రోజుకు 300 కార్లు.. 6 నెలల్లో ఏకంగా 91 వేల మంది కొనేశారు.. దేశంలో ఎక్కువ మంది కొనే కారు ఇదే

భారత కార్ లవర్స్ పై హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) మ్యాజిక్ మరోసారి పనిచేసింది. మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడల్స్ వస్తున్నా.. క్రెటా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ ఏడాది 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి నుంచి జూన్ వరకు) దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన మిడ్ సైజ్ SUVగా హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు సృష్టించింది.

గడిచిన ఆరు నెలల కాలంలో ఏకంగా 91,391 మంది కస్టమర్లు క్రెటా కారును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. దీనిని బట్టి చూస్తే దేశంలో ప్రతి నెలా సగటున (యావరేజ్‌గా) 15,232 యూనిట్ల క్రెటా కార్లు అమ్ముడవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ అమ్మకాల జోరుతో ప్రత్యర్థి కంపెనీలకు హ్యుందాయ్ గట్టి పోటీని ఇస్తోంది.

Hyundai Creta Rules SUV Market 91 391 Units Sold in 6 Months Becomes No 1 Mid-Size SUV

రెండో ప్లేస్‌లో మారుతి విక్టోరిస్.. మూడో స్థానంలో కియా సెల్టోస్
అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్ సైజ్ SUVల జాబితాలో మారుతి సుజుకి విక్టోరిస్(Maruti Suzuki Victoris) రెండో స్థానంలో నిలిచింది. ఈ ఆరు నెలల కాలంలో విక్టోరిస్ కారుకు సంబంధించి మొత్తం 73,912 యూనిట్లు అమ్ముడయ్యాయి.

అంటే ప్రతి నెలా సగటున 12,319 మంది కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేశారు. ఇక ఈ రేసులో ఎప్పుడూ క్రెటాకు గట్టి పోటీ ఇచ్చే కియా సెల్టోస్ (Kia Seltos) ఈసారి మూడో స్థానానికి పరిమితమైంది. కియా సెల్టోస్ గత ఆరు నెలల్లో మొత్తం 62,805 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఈ కారును ప్రతి నెలా సగటున 10,468 మంది కొనుగోలు చేశారు.

నాలుగు, ఐదు స్థానాల్లో హైరైడర్, గ్రాండ్ విటారా!
ఈ అమ్మకాల లిస్టులో టయోటా హైరైడర్(Toyota Hyryder) నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఆరు నెలల్లో టయోటా కంపెనీ మొత్తం 55,604 హైరైడర్ కార్లను విక్రయించింది. అంటే నెలకు సగటున 9,367 కార్లు అమ్ముడయ్యాయి.

Hyundai Creta Rules SUV Market 91 391 Units Sold in 6 Months Becomes No 1 Mid-Size SUV

ఇకపోతే ఐదో స్థానంలో మారుతి సుజుకికి చెందిన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారా(Maruti Suzuki Grand Vitara) నిలిచింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 45,811 మంది కస్టమర్లు గ్రాండ్ విటారా కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు నెలవారీ సగటు అమ్మకాలు 7,635 యూనిట్లుగా నమోదయ్యాయి.

చివరి స్థానాల్లో సియెర్రా, ఎలివేట్.. డస్టర్ అట్టడుగున!
లిస్టులో మిగిలిన స్థానాలను పరిశీలిస్తే.. టాటా సియెర్రా(tata Sierra) కారు 43,420 యూనిట్ల అమ్మకాలతో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండాకు చెందిన ఎలివేట్(Honda Elevate) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.

కేవలం 10,122 యూనిట్ల అమ్మకాలతో హోండా ఎలివేట్ ఏడో స్థానానికి పరిమితమైంది. ఇక ఈ జాబితాలో చివరి స్థానంలో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ కు చెందిన డస్టర్(Duster) నిలిచింది. గత ఆరు నెలల్లో రెనాల్ట్ డస్టర్ కేవలం 6,039 యూనిట్లు మాత్రమే అమ్ముడై ఎనిమిదో స్థానంలో నిలిచింది.

అసలు క్రెటా ఎందుకంత సూపర్ హిట్?
హ్యుందాయ్ క్రెటా కారు ఇంత పెద్ద ఎత్తున అమ్ముడవడానికి అందులోని లగ్జరీ ఫీచర్లు, నమ్మకమైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లే ప్రధాన కారణం. ఈ కారు కేబిన్‌లో సరికొత్త 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-ఇంచుల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్స్‌తో పనిచేసే పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

వీటితో పాటు ప్రయాణికుల భద్రత కోసం 70 కి పైగా సేఫ్టీ ఫీచర్లను హ్యుందాయ్(Hyundai) ఇందులో అందించింది. ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే.. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 10.91 లక్షల నుంచి ప్రారంభమై టాప్ మోడల్ ధర రూ. 20.11 లక్షల వరకు ఉంది.

Article Published On: Tuesday, July 14, 2026, 10:07 [IST]
English summary
Hyundai creta rules suv market 91 391 units sold in 6 months becomes no 1 mid size suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+