ఒక్క నెలలో ఇన్ని కార్లను కంపెనీ ఎప్పుడూ అమ్మలేదు! చరిత్రలో సరికొత్త రికార్డ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన, బలమైన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. దేశీయ మార్కెట్‌లోనే కాదు, అంతర్జాతీయ ఎగుమతుల పరంగానూ హ్యుందాయ్ కార్లకు మంచి గుర్తింపు ఉంది. నాణ్యత, ఫీచర్లు, భద్రత, డిజైన్ అన్ని ప్యాకేజీగా ఉండటమే ఈ కంపెనీ విజయానికి ప్రధాన కారణం. ఇటీవల హ్యుందాయ్ విడుదల చేసిన జనవరి నెల అమ్మకాల గణాంకాలు కంపెనీ శక్తిని మరోసారి చాటిచెప్పాయి. ఇప్పటివరకు కంపెనీ చరిత్రలో ఒకే నెలలో సాధించిన అత్యధిక అమ్మకాలుగా జనవరి 2026 నిలిచింది. ఈ నెలలో హ్యుందాయ్ మొత్తం 73,123 వాహనాలను విక్రయించి ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. ఇందులో 59,107 వాహనాలు భారతదేశంలోనే అమ్ముడుపోగా, 14,030 వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది.

ప్రత్యేకంగా దేశీయ మార్కెట్‌లో హ్యుందాయ్ సాధించిన వృద్ధి మరింత ఆకట్టుకునేలా ఉంది. గత ఏడాదితో పోలిస్తే దేశీయ అమ్మకాలలో దాదాపు 9.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది భారత వినియోగదారులలో హ్యుందాయ్ బ్రాండ్‌పై ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. క్రెటా, వెన్యూ, ఎక్స్‌టర్, ఐ20, ఆరా వంటి మోడల్స్‌ డిమాండ్ కంపెనీ అమ్మకాల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. అదేవిధంగా ఎగుమతి మార్కెట్‌లో కూడా హ్యుందాయ్ స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తోంది.

Hyundai Creates Sales Record In January 2026 With 59107 Units Sold

మేడ్ ఇన్ ఇండియా కార్లను అనేక దేశాలకు సరఫరా చేస్తూ, భారత ఆటో పరిశ్రమకు హ్యుందాయ్ కీలక సహకారం అందిస్తోంది. నాణ్యత ప్రమాణాలు, అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తులు రూపొందించడం వల్లే ఈ స్థాయి ఎగుమతులు సాధ్యమయ్యాయి. మొత్తంగా చూస్తే, జనవరి నెల హ్యుందాయ్‌కు చరిత్రాత్మకంగా మారింది. రికార్డు స్థాయి అమ్మకాలు, బలమైన దేశీయ డిమాండ్, స్థిరమైన ఎగుమతులతో కంపెనీ కొత్త ఏడాదిని చాలా పాజిటివ్ నోట్‌తో ప్రారంభించింది.

జనవరి 2026లో హ్యుందాయ్ అమ్మకాల విజయంలో ఎగుమతులు కీలక పాత్ర పోషించాయి. ఈ నెలలో కంపెనీ 14,030 యూనిట్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 20.9 శాతం గణనీయమైన వృద్ధిని సూచిస్తోంది. భారతదేశంలో తయారవుతున్న హ్యుందాయ్ వాహనాలకు అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌కి ఇది స్పష్టమైన నిదర్శనం. దేశీయ మార్కెట్‌లో వచ్చిన పెరుగుదలతో పాటు ఎగుమతులతో మొత్తం అమ్మకాలు 11.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

Hyundai Creates Sales Record In January 2026 With 59107 Units Sold

ఇప్పుడు అమ్మకాలు కంపెనీ చరిత్రలోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇది ఒకే మార్కెట్‌పై ఆధారపడకుండా, అన్ని రంగాల్లో సమతుల్యంగా ఎదుగుతున్న కంపెనీగా హ్యుందాయ్‌ను నిలబెట్టింది. మోడల్ వారీగా చూస్తే, హ్యుందాయ్ వెన్యూ జనవరి నెలలో అత్యుత్తమ ప్రదర్శనకారిగా నిలిచింది. మొత్తం 12,413 యూనిట్ల అమ్మకాలతో ఈ కాంపాక్ట్ SUV తనకు ఇదే అత్యధిక నెలవారీ అమ్మకాలుగా రికార్డు సృష్టించింది.

స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, విశ్వసనీయత కారణంగా వెన్యూ భారత వినియోగదారుల మొదటి ఎంపికగా మారింది. అదే విధంగా, హ్యుందాయ్ ఆరా కూడా అద్భుతమైన ప్రదర్శన చేసింది. జనవరి 2026లో ఈ సెడాన్ 7,978 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, తన చరిత్రలోనే అత్యధిక నెలవారీ విక్రయాలను సాధించింది. తక్కువ ధరలో మంచి స్పేస్, ఫీచర్లు అందించడం వల్ల ఆరా కూడా విస్తృత వర్గాల వినియోగదారులను ఆకర్షిస్తోంది.

Hyundai Creates Sales Record In January 2026 With 59107 Units Sold

మొత్తంగా చూస్తే, ఎగుమతుల బలంతో పాటు దేశీయంగా మోడళ్లకు వచ్చిన అద్భుత స్పందన హ్యుందాయ్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లింది. ఈ ట్రెండ్ కొనసాగితే, రాబోయే నెలల్లో కూడా హ్యుందాయ్ నుంచి మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Article Published On: Monday, February 2, 2026, 10:44 [IST]
English summary
Hyundai creates sales record in january 2026 with 59107 units sold
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+