జపాన్ నుంచి తోపు కారు.. బ్రేక్ వేస్తే పవర్ జనరేట్.. ఫుల్ హైటెక్ ఫీచర్లతో కొత్త హైబ్రిడ్ SUV!

గత కొంతకాలంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో హోండా కార్స్ ఇండియా (Honda Cars India) పేరు అంతగా వినిపించలేదు. ఒకప్పుడు సెడాన్ సెగ్మెంట్‌లో తనదైన ఆధిపత్యాన్ని చూపించిన హోండా, SUV మార్కెట్ వేగంగా పెరుగుతున్న సమయంలో మాత్రం కొంత నిశ్శబ్దంగా కనిపించింది. ముఖ్యంగా కొత్త మోడళ్ల విషయంలో ఇతర కంపెనీలు వరుసగా ఆకర్షణీయమైన SUVలను తీసుకొస్తుండగా, హోండా మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది అనే అభిప్రాయం మార్కెట్లో ఏర్పడింది. దీంతో చాలా మంది ఆటోమొబైల్ అభిమానులు "హోండా నుంచి పెద్ద సర్‌ప్రైజ్ ఎప్పుడు వస్తుంది?" అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తాజాగా Honda ZR-V అనే కారును ఆవిష్కరించింది. దీని గురించిన వివరాలు కింది కథణంలో చూద్దాం.

డిజైన్ పరంగా Honda ZR-V ప్రీమియంగా కనిపిస్తుంది. ఫ్లోయింగ్ బాడీ లైన్స్, గ్లోసీ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, స్లిమ్ LED హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ 18-ఇంచ్ అలాయ్ వీల్స్ దీని లుక్‌ను ఆకర్షణీయంగా మారుస్తాయి. వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఫినిషర్, బాడీ కలర్ స్పాయిలర్ అంశాలు SUVకి స్పోర్టీ టచ్‌ను ఇస్తాయి.4567 mm పొడవు, 1840 mm వెడల్పు, 1621 mm ఎత్తుతో కలిగి ఉంటుంది.

Honda ZR-V Hybrid SUV Finally Revealed With Premium Features And Its Bookings Now Open

ఇంటీరియర్‌లో పూర్తి బ్లాక్ థీమ్‌తో ప్రీమియం క్యాబిన్‌ను అందించారు. హై క్వాలిటీ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, పెద్ద హారిజాంటల్ డాష్‌బోర్డ్, ప్రీమియం లెదర్ సీట్, మెటాలిక్ ఫినిషింగ్ కారణంగా లోపల కూర్చున్నప్పుడు లగ్జరీ ఫీల్ వస్తుంది. ముందు సీట్లు పవర్ అడ్జస్టబుల్‌గా ఉండగా, డ్రైవర్ సీటుకు మెమరీ ఫంక్షన్ కూడా ఉంది. డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ AC వెంట్స్, ఆర్మ్ రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టెక్నాలజీ విషయంలో కూడా ఈ SUV చాలా అడ్వాన్స్‌గా ఉంది. 9-ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 12 స్పీకర్ల Bose సౌండ్ సిస్టమ్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ విషయంలో హోండా ఎలాంటి రాజీ పడలేదు. Honda SENSING పేరుతో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను ఇందులో అందించారు.

Honda ZR-V Hybrid SUV Finally Revealed With Premium Features And Its Bookings Now Open

ఇందులో Collision Mitigation Braking System, Acc, Lane Keeping Assist, Road Departure Mitigation వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అదనంగా 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్, వాహన స్థిరత్వ నియంత్రణ వ్యవస్థ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో హోండా కంపెనీ e:HEV స్పోర్ట్స్ హైబ్రిడ్ సిస్టమ్‌ను అందించింది.

ఇందులో 2.0-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు డ్యూయల్ మోటార్ హైబ్రిడ్ టెక్నాలజీ పనిచేస్తుంది. ఈ సిస్టమ్ మొత్తం 184 PS పవర్, 315 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరుకు సుమారు 22.79 కిలోమీటర్ల వరకు మైలేజీ అందిస్తుంది. ఈ SUVలో ప్రత్యేకత ఏమిటంటే డ్రైవర్ జోక్యం లేకుండానే వాహనం ఆటోమేటిక్‌గా ఎలక్ట్రిక్, హైబ్రిడ్, ఇంజన్ డ్రైవింగ్ మోడ్‌ల మధ్య మారుతుంది.

Honda ZR-V Hybrid SUV Finally Revealed With Premium Features And Its Bookings Now Open

తక్కువ వేగంలో నిశ్శబ్దంగా ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణిస్తే, వేగంగా యాక్సిలరేట్ చేసినప్పుడు హైబ్రిడ్ మోడ్ సహాయపడుతుంది. హైవేలో అధిక వేగంతో ప్రయాణించే సమయంలో ఇంజన్ మోడ్ యాక్టివ్ అవుతుంది. అలాగే బ్రేక్ వేయగా ఉత్పత్తి అయ్యే శక్తిని తిరిగి బ్యాటరీలో నిల్వ చేసే రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి నార్మల్, స్పోర్ట్, ఈకో అనే మూడు డ్రైవింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇప్పటివరకు ఈ SUV ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే రాబోయే నెలల్లో ధర వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. Honda ZR-V ను హోండా పూర్తిగా జపాన్‌లో తయారు చేసి భారతదేశానికి దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న Honda Cars India డీలర్‌షిప్‌లలో ఈ SUV కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డెలివరీలు జూలై 2026 నుంచి ప్రారంభం కానున్నాయి.

Article Published On: Friday, May 22, 2026, 14:49 [IST]
English summary
Honda zr v hybrid suv finally revealed with premium features and its bookings now open
Read more on: #honda #new launches #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+