ఇన్నోవాకు ఏమాత్రం తక్కువ కాదు.. ఈ 7-సీటర్‌లో లగ్జరీకి కొదవలేదు! కానీ గత నెలలో..

దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యూందాయ్ మోటార్ కంపెనీ (Hyundai Motor Company) భారతీయ మార్కెట్లో ఎన్నో సంవత్సరాలుగా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రీమియం కస్టమర్ల వరకు అందరినీ ఆకట్టుకునే విధంగా వాహనాలను అందిస్తూ, దేశంలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటిగా ఎదిగింది. ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో ఈ కంపెనీ చూపిస్తున్న దూకుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాంటి విజయవంతమైన మోడళ్లలో ఒకటే హ్యూందాయ్ ఆల్కాజర్ (Hyundai Alcazar). ఇంట్లో సభ్యులు ఎక్కువగా ఉంటే, కుటుంబంతో కలిసి టూర్లు వెళ్లాలనే ఆలోచన ఉంటే లేదా స్టైల్‌తో పాటు స్పేస్ కూడా కావాలనుకునే వారికి ఆల్కాజర్ ఒక అద్భుతమైన ఎంపికగా కనిపిస్తుంది.

సాధారణంగా భారతీయ కొనుగోలుదారులు 5-సీటర్ SUVలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఒకసారి ఆల్కాజర్‌ను దగ్గరగా చూసినా, డ్రైవ్ చేసినా, దాని ప్రత్యేకత అర్థమవుతుంది. ఇది కేవలం పెద్ద సైజు SUV మాత్రమే కాదు, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన పూర్తి ప్యాకేజ్ అని చెప్పాలి. పెద్ద గ్రిల్, స్టైలిష్ LED లైటింగ్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్ చూసిన వెంటనే ఇది సాధారణ SUV కాదని అర్థమవుతుంది.

Hyundai Alcazar Suv Records 850 Units Sales In April 2026

అయితే ఒకప్పుడు మంచి డిమాండ్‌ను సంపాదించుకున్న ఆల్కాజర్ ఇప్పుడు అమ్మకాల పరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. భారతీయ మార్కెట్లో 7-సీటర్ SUVల మధ్య పోటీ రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఆల్కాజార్ సేల్స్‌లో తగ్గుదల కనిపించడం ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏప్రిల్ 2026 అమ్మకాల వివరాల ప్రకారం, హ్యూందాయ్ కంపెనీ గత నెలలో ఆల్కాజార్ SUVని కేవలం 850 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.

గత ఏడాది ఇదే కాలంలో, అంటే ఏప్రిల్ 2025లో ఈ SUV మొత్తం 1,017 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే, ఏడాది వ్యవధిలో ఆల్కాజార్ అమ్మకాలు 16.42 శాతం మేర తగ్గిపోయాయి. ఒకప్పుడు ప్రీమియం ఫ్యామిలీ SUVగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ వాహనం, ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న పోటీ ప్రభావాన్ని ఎదుర్కొంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Hyundai Alcazar Suv Records 850 Units Sales In April 2026

హ్యూందాయ్ ఆల్కాజర్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ SUV ధరలు రూ.14.47 లక్షల నుంచి రూ.21.10 లక్షల(ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. ఇది 6-సీటర్, 7-సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండటం. లగ్జరీ అనుభవం కోరుకునేవారు కెప్టెన్ సీట్లతో వచ్చే 6-సీటర్ వెర్షన్‌ను ఎంచుకోవచ్చు.

పనితీరు విషయంలో ఇందులో 1.5-లీటర్ టర్బో GDi పెట్రోల్, 1.5-లీటర్ U2 CRDi డీజిల్ అనే రెండు ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. టర్బో పెట్రోల్ ఇంజన్ 158 bhp శక్తితో పాటు 253 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో నగర రోడ్లపై అయినా, హైవేలపై అయినా డ్రైవింగ్ ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. మరోవైపు డీజిల్ ఇంజన్ 114 bhp పవర్, 250 Nm టార్క్‌ను అందిస్తుంది.

Hyundai Alcazar Suv Records 850 Units Sales In April 2026

మైలేజీ పరంగా కూడా ఆల్కాజర్ నిరాశపరచదు. టర్బో పెట్రోల్ వేరియంట్ సుమారు 17.5 kmpl నుంచి 18 kmpl వరకు మైలేజీ ఇస్తుండగా, డీజిల్ ఆటోమేటిక్ 18.1 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇక డీజిల్ మాన్యువల్ వేరియంట్ అయితే 20.4 kmpl వరకు మైలేజీ ఇస్తూ, దీర్ఘ ప్రయాణాలు చేసే కుటుంబాలకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది.

Article Published On: Tuesday, May 26, 2026, 10:30 [IST]
English summary
Hyundai alcazar suv records 850 units sales in april 2026
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+