షోరూం ఖాళీ చేయడానికి హోండా భారీ ప్లాన్.. ఎలివేట్‌పై రూ.1.71లక్షల వరకు న్యూఇయర్ డిస్కౌంట్

2026లో కొత్త కార్ల దండయాత్రకు ముందే షోరూమ్‌లను ఖాళీ చేయాలని హోండా భారీ నిర్ణయం తీసుకుంది.న్యూఇయర్ సందర్భంగా ఎలివేట్, సిటీ, అమేజ్ మోడళ్లపై రూ.1.71 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు జనవరి నెలలో మాత్రమే అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారుల్లో హడావుడి మొదలైంది.

కొత్త ఏడాది 2026 ప్రారంభం కావడంతో కార్ల తయారీ సంస్థలు తమ పాత స్టాక్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డాయి. ఈ రేసులో జపాన్ దిగ్గజం హోండీ కార్స్ (Honda Cars) అందరికంటే ముందు వరుసలో నిలిచింది. తన పాపులర్ మోడళ్లపై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించి కస్టమర్లను ఆశ్చర్యపరిచింది.

Honda New Year Blast Huge Discounts up to Rs 1 71 Lakh on Elevate City and Amaze

హోండీ కార్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ జనవరిలో హోండా కారు కొంటే ఏకంగా రూ.1.71 లక్షల వరకు ఆదా చేసుకునే వెసులుబాటు కల్పించింది.

హోండా కార్స్ ఇండియా 2026లో తన వ్యాపారాన్ని సరికొత్త పుంతలు తొక్కించాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు పొందిన ZR-V, ప్రిల్యూడ్, 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వంటి నాలుగు భారీ గ్లోబల్ మోడళ్లను భారత్‌లో లాంచ్ చేయబోతోంది.

Honda New Year Blast Huge Discounts up to Rs 1 71 Lakh on Elevate City and Amaze

ఈ కొత్త కార్ల ఎంట్రీకి ముందు, షోరూమ్‌లలో ఉన్న పాత స్టాక్‌ను వీలైనంత త్వరగా విక్రయించాలని కంపెనీ భావిస్తోంది. అందుకే తమ బెస్ట్ సెల్లింగ్ కార్లయిన ఎలివేట్ (Elevate), సిటీ (City), అమేజ్ (Amaze) మోడళ్లపై భారీ స్థాయిలో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్, ఇతర ప్రయోజనాలను ప్రకటించింది.

హోండా ఎలివేట్ (Honda Elevate): హోండా నుంచి వచ్చిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎలివేట్ పై ప్రస్తుతం అత్యధికంగా రూ.1.71 లక్షల వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు. మీరు 2025 మోడల్ ఇయర్ ఎలివేట్ కొంటే, అందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.45,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి. వీటికి తోడుగా కార్పొరేట్ బోనస్ లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఇచ్చే ప్రత్యేక తగ్గింపులు అదనం.

Honda New Year Blast Huge Discounts up to Rs 1 71 Lakh on Elevate City and Amaze

అంతేకాకుండా, 7 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల ఎక్స్టెండెడ్ వారంటీపై రూ.19,000 వరకు రాయితీ ఇస్తున్నారు. అదనంగా 360-డిగ్రీ కెమెరా, యాంబియంట్ లైటింగ్ వంటి యాక్సెసరీలను కూడా డిస్కౌంట్ ధరలకే పొందే అవకాశం ఉంది. ఎంట్రీ లెవల్ ఎస్‌వీ (SV) ట్రిమ్ కొనే వారికి కూడా రూ.43,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.

హోండా సిటీ (Honda City) : ప్రీమియం సెడాన్ సెగ్మెంట్లో రారాజుగా వెలుగుతున్న హోండా సిటీపై జనవరి నెలలో రూ.1.33 లక్షల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌వీ, వి, విఎక్స్ వేరియంట్లపై రూ.40,000 క్యాష్ డిస్కౌంట్ తో పాటు రూ.30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.

పాత హోండా కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లాయల్టీ బోనస్ కూడా ఉంటుంది. ఇక టాప్ ఎండ్ జెడ్ఎక్స్ (ZX) మోడల్ పై రూ.20,000 క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. హైబ్రిడ్ వెర్షన్ (City e:HEV) కొనే వారికి మాత్రం కేవలం వారంటీపై రూ. 17,000 తగ్గింపు మాత్రమే లభిస్తుంది.

హోండీ అమేజ్ (Honda Amaze) : హోండా ఎంట్రీ లెవల్ కారు అమేజ్ కొనే వారికి కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ జనరేషన్ పాత మోడల్ పై రూ.65,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ.20,000 నగదు తగ్గింపు ప్రధాన ఆకర్షణ.

ఇక కొత్త అమేజ్ మోడల్ కావాలనుకునే వారికి రూ.54,000 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంచుకునే వేరియంట్ (VX CVT లేదా ZX Manual)ని బట్టి ఈ డిస్కౌంట్లలో మార్పులు ఉంటాయి. 7 ఏళ్ల వారంటీ ప్యాకేజీపై రూ.15,000 వరకు అదనంగా సేవ్ చేసుకోవచ్చు.

ఈ ఆఫర్లు అన్నీ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే మీరు ఉండే నగరం, డీలర్షిప్, కారు వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్ మొత్తంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కాబట్టి కారు బుక్ చేసుకునే ముందు మీ దగ్గరలోని హోండీ షోరూమ్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం. 2026లో హోండా నుంచి రాబోతున్న కొత్త తరం కార్ల కోసం ఎదురుచూసే వారు కొందరైతే, భారీ డిస్కౌంట్లతో పాత ధరకే పక్కా భరోసా ఇచ్చే ప్రస్తుత మోడళ్లను దక్కించుకోవాలని చూసే వారు మరికొందరు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 7, 2026, 14:18 [IST]
English summary
Honda new year blast huge discounts up to rs 1 71 lakh on elevate city and amaze
Read more on: #honda #honda city #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+