తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ..మధ్య తరగతి మనసు దోచిన హ్యాచ్ బ్యాక్ కార్లు ఇవే
2026 ప్రారంభంలో భారత ఆటోమొబైల్ రంగం కొత్త ఉత్తేజాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా జనవరి నెలలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అమ్మకాలు పెను మార్పులకు లోనయ్యాయి. కొన్ని మోడళ్లు రికార్డు వృద్ధిని సాధించగా, మరికొన్ని భారీ పతనాన్ని చవిచూశాయి. మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని కాపాడుకున్నప్పటికీ, టాటా, హ్యుందాయ్ నుంచి గట్టి సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి కారు అమ్మకాల తీరును విడివిడిగా విశ్లేషిస్తే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.
1. మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)
జనవరి 2026లో మారుతి సుజుకి స్విఫ్ట్ తన విజయయాత్రను కొనసాగిస్తూ 17,806 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది జనవరిలో అమ్ముడైన 17,081 యూనిట్లతో పోలిస్తే ఇది 4% వృద్ధి. యువతను ఆకట్టుకునే స్పోర్టీ లుక్, అద్భుతమైన మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ ఈ కారుకు తిరుగులేని బలాలుగా నిలిచాయి. మధ్యతరగతి కుటుంబాల్లో స్విఫ్ట్‌పై ఉన్న నమ్మకం, బలమైన రీసేల్ వాల్యూ దీనిని ఇప్పటికీ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అన్-డిస్ప్యూటెడ్ కింగ్‌గా నిలబెడుతున్నాయి.

2. మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno)
మారుతి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఈసారి నిరాశపరిచింది. గతేడాది జనవరిలో 19,965 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈ ఏడాది 16 శాతం క్షీణతతో 16,782 యూనిట్లకు పడిపోయింది. నెక్సా షోరూమ్‌ల ద్వారా లభించే ఈ కారుకు పోటీగా ఇతర కంపెనీల నుంచి కొత్త ఫీచర్లతో కూడిన మోడళ్లు రావడం, అలాగే కస్టమర్లు బాలెనో కంటే కాంపాక్ట్ ఎస్‌యూవీల (ఉదాహరణకు ఫ్రాంక్స్) వైపు మొగ్గు చూపడం దీని అమ్మకాలపై ప్రభావం చూపింది.
3. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R)
మారుతి సుజుకికి అత్యంత ఆందోళన కలిగించిన విషయం వేగన్ ఆర్ అమ్మకాలు. గతేడాది జనవరిలో 24,078 యూనిట్లతో దూసుకుపోయిన ఈ కారు, ఈ ఏడాది ఏకంగా 37 శాతం పడిపోయి 15,118 యూనిట్లకే పరిమితమైంది. ప్రాక్టికల్ డిజైన్, సీఎన్‌జీ ఆప్షన్ ఉన్నప్పటికీ, కొత్త తరం మ్యూరి మ్యాక్రో ఎస్‌యూవీలు (టాటా పంచ్ వంటివి) అదే ధరలో మంచి సేఫ్టీని అందిస్తుండటంతో కస్టమర్లు వ్యాగన్ ఆర్ నుంచి పక్కకు తప్పుకుంటున్నారు.

4. మారుతి సుజుకి ఆల్టో (Maruti Suzuki Alto)
చిన్న కార్ల విభాగంలో ఆల్టో తన సత్తా మళ్ళీ చాటింది. ఈ ఏడాది జనవరిలో 12,314 యూనిట్ల అమ్మకాలతో 8% వృద్ధి నమోదు చేసింది. గత కొన్నాళ్లుగా స్లోగా ఉన్న ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ మళ్లీ ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో మొదటిసారి కారు కొనేవారికి ఆల్టో ఇప్పటికీ మొదటి ఎంపికగా ఉంటోంది.
5. టాటా టియాగో (Tata Tiago)
టాటా టియాగో 8,349 యూనిట్ల విక్రయాలతో 23 శాతం వృద్ధి సాధించింది. సేఫ్టీ విషయంలో 4-స్టార్ రేటింగ్ ఉండటం, పెట్రోల్, సీఎన్‌జీతో పాటు ఎలక్ట్రిక్ (EV) వేరియంట్లలో కూడా లభిస్తుండటం టియాగోకు కలిసొచ్చింది. హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో టియాగో ఇప్పుడు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను వెనక్కి నెట్టి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
6. టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz)
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా ఆల్ట్రోజ్ అద్భుతం చేసింది. ఏకంగా 54 శాతం భారీ వృద్ధి నమోదు చేసి 3,135 యూనిట్లకు చేరుకుంది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, ప్రీమియం ఇంటీరియర్స్ మరియు బలిష్టమైన బిల్డ్ క్వాలిటీ కారణంగా భద్రతకు ప్రాధాన్యత ఇచ్చే యువత ఈ కారు వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.

7. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)
హ్యుందాయ్ కంపెనీకి గ్రాండ్ ఐ10 నియోస్ పెద్ద ఊరటనిచ్చింది. గతేడాది 5,311 యూనిట్లు మాత్రమే విక్రయించిన ఈ మోడల్, ఈ జనవరిలో 7,710 యూనిట్లతో ఏకంగా 45 శాతం వృద్ధి సాధించింది. తక్కువ ధరకు ప్రీమియం ఫీచర్లు, స్మూత్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఈ కారును సిటీ డ్రైవింగ్‌కు బెస్ట్ ఆప్షన్‌గా మార్చాయి.
8. హ్యుందాయ్ ఐ20 (Hyundai i20)
ప్రీమియం కార్ల విభాగంలో ఐ20 కూడా తన మార్కును చాటుకుంది. గతేడాది కంటే 20 శాతం వృద్ధి సాధించి 5,677 యూనిట్లను విక్రయించింది. గ్లాంజా, ఆల్ట్రోజ్ వంటి పోటీదారులు ఉన్నప్పటికీ, తన స్టైలిష్ లుక్, హైటెక్ ఫీచర్లతో ఐ20 కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
9. వెనుకబడిన మోడళ్లు
టయోటా గ్లాంజా (Toyota Glanza): బాలెనో ఆధారిత ఈ కారు 14 శాతం క్షీణతతో 2,978 యూనిట్లకు పడిపోయింది.
మారుతి ఇగ్నిస్ (Maruti Ignis): ఈ కారు అమ్మకాల్లో 50 శాతం భారీ పతనాన్ని చూసింది (కేవలం 1,902 యూనిట్లు). దీని విభిన్నమైన డిజైన్ అందరినీ ఆకట్టుకోలేకపోవడమే ప్రధాన కారణం.
రెనాల్ట్ క్విడ్ (Renault Kwid): ఒకప్పుడు సంచలనం సృష్టించిన క్విడ్ ఇప్పుడు కేవలం 503 యూనిట్లకే పరిమితమైంది. టాటా, మారుతి నుంచి వస్తున్న గట్టి పోటీని తట్టుకోవడంలో ఈ కారు విఫలమవుతోంది.


Click it and Unblock the Notifications








