డిజైర్ తర్వాత ఈ కారే ఎక్కువగా కొంటున్నారు.. రూ.6 లక్షలు, 6 ఎయిర్‌బ్యాగులు, 28 కి.మీ మైలేజ్
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ, సబ్-కాంపాక్ట్ సెడాన్ కార్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో స్టైలిష్ డిజైన్, మంచి మైలేజ్, విశాలమైన క్యాబిన్, కుటుంబ అవసరాలకు సరిపోయే సౌకర్యాలను కోరుకునే వినియోగదారులు ఈ విభాగాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ సెగ్మెంట్‌లో ఎన్నో మోడళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, నమ్మకమైన పనితీరుతో ఈ సెడాన్ మార్కెట్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. 2020లో ఆరాను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
కాలానుగుణంగా కంపెనీ చేసిన చిన్నచిన్న అప్‌డేట్లు, ఫీచర్ల మెరుగుదల, ఇంజిన్ పనితీరు, అలాగే హ్యుందాయ్ విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ ఈ కారుపై కొనుగోలుదారుల విశ్వాసాన్ని మరింత పెంచాయి. ఫలితంగా ప్రతి ఏడాది ఆరా అమ్మకాలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు కూడా ఇదే విషయాన్ని మరోసారి నిరూపించాయి. ఆ నెలలో హ్యుందాయ్ ఆరా మొత్తం 5,977 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 5,413 యూనిట్లు విక్రయించగా, ఈసారి అమ్మకాలు 10.4 శాతం వార్షిక వృద్ధి సాధించాయి. పోటీ తీవ్రంగా ఉన్న సెడాన్ విభాగంలో ఒకే ఏడాదిలో రెండంకెల వృద్ధిని నమోదు చేయడం ఆరాకు మార్కెట్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో సెడాన్ విభాగంలో డిజైర్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దాని తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా హ్యూందాయ్ ఆరా నిలుస్తోంది.
హ్యుందాయ్ ఆరా ప్రస్తుతం భారతీయ మార్కెట్లో రూ.6 లక్షల నుంచి రూ.8.60 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర రేంజ్‌లో అందుబాటులో ఉండటంతో, తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్, ఫీచర్-లోడెడ్ ఫ్యామిలీ సెడాన్ కోసం చూస్తున్న కొనుగోలుదారులకు ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. ముఖ్యంగా పెట్రోల్‌తో పాటు CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉండటం వల్ల, పెట్రోల్ ఖర్చులను తగ్గించాలని భావించే వినియోగదారులు కూడా ఈ కారును ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

పనితీరు విషయానికి వస్తే, ఆరాలో 1.2-లీటర్ కప్పా సిరీస్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజన్ 82 bhp పవర్, 114 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తూ, నగర రోడ్లపై స్మూత్ డ్రైవింగ్ అనుభవంతో పాటు హైవేపై కూడా మంచి పనితీరును అందిస్తుంది. దీనిలో కంపెనీ ఫ్యాక్టరీ-ఫిటెడ్ CNG వేరియంట్‌ను కూడా అందిస్తోంది.
CNG మోడ్‌లో ఇంజన్ పనితీరు సహజంగానే కొంత తగ్గి 68 bhp పవర్, 95 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయినప్పటికీ, మైలేజ్ విషయంలో మాత్రం ఇది గణనీయమైన ప్రయోజనం అందిస్తుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, CNG వేరియంట్ కిలోకు సుమారు 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు. దీంతో ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి పెట్రోల్ ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.

దీని డిజైన్ సింపుల్‌గా ఉన్నప్పటికి ఫీచర్లు మాత్రం డజన్ల కొద్ది ఈ కారులో ఉన్నాయి. ఫీచర్ల పరంగా టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, AC వెంట్స్, పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఫుల్ LED లైటింగ్ ప్యాకేజ్ వంటి ఆధునిక సౌకర్యాలను కంపెనీ అందించింది. అలాగే ప్రయాణికుల భద్రతకు 6 ఎయిర్‌బ్యాగులు, ఇంకా అధునాతన సేఫ్టీ అంశాలు ఈ కారులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications