ఆదిత్య 369 లాగా ఫ్యూచర్‌‌లోకి మారుతి స్విఫ్ట్.. ఇదే రేపటి కారు.. హైడ్రోజన్‌తో పరుగులు!

భారతదేశ ఆటోమొబైల్ రంగం ప్రస్తుతం పెద్ద మార్పు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా దేశ రోడ్లపై ఆధిపత్యం చాటిన పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానాన్ని ఇప్పుడు క్రమంగా కొత్త తరహా పర్యావరణ అనుకూల వాహనాలు ఆక్రమిస్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్య సమస్యలు, కఠినమైన ఉద్గార నిబంధనలు వంటి కారణాలతో వినియోగదారులు కూడా ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందుకే ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ కార్లు, సీఎన్‌జీ మోడళ్లకు భారీ ఆదరణ లభిస్తోంది. ఈ మార్పుకు కేంద్ర ప్రభుత్వం కూడా బలమైన మద్దతు ఇస్తోంది. భారతదేశంలో పర్యావరణహిత ఇంధన వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా, సీఎన్‌జీ, హైబ్రిడ్, బయోఫ్యూయెల్స్, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇదే సమయంలో భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్‌పై కూడా భారీ స్థాయిలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. హైడ్రోజన్‌ను "గ్రీన్ ఫ్యూయల్"గా పరిగణిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల కాలుష్యం చాలా తక్కువగా ఉండటమే కాకుండా, పర్యావరణానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

Hydrogen Powered Suzuki Swift Unveiled At Vienna Symposium Details

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కంపెనీలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి. భారతదేశంలో కూడా ఈ దిశగా ప్రయత్నాలు వేగం అందుకుంటున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ వాహనాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రోజన్‌తో నడిచే సుజుకి స్విఫ్ట్ (Suzuki Swift) గురించి సమాచారం వెలుగులోకి రావడం ఆటోమొబైల్ రంగంలో ఆసక్తిని పెంచుతోంది.

భారతీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచిన స్విఫ్ట్, ఫ్యూచర్‌లో హైడ్రోజన్ టెక్నాలజీతో వస్తే అది పెద్ద సంచలనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైడ్రోజన్ ఇంధన టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతున్న సమయంలో, సుజుకి తీసుకొచ్చిన కొత్త ప్రయోగం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో భారత రోడ్లపై కొత్త ట్రెండ్ సృష్టించే అవకాశం ఉందని ఆటో రంగం భావిస్తోంది.

Hydrogen Powered Suzuki Swift Unveiled At Vienna Symposium Details

భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందనే చర్చలు జరుగుతున్న వేళ, స్విఫ్ట్ హైడ్రోజన్ కాన్సెప్ట్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇటీవల జరిగిన వియన్నా మోటార్ సింపోజియం 2026లో ఈ హైడ్రోజన్ స్విఫ్ట్‌ను అధికారికంగా ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్‌లో సుజుకితో పాటు మొబిలిటీ టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన AVL కలిసి పనిచేయడం విశేషం.

ఈ కొత్త టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటంటే, హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించి ఇంజిన్ నీటి ఆవిరిని విడుదల చేస్తుంది. దీంతో పర్యావరణానికి హానికరమైన ఉద్గారాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సుజుకి అభివృద్ధి చేసిన ఈ ప్రోటోటైప్‌లో 1.4-లీటర్ 4-సిలిండర్ హైడ్రోజన్ డైరెక్ట్ ఇంజెక్షన్ (DI) ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇందులో AVL రూపొందించిన కొత్త హైడ్రోజన్ DI టెక్నాలజీని వినియోగించారు.

ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైడ్రోజన్ వాహనాలు కూడా భవిష్యత్ రవాణా రంగంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్‌‌లో ఎక్కువగా ఇవే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సుజుకి స్విఫ్ట్ హైడ్రోజన్ గురించిన మరింత సమాచారం రావాల్సి ఉంది. అతి త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.

Article Published On: Thursday, May 7, 2026, 14:45 [IST]
English summary
Hydrogen powered suzuki swift unveiled at vienna symposium details
Read more on: #maruti suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+