అందరూ కొంటున్న కారు ధర పెరిగింది.. ఇక ఆ కారు కొనాలంటే కొంచెం కష్టమే! ప్రస్తుతం ఎంతంటే?
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం SUVల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆ ట్రెండ్‌కు భిన్నంగా సెడాన్ విభాగంలో ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును నిలుపుకుంటున్న కార్లలో హోండా అమేజ్ (Honda Amaze) ఒకటి. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు సెడాన్ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలవడం ద్వారా, అమేజ్‌కు ఉన్న విశ్వసనీయతను ఇది మరోసారి నిరూపించింది. కుటుంబ వినియోగానికి అనుకూలమైన డిజైన్, హోండా బ్రాండ్ నమ్మకం, మెరుగైన మైలేజ్ వంటి అంశాలు ఈ కారును కొనుగోలుదారులకు ఎప్పటికీ ఆకర్షణీయంగా మార్చాయి. అయితే, తాజాగా హోండా తీసుకున్న ఒక నిర్ణయం మార్కెట్‌లో చర్చకు దారితీసింది. అకస్మాత్తుగా రూ.6,990 ధర పెంపు ప్రకటన రావడంతో, అమేజ్‌ను కొనాలని భావిస్తున్న వారికి ఇది కొంత షాక్‌లా మారింది.
తాజాగా అమేజ్ ధరలు వేరియంట్‌ను బట్టి పెరిగాయి. ప్రస్తుతం ఈ కారు బేస్ వేరియంట్‌కు రూ.7,47,790 నుండి ప్రారంభమవుతుండగా, టాప్-స్పెక్ ZX CVT వేరియంట్ ధర రూ.9,99,900 వరకు చేరింది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే కావడం గమనార్హం. అంటే ఆన్-రోడ్ ధరలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముంది. ఈ ధరల పెంపుకు గల కారణాలపై హోండా స్పష్టతనిచ్చింది. ముడి పదార్థాల ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం ప్రభావం ఎక్కువగా ఉండటం.

అలాగే ఉత్పత్తికి సంబంధించిన ఇన్‌పుట్ ఖర్చులలో హెచ్చుతగ్గులు వంటి అంశాలు తమపై ప్రతికూల ప్రభావం చూపాయని కంపెనీ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ధరలను సవరించాల్సి వచ్చిందని హోండా వెల్లడించింది. వేరియంట్‌ను బట్టి పెరుగుదల భిన్నంగా ఉండటంతో, కొన్ని వేరియంట్లపై ప్రభావం కొంత ఎక్కువగా, మరికొన్నింటిపై కొంత తక్కువగా ఉండే అవకాశముంది. ఈ పెరిగిన ధరలతో కూడా హోండా అమేజ్ తన డిమాండ్‌ను నిలుపుకుంటుందా చూడాలి.
ఇప్పటికే SUVల వైపు ఎక్కువ మంది కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్న ఈ సమయంలో, సెడాన్ విభాగంలో ఉన్న అమేజ్ ధరలు పెరగడం మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. హోండా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం మరియు అమేజ్‌కు ఉన్న మార్కెట్ పేరు కారణంగా, ఈ కారు ఇంకా చాలా మందికి ఆకర్షణీయమైన ఎంపికగానే ఉండే అవకాశాలు ఉన్నాయని ఆటోమొబైల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

హోండా అమేజ్ ఇతర వివరాలను పరిశీలిస్తే, హోండా అమేజ్‌లో 1.2 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తోంది. ఈ ఇంజిన్ హోండాకు ప్రత్యేకమైన స్మూత్ పనితీరు, నమ్మకాన్ని కలిగి ఉండటమే కాకుండా, నగర ప్రయాణాలు అలాగే హైవే డ్రైవింగ్‌కు కూడా సరిపడే శక్తిని ఇస్తుంది. ఈ ఇంజిన్‌తో పాటు వినియోగదారుల అభిరుచిని బట్టి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను కంపెనీ అందిస్తోంది.
మైలేజ్ పరంగా కూడా అమేజ్ నిరాశపరచదు. హోండా అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, CVT ఆటోమేటిక్ వేరియంట్‌తో 19.46 కిలోమీటర్లు ప్రతి లీటర్ మైలేజ్‌ను ఇస్తుంది. అదే సమయంలో, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉన్న వేరియంట్‌తో 18.65 కిలోమీటర్లు ప్రతి లీటర్ మైలేజ్‌ను అందిస్తుంది. ఈ సంఖ్యలు రోజువారీ వినియోగానికి, ముఖ్యంగా ఇంధన వ్యయం పై శ్రద్ధ పెట్టే మిడిల్ క్లాస్ కొనుగోలుదారులకు అమేజ్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి.

భద్రత అంశాల్లో కూడా 3వ తరం హోండా అమేజ్ కీలకమైన అడుగు వేసింది. ఇటీవల ఈ కారు క్రాష్ టెస్ట్‌కు లోనై, భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP) ద్వారా పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ రేటింగ్ అమేజ్‌ను తన విభాగంలో అత్యంత సురక్షితమైన సెడాన్‌లలో ఒకటిగా నిలబెడుతుంది. ఇది ప్రమాద సమయంలో ప్రయాణికులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


Click it and Unblock the Notifications








