డిజైర్ తర్వాత ఈ కారునే కొంటున్నారు.. ఫ్యామిలీ అవసరాలకు బెస్ట్ ఆప్షన్.. అందుకే డిమాండ్ ఎక్కువ!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా (Honda) భారత మార్కెట్లో చాలా కాలంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, నాణ్యత, నమ్మకం, డ్రైవింగ్ అనుభవం వంటి అంశాలతో ఈ బ్రాండ్ నిరంతరం వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా సెడాన్ విభాగంలో హోండా స్థానం ఎంతో బలంగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో హోండా అమేజ్ (Honda Amaze) ఒక కీలక మోడల్‌గా నిలిచింది. సింపుల్ డిజైన్, సౌకర్యవంతమైన క్యాబిన్, మంచి మైలేజ్ ఈ మూడు అంశాల సమ్మిళితంతో అమేజ్ భారత కుటుంబాలకి దగ్గరైంది. సాధారణంగా సెడాన్ మార్కెట్‌లో అమ్మకాల పరంగా మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో ఉండగా, దానికి సమీపంగా నిలిచి పోటీ ఇస్తున్న మోడల్‌గా అమేజ్ గుర్తింపు పొందింది.

ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు ఈ సెడాన్ ప్రదర్శనను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం, అంటే ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు హోండా అమేజ్ మొత్తం 32,906 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (FY25)లో ఇది 32,703 యూనిట్లుగా ఉండగా, ఈసారి స్వల్ప పెరుగుదల కనిపించింది. ఈ సంఖ్యలను పరిశీలిస్తే, దాదాపు 1 శాతం మేర వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది.

Honda Sedan Car Amaze Fy26 Sales Recorded 1 Percent Growth More Details Here

అంటే భారీగా పెరుగుదల కాకపోయినా, మార్కెట్‌లో ఉన్న కఠినమైన పోటీ మధ్య తన స్థిరత్వాన్ని నిలబెట్టుకోవడం అమేజ్‌కు ఒక పాజిటివ్ సంకేతంగా చెప్పవచ్చు. చాలా మోడళ్లు అమ్మకాలలో పెద్ద మార్పులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో, అమేజ్ మాత్రం తన స్థాయి నిలుపుకోవడంలో సక్సెస్ అయ్యింది. అమేజ్ స్థిరమైన డిమాండ్‌తో మార్కెట్‌లో తన స్థానాన్ని కాపాడుకుంటూ కొనసాగుతోంది. సెడాన్ సెగ్మెంట్‌లో పోటీ ఎంత పెరిగినా ఇంకా వినియోగదారుల ఎంపికలో నిలబెడుతున్నాయి.

దీని డిజైన్ గురించి చూసినట్లయితే, ముందుభాగంలో హోండాకు ప్రత్యేకమైన సిగ్నేచర్ గ్రిల్, క్రోమ్ టచ్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ గ్రిల్‌కు ఇరువైపులా ఉన్న స్లీక్ హెడ్‌ల్యాంప్స్ కారుకు శార్ప్ లుక్‌ను ఇస్తాయి. బంపర్ డిజైన్ కూడా సింపుల్‌గా ఉన్నప్పటికీ, మొత్తం ఫ్రంట్ ప్రొఫైల్‌కు ఒక సొగసైన స్టాన్స్‌ను అందిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో చూస్తే, కారులోని లైన్స్ చాలా సాఫ్ట్‌గా, ఫ్లోయింగ్ స్టైల్‌లో ఉంటాయి.

Honda Sedan Car Amaze Fy26 Sales Recorded 1 Percent Growth More Details Here

ఎక్కువగా అగ్రెసివ్ కట్‌లు లేకుండా, క్లీన్ బాడీ డిజైన్‌తో ఇది ఒక ఫ్యామిలీ సెడాన్‌గా సరైన ఇమేజ్‌ను క్రియేట్ చేస్తుంది. వీల్ ఆర్చ్‌లు, అలాయ్ వీల్స్ కూడా మొత్తం లుక్‌కు సమతుల్యతను తీసుకువస్తాయి.వెనుక భాగంలో కూడా అదే సింపుల్, ప్రీమియం డిజైన్ థీమ్ కొనసాగుతుంది. టెయిల్ ల్యాంప్స్ కాంపాక్ట్‌గా ఉండి, బూట్ డిజైన్‌తో బాగా కలిసిపోతాయి. మొత్తం రియర్ ప్రొఫైల్ చూస్తే, ఇది క్లీన్, నిటారుగా ఉన్న సెడాన్‌గా కనిపిస్తుంది.

హోండా అమేజ్ ధర విషయానికి వస్తే, ఇది రూ.7.47 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంది. పనితీరు పరంగా చూస్తే, ఈ సెడాన్‌లో 1.2-లీటర్, 4-సిలిండర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 88 బిహెచ్‌పి పవర్, 110 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ డ్రైవింగ్‌లో కంఫర్ట్‌ను, అలాగే నమ్మకాన్ని ఇచ్చే విధంగా ఈ ఇంజన్ ట్యూనింగ్ ఉంటుంది.

Honda Sedan Car Amaze Fy26 Sales Recorded 1 Percent Growth More Details Here

5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 7-స్పీడ్ సివిటి (CVT) ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, అనేక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు పవర్ విండోలు వంటి ఫీచర్లు వినియోగంలో సులభతను పెంచుతాయి. అదనంగా 7-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెనుక AC వెంట్స్ వంటి సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత కంఫర్టబుల్‌గా మార్చుతాయి.

భద్రత విషయంలో కూడా Honda Amaze మంచి స్థాయిలో ఫీచర్లను అందిస్తోంది. ABS, EBD, ESC, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి కీలక సిస్టమ్‌లు డ్రైవింగ్‌ను మరింత సేఫ్‌గా మారుస్తాయి. ముందూ, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉండటం వల్ల పార్కింగ్ సమయంలో డ్రైవర్‌కు అదనపు సహాయం లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, April 19, 2026, 14:48 [IST]
English summary
Honda sedan car amaze fy26 sales recorded 1 percent growth more details here
Read more on: #honda #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+