తక్కువ ఖర్చు.. ఎక్కువ మైలేజ్.. ఏడాదిలో 37 లక్షల బైక్‌లు అమ్మిందంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు

భారతీయ రోడ్లపై ఏ బైక్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే చిన్న పిల్లాడైనా చెప్పే పేరు హీరో స్ప్లెండర్. దశాబ్దాలు గడుస్తున్నా, కొత్త మోడళ్లు ఎన్ని వస్తున్నా స్ప్లెండర్ హవా మాత్రం తగ్గడం లేదు. తాజాగా ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో (FY2026) ఈ బైక్ మరోసారి తన సత్తా చాటింది. కేవలం గతేడాది కాలంలోనే ఏకంగా 37 లక్షల మందికి పైగా ఈ బైక్‌ను కొనుగోలు చేశారంటే, సామాన్యుడికి ఈ బైక్ మీద ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. హోండా షైన్, బజాజ్ పల్సర్, టీవీఎస్ అపాచీ వంటి ఉద్ధండులను వెనక్కి నెట్టి స్ప్లెండర్ అగ్రస్థానంలో నిలిచింది.

స్ప్లెండర్ రికార్డుల వేట
హీరో మోటోకార్ప్ తన స్ప్లెండర్ మోడల్‌తో భారతీయ టూ వీలర్ మార్కెట్లో అజేయమైన శక్తిగా ఎదిగింది. గడిచిన 12 నెలల్లో (ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు) హీరో స్ప్లెండర్ మొత్తం 37,27,739 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. అంటే సగటున రోజుకు సుమారు 10 వేలకు పైగా స్ప్లెండర్ బైక్‌లు అమ్ముడయ్యాయి. కేవలం మార్చి 2026 నెలలోనే ఈ బైక్ దేశంలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా నిలవడం విశేషం. గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు స్ప్లెండర్ కు ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

Hero Splendor Dominates FY2026 Sells 37 Lakh Units to Beat Pulsar Shine and Apache

రెండో స్థానంలో హోండా షైన్
125cc విభాగంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన హోండా షైన్ ఈ జాబితాలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది కాలంలో హోండా షైన్ మొత్తం 19,87,466 యూనిట్లు అమ్ముడైంది. స్ప్లెండర్‌తో పోలిస్తే ఇది సగం తక్కువ అయినప్పటికీ, తన విభాగంలో మాత్రం షైన్ దూసుకుపోతోంది. ముఖ్యంగా స్మూత్ ఇంజిన్, స్టైలిష్ లుక్స్ కోరుకునే వారు షైన్ వైపు మొగ్గు చూపుతున్నారు.

టాప్-5లో ఉన్న ఇతర బైక్‌లు
బజాజ్ కంపెనీకి చెందిన పల్సర్ సిరీస్ 13,99,491 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచింది. పల్సర్ యువతలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగో స్థానంలో హీరో కంపెనీకే చెందిన మరో బడ్జెట్ బైక్ హెచ్ఎఫ్ డీలక్స్ (HF Deluxe) నిలిచింది. ఇది సుమారు 10,12,199 యూనిట్లు అమ్ముడైంది. తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా మారింది. ఇక టీవీఎస్ కంపెనీ నుంచి వచ్చిన పవర్ ఫుల్ బైక్ అపాచీ 5,71,376 యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

Hero Splendor Dominates FY2026 Sells 37 Lakh Units to Beat Pulsar Shine and Apache

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రేజ్
ఒకప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు అంటే కేవలం కొందరికే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు మధ్యతరగతి యువత కూడా బుల్లెట్ బైక్ వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకే టాప్-10 జాబితాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఏడో స్థానంలో నిలిచింది. గతేడాది కాలంలో ఇది 4,10,347 యూనిట్లు అమ్ముడైంది. దీనితో పాటు బుల్లెట్ 350 మోడల్ కూడా 2,55,699 యూనిట్ల అమ్మకాలతో తొమ్మిదో స్థానంలో నిలిచి తన బ్రాండ్ వాల్యూని కాపాడుకుంది.

రైడర్, ఇతర బైక్స్
టీవీఎస్ కంపెనీ నుంచి వచ్చిన స్టైలిష్ 125cc బైక్ రైడర్ ఆరో స్థానంలో నిలిచింది. ఇది 4,26,877 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. బజాజ్ వారి అత్యంత పొదుపు బైక్ ప్లాటినా 4,07,451 యూనిట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. చివరగా పదో స్థానంలో హీరో ప్యాషన్ 2,48,621 యూనిట్లతో నిలిచింది. దీనిని బట్టి చూస్తే టాప్-10 జాబితాలో హీరో మోటోకార్ప్ కు చెందిన మూడు బైక్‌లు ఉండటం గమనార్హం.

Hero Splendor Dominates FY2026 Sells 37 Lakh Units to Beat Pulsar Shine and Apache

ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ ధరలు మండుతున్న వేళ, సామాన్యుడు మైలేజ్ ఇచ్చే బైక్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు. అదే సమయంలో అద్భుతమైన రీసేల్ వాల్యూ, తక్కువ మెయింటెనెన్స్ ఉండటం వల్లే హీరో స్ప్లెండర్ ఇన్నేళ్లుగా తన స్థానాన్ని పదిలపరుచుకోగలుగుతోంది. అయితే పల్సర్, అపాచీ, రైడర్ వంటి మోడళ్లు యువతను ఆకట్టుకోవడంలో సఫలమవుతున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బైక్‌లు వస్తున్నా, పెట్రోల్ ఇంజిన్ బైక్‌లలో స్ప్లెండర్ హవా మాత్రం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

Article Published On: Friday, April 24, 2026, 14:48 [IST]
English summary
Hero splendor dominates fy2026 sells 37 lakh units to beat pulsar shine and apache
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+