పెట్రోల్ ఖర్చుకు చెక్..తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు..2030 నాటికి 7 కొత్త మోడళ్లతో హోండా మాస్టర్ ప్లాన్

ప్రస్తుత రోజుల్లో కారు కొనడం అనేది ఒక విలాసం మాత్రమే కాదు, అవసరం కూడా. అయితే సామాన్యుడు కారు కొనేటప్పుడు ప్రధానంగా చూసేది తక్కువ ధర, ఎక్కువ నాణ్యత, భద్రత. ఈ మూడింటి కలయికతో హోండా కార్స్ ఇండియా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. 2030 నాటికి 10 కొత్త కార్లను లాంచ్ చేస్తామని ప్రకటించిన హోండా, అందులో సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా 7 ఎస్‌యూవీలను తీసుకురాబోతోంది. అమ్మకాలు తగ్గుతున్నా.. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే పట్టుదలతో హోండా ఉంది.

హోండా కార్స్ ఇండియా (Honda Cars India) డిసెంబర్ 2025 అమ్మకాల నివేదికను విడుదల చేసింది. వార్షిక ఎగుమతుల్లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, భారతీయ మార్కెట్లో హోండా కార్లకు ఆదరణ పెరుగుతుండటం విశేషం. ముఖ్యంగా హోండా అమేజ్, సిటీ, ఎలివేట్ మోడళ్లు అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. భవిష్యత్తులో ఏకంగా 10 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టే దిశగా కంపెనీ భారీ వ్యూహంతో ముందుకు సాగుతోంది.

Honda s Comeback Strategy Strong India Sales 5-Star Amaze 10 New Launches Ahead

హోండా కార్స్ ఇండియా 2025 డిసెంబర్‌లో భారతీయ మార్కెట్లో 5,807 యూనిట్లను విక్రయించింది. 2024 డిసెంబర్ (5,603 యూనిట్లు) తో పోలిస్తే ఇది 3.64 శాతం వృద్ధిని నమోదు చేసింది. నవంబర్ 2025 తో పోల్చినా అమ్మకాలు దాదాపు 11.59 శాతం పెరగడం గమనార్హం.

ఎగుమతుల విషయానికి వస్తే, 2025 డిసెంబర్‌లో 2,352 యూనిట్లను కంపెనీ విదేశాలకు పంపింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఎగుమతుల్లో 39 శాతం తగ్గుదల కనిపించింది. హోండా ఎలివేట్ (విదేశాల్లో WR-V) కు జపాన్ వంటి మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది.

Honda s Comeback Strategy Strong India Sales 5-Star Amaze 10 New Launches Ahead

హోండాకు కలిసొచ్చిన మరో ప్రధాన అంశం హోండా అమేజ్ (Amaze) భద్రత. ఇటీవలే జరిగిన Bharat NCAP క్రాష్ టెస్ట్‌లో 3వ జనరేషన్ హోండా అమేజ్ 5-స్టార్ రేటింగ్ సాధించి, దేశంలోనే సురక్షితమైన సెడాన్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది కాకుండా హోండా సిటీ, ఎలివేట్ మోడళ్లు కూడా మార్కెట్లో స్థిరమైన అమ్మకాలను సాగిస్తున్నాయి. రాబోయే 2026 సంవత్సరంలో కొత్త ఫీచర్లతో మరిన్ని అప్‌డేటెడ్ మోడళ్లను తీసుకువస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

హోండా తన భవిష్యత్తు ప్రణాళికలను స్పష్టం చేసింది. 2030 నాటికి మొత్తం 10 కొత్త కార్లను భారత్‌లో లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 7 సరికొత్త ఎస్‌యూవీలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో హోండా 0 ఆల్ఫా(Honda 0 Alpha) పేరుతో ఒక ఈవీని తీసుకురానుంది. ఇది మన దేశంలో తయారై ప్రపంచ దేశాలకు ఎగుమతి కానుంది. అలాగే సిటీ సెడాన్, ఎలివేట్ మోడళ్లకు 2026లో మరిన్ని ఫీచర్లతో కూడిన ఫేస్‌లిఫ్ట్ వర్షన్లను హోండా ప్లాన్ చేస్తోంది.

Honda s Comeback Strategy Strong India Sales 5-Star Amaze 10 New Launches Ahead

కొత్త ఏడాది నుంచి హోండా కార్లు కొనేవారికి ఒక షాకింగ్ న్యూస్. ముడి పదార్థాల ఖర్చులు, లాజిస్టిక్స్ భారం పెరగడంతో జనవరి 2026 నుంచి హోండా తన కార్ల ధరలను పెంచబోతోంది. ప్రస్తుతం ఉన్న స్టాక్ ముగిసే వరకు పాత ధరలే వర్తిస్తాయని, కొత్త మోడల్ ఇయర్ వాహనాలకు పెంచిన ధరలు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. కాబట్టి, పాత ధరలకే కారు సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇదే సరైన సమయం. డిసెంబర్ ఆఫర్ల కింద ఎలివేట్, సిటీ వంటి మోడళ్లపై భారీ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, January 4, 2026, 12:17 [IST]
English summary
Honda s comeback strategy strong india sales 5 star amaze 10 new launches ahead
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+