variant Details

మారుతి సుజుకి విక్టోరిస్ CNG వెర్షన్‌‌ను ప్రస్తుతం ప్రధానంగా మూడు వేరియంట్లు LXI, VXI, ZXI లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ CNG వేరియంట్లను మార్కెట్లో దాదాపుగా మనం రూ. 11.50 లక్షల నుండి రూ. 14.72 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయడానికి వీలవుతుంది. అయితే, ఈ ఇంజిన్‌లో కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ మాత్రమే అందించబడింది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేదు.

Article Published On: Monday, July 6, 2026, 14:19 [IST]
English summary
Half of maruti suzuki victoris suv buyers choose cng variant details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+