మనోళ్లు కావాలంటున్నారు.. విదేశీయులు అవసరం లేదంటున్నారు.. నం.1 కారు అమ్మకాల్లో ఎందుకీ తేడా ?
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక కారు పరిస్థితి ప్రస్తుతం విచిత్రంగా ఉంది. దేశీయంగా ఎస్‌యూవీ (SUV) విభాగంలో రారాజుగా వెలుగొందుతుంది హ్యుందాయ్ క్రెటా. మన దేశంలో ఈ కారును కొనడానికి జనం ఎగబడుతుంటే, విదేశీయులు మాత్రం దీని వైపు చూడటానికే ఆసక్తి చూపడం లేదు. గత నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఆసక్తికరమైన, కాస్త షాకింగ్ అనిపించే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హ్యుందాయ్ క్రెటా భారతీయ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. గడిచిన మార్చి నెలలో భారతదేశంలో ఏకంగా 17,838 యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడయ్యాయి. టాప్-10 కార్ల జాబితాలో ఇది ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. కానీ, ఇదే కారును విదేశాలకు ఎగుమతి చేసే విషయంలో మాత్రం గణంకాలు నిరాశపరిచాయి. మార్చి నెలలో కేవలం 904 యూనిట్లు మాత్రమే ఎగుమతి అయ్యాయి. అంటే మన దేశంలో అమ్ముడైన దాంట్లో ఇది కేవలం 5 శాతం కూడా లేదు. ఎగుమతి అయ్యే టాప్-30 కార్ల జాబితాలో క్రెటా 21వ స్థానానికి పడిపోయింది.

హ్యుందాయ్ క్రెటా మార్కెట్లో తనదైన ముద్ర వేయడానికి ప్రధాన కారణం దాని ధర, ఫీచర్లు. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.10.72 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ వరకు వివిధ ధరల్లో అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా హ్యుందాయ్ఈ కారును మొత్తం 7 వేరియంట్లలో లాంచ్ చేసింది. అవి: E, EX, S, S(O), SX, SX Tech, SX (O). ముఖ్యంగా బేస్ వేరియంట్ E కూడా చూడటానికి ప్రీమియం లుక్‌తో ఉండటం వల్ల మధ్యతరగతి ప్రజలు ఈ కారు వైపు మొగ్గు చూపుతున్నారు.
క్రెటా కొత్త మోడల్‌లో లెవల్-2 ADAS (Advanced Driver Assistance Systems) టెక్నాలజీని జోడించారు. ఇందులో మొత్తం 70కి పైగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు దీని సొంతం. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు హ్యుందాయ్ డిజైన్‌లో పెద్దగా తేడాలు కనిపించకుండా జాగ్రత్త పడింది. దీనివల్ల కారు లుక్ అన్ని వేరియంట్లలోనూ అద్భుతంగా ఉంటుంది. ఇన్వర్టెడ్ L-షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (LED DRLs) కారుకు కొత్త ఆకర్షణను తెచ్చాయి.

కారు లోపలి భాగం (ఇంటీరియర్) చాలా విలాసవంతంగా ఉంటుంది. బేస్ మోడల్ E వేరియంట్‌లో కూడా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. అయితే ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉండవు. మాన్యువల్ ఏసీ, ఫ్రంట్ అండ్ రియర్ యూఎస్‌బీ పోర్ట్స్, రియర్ ఏసీ వెంట్స్ వంటి కనీస సౌకర్యాలన్నీ ఉన్నాయి. అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్ ఇవ్వడం ద్వారా సేఫ్టీకి పెద్ద పీట వేశారు. టాప్ వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్ వంటి లగ్జరీ ఫీచర్లు భక్తులను కట్టిపడేస్తున్నాయి.
హ్యుందాయ్ క్రెటా ప్రధానంగా రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. దీనికి తోడు పర్ఫామెన్స్ ప్రియుల కోసం 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది. మాన్యువల్, ఐవీటీ (IVT), డిసిటి (DCT) వంటి వివిధ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండటం వల్ల కస్టమర్లకు తమకు నచ్చిన ఛాయిస్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉంది. ముఖ్యంగా డీజిల్ ఇంజన్ ఇచ్చే మైలేజ్, పవర్ క్రెటాను ఈ విభాగంలో రారాజుగా నిలబెట్టాయి.

భారతదేశంలో క్రెటాకు ఉన్న క్రేజ్ విదేశాల్లో ఎందుకు లేదన్న దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రెటా స్థానంలో హ్యుందాయ్ టక్సాన్ (Tucson) లేదా ఇతర అంతర్జాతీయ మోడళ్లను ఎక్కువగా ప్రమోట్ చేస్తోంది. అలాగే విదేశాల్లో భద్రతా ప్రమాణాలు (Crash Test Ratings), ఎమిషన్ నార్మ్స్ విషయంలో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో క్రెటాకు ఉన్న ప్రధాన పోటీదారులు కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్. దేశీయంగా ఈ పోటీని తట్టుకుని నిలబడుతున్నా, అంతర్జాతీయంగా మాత్రం ఇతర గ్లోబల్ బ్రాండ్ల నుంచి క్రెటా గట్టి సవాలును ఎదుర్కొంటోంది.
ఏదేమైనా, హ్యుందాయ్ క్రెటా భారతీయ వాహనదారుల పాలిట ఒక సెంటిమెంట్‌గా మారిపోయింది. లుక్, ఫీచర్లు, రీసేల్ వాల్యూ పరంగా క్రెటాకు తిరుగులేదు. ఎగుమతులు తక్కువగా ఉన్నప్పటికీ, దేశీయంగా నెలకు 17 వేల యూనిట్లకు పైగా అమ్ముడవుతుండటం హ్యుందాయ్ బలాన్ని చాటుతోంది. భవిష్యత్తులో హ్యుందాయ్ క్రెటా ఈవీ (EV) వెర్షన్‌ను కూడా తీసుకువచ్చే ప్లాన్‌లో ఉంది, ఇది జరిగితే ఎగుమతుల గణాంకాలు కూడా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








