అమేజ్‌పై భారీ తగ్గింపు ఆఫర్ ఇస్తోన్న హోండా.. ఈ నెల చివరి వరకే ఛాన్స్! ఈ ఆఫర్ మిస్ అయితే నష్టం
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) భారత మార్కెట్లో పోటీని మరింత కఠినంగా మార్చేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా తన ప్రసిద్ధ కాంపాక్ట్ సెడాన్ అయిన హోండా అమేజ్ (Honda Amaze) అమ్మకాలను పెంచుకోవడానికి ఈసారి ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. మార్చి నెలను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్, కొత్త కారు కొనాలని భావిస్తున్న వినియోగదారులకు మంచి అవకాశంగా మారింది. 4 మీటర్ల లోపు సెడాన్ విభాగంలో మంచి గుర్తింపు పొందిన హోండా అమేజ్ పై మొత్తం రూ.57,000 వరకు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
సాధారణంగా సెడాన్ విభాగంలో మారుతి సుజుకి డిజైర్ కారు అమ్మకాల పరంగా టాప్ ప్లేస్‌లో ఉంటుంది. డిజైర్ తరువాత అత్యధికంగా సేల్ అవుతున్న సెడాన్ కారు హోండా అమేజ్ మాత్రమే. ఈ క్రమంలో అమేజ్ కారుపై ఇంత భారీ మొత్తంలో ప్రయోజనాలు లభించడంతో కొత్త వినియోగదారులు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరో విషయం ఏమిటంటే, ఈ ఆఫర్ మార్చి చివర వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కాబట్టి కస్టమర్లు లేట్ చేయకుండా మీ దగ్గరలోని హోండా అధీకృత డీలర్‌షిప్‌లో సంప్రదించాలి. ఈ ఆఫర్‌లో భాగంగా నేరుగా రూ. 20,000 వరకు నగదు తగ్గింపు ఇవ్వడం గమనార్హం. అంటే షోరూమ్ ధర నుంచే ఈ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు. అదనంగా, తమ పాత వాహనాన్ని ఎక్స్చేంజ్ చేసుకునే వినియోగదారులకు రూ.10,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.
ఇంతటితో ఆగకుండా, ఇప్పటికే హోండా కస్టమర్లకు మరింత ప్రయోజనం కల్పించేందుకు లాయల్టీ ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో మరో రూ.10,000ను అందిస్తున్నారు. ఇది ఇప్పటికే Honda వాహనాలు ఉపయోగిస్తున్న వారికి ఒక అదనపు లాభంగా మారుతుంది. అలాగే కార్పొరేట్ ఉద్యోగుల కోసం రూ.13,000 వరకు ప్రత్యేక తగ్గింపును కూడా అందిస్తున్నారు. దీని ద్వారా ఆఫీస్ ఉద్యోగులు ఈ కారును మరింత తక్కువ ధరలో కొనుగోలు చేసే అవకాశం పొందుతున్నారు.

ఇవే కాకుండా, ఇప్పటికే హోండా బ్రాండ్‌కు చెందిన వినియోగదారులకు రూ.4,000 లాయల్టీ బోనస్ కూడా అందుబాటులో ఉంది. ఇలా అన్ని ఆఫర్లను కలిపి చూస్తే, మొత్తం రూ.57,000 వరకు ప్రయోజనాలు పొందే అవకాశం ఉండటం వల్ల హోండా అమేజ్ కొనుగోలును మరింత ఆకర్షణీయంగా మార్చింది. పూర్తి వివరాల కోసం దగ్గరలోని షోరూమ్‌లో తెలుసుకోగలరు. ఏరియా, స్టాక్‌ను బట్టి ఆఫర్స్‌లో మార్పులు ఉండవచ్చు.
భారత మార్కెట్లో సెడాన్ సెగ్మెంట్‌లో మంచి పేరు సంపాదించిన అమేజ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.47 లక్షలు. పనితీరు విషయానికి వస్తే, దీనిలో 1.2 లీటర్, 4 సిలిండర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 88 బిహెచ్‌పి శక్తిని, 110 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలకు సరిపోయేలా స్మూత్, రిలైబుల్ పనితీరును అందించేలా ఈ ఇంజన్‌ను రూపొందించారు.

డ్రైవింగ్ స్టైల్‌కు అనుగుణంగా 5-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ సివిటి గేర్‌బాక్స్ ఎంపికలను కంపెనీ అందించడం వల్ల వినియోగదారులకు మరింత ఫ్లెక్సిబిలిటీ లభిస్తోంది. ఫీచర్స్ పరంగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు పవర్ విండోలు వంటి ఫీచర్లు రోజువారీ ఉపయోగాన్ని సౌకర్యవంతంగా మార్చుతున్నాయి.
అదనంగా, 7 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, వెనుక AC వెంట్లు వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా లెవెల్ 2 ADAS, ABS, EBD, ESC, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి కీలక ఫీచర్లు ఉన్నాయి. అలాగే ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉండటం వల్ల పార్కింగ్ సమయంలో డ్రైవర్‌కు అదనపు భద్రత లభిస్తుంది.


Click it and Unblock the Notifications








