క్రెటా క్రేజ్ తగ్గిందా? అమ్మకాల్లో తొమ్మిదవ స్థానానికి పడిపోయిన హ్యుందాయ్ స్టార్ కార్
భారతీయ మధ్యతరహా ఎస్‌యూవీ(SUV) మార్కెట్లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త మోడళ్లు వరుసగా మార్కెట్లోకి వస్తుండటంతో హ్యుందాయ్ క్రెటా(Hyundai Creata) పై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ అమ్మకాలు తగ్గినా.. మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మాత్రం క్రెటా(creta) వదులుకోలేదు. యువత నుంచి కుటుంబాల వరకు ఇప్పటికీ ఇదే ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.
పోటీ పెరిగినా క్రెటా క్రేజ్ తగ్గలేదే
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా (Hyundai Creata) పేరు చెప్పగానే ప్రీమియం ఫీలింగ్, స్టైలిష్ లుక్, ఫ్యామిలీ కంఫర్ట్ గుర్తుకు వస్తాయి. అయితే ఇప్పుడు అదే క్రెటాకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కియా సెల్టోస్(kia seltos), టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా(maruti grand vitara), స్కోడా కుషాక్ వంటి మోడళ్లు మార్కెట్లో గట్టి పోటీ ఇస్తుండటంతో అమ్మకాలపై ప్రభావం పడింది.

2026 ఏప్రిల్ నెలలో క్రెటా మొత్తం 15,291 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం తగ్గుదలగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
టాప్-5 నుంచి నేరుగా దిగజారినా.. ఇంకా కింగే
కొన్ని నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో టాప్-5లో నిలుస్తున్న క్రెటా(creta).. గత నెల మాత్రం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ మధ్యతరహా ఎస్‌యూవీ విభాగంలో మాత్రం ఇప్పటికీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్ వాటాలో 13 శాతానికి పైగా వాటా సాధించడం క్రెటా బ్రాండ్ బలం ఏంటో చూపిస్తోంది.

యువతకు టర్బో.. ఫ్యామిలీలకు డీజిల్
క్రెటా(creta) విజయానికి ప్రధాన కారణం ఇందులో లభించే విభిన్న ఇంజిన్ ఎంపికలే. 1.5 లీటర్ పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో ఈ కారు అందుబాటులో ఉంది. వేగం ఇష్టపడే యువత టర్బో వేరియంట్ వైపు మొగ్గుచూపుతుండగా.. ఎక్కువ మైలేజ్ కోరుకునే కుటుంబాలు డీజిల్ మోడల్‌ను ఎంచుకుంటున్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్, డీసీటీ వంటి గేర్‌బాక్స్ ఎంపికలు డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేస్తున్నాయి.
భద్రతలో కూడా అదిరిపోయే ఫీచర్లు
ఈ కారులో లెవల్-2 అడాస్(ADAS) భద్రతా సాంకేతికత ఉంది. ముందున్న వాహనానికి ప్రమాదం ఉంటే హెచ్చరిక ఇవ్వడం, లేన్ మార్చితే అలర్ట్ చేయడం, ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్ వంటి భద్రతా ఫీచర్లు కుటుంబ ప్రయాణాలకు మరింత భరోసా ఇస్తున్నాయి.

లోపల కూర్చుంటే లగ్జరీ కారు ఫీలింగ్!
పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లు క్రెటాను యువతలో మరింత పాపులర్ చేశాయి. లాంగ్ జర్నీలో కూడా అలసట లేకుండా కంఫర్ట్ అందించడం దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు.
కొత్త హైబ్రిడ్ టెక్నాలజీతో మళ్లీ మార్కెట్ షేక్?
పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు హ్యుందాయ్(Hyundai) ఇప్పుడు క్రెటాలో స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీ తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇది మార్కెట్లోకి వస్తే మైలేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆటో నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications