రూ.5.81 లక్షలకే SUV.. 27 కిమీ మైలేజ్.. 30 రోజుల్లో 8,154 మంది కొనుగోలు చేశారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మైక్రో SUV సెగ్మెంట్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. తక్కువ ధరలో SUV తరహా డిజైన్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్, అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉండటంతో ఈ విభాగం కొనుగోలుదారులను బాగా ఆకర్షిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) తీసుకొచ్చిన ఎక్స్‌టర్ మరోసారి తన సత్తా చాటింది. తాజాగా విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాలు ఈ మోడల్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రస్తుతం మైక్రో SUV విభాగంలో టాటా పంచ్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, హ్యుందాయ్ ఎక్స్‌టర్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.

మంచి డిజైన్, ఫీచర్లు, మైలేజ్, పోటీ ధరలు వంటి అంశాలు ఈ SUVకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ తీసుకొస్తున్నాయి. అందుకే గత నెలలో 8,154 మంది కొత్త కస్టమర్లు ఎక్స్‌టర్‌ను సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ SUV విక్రయాలు గణనీయంగా పెరగడం మరింత విశేషం. జూన్ 2025లో 5,873 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, జూన్ 2026లో 38.84 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.

Hyundai Exter June 2026 Sales Grow 38 Percent In India Details

ప్రస్తుతం మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, ఎక్స్‌టర్‌పై కస్టమర్లు విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విజయానికి ప్రధాన కారణం హ్యుందాయ్ ఎక్స్‌టర్ అందించే విలువ. సిటీ రోడ్లతో పాటు పొడవైన ప్రయాణాలకు కూడా అనువైన డ్రైవింగ్ అనుభవం, ఆధునిక సేఫ్టీ ఫీచర్లు, ప్రీమియం ఇంటీరియర్, తక్కువ నిర్వహణ ఖర్చు వంటి అంశాలు కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే మైక్రో SUV సెగ్మెంట్‌లో ఎక్స్‌టర్ తన జోరును కొనసాగిస్తుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ప్రస్తుతం వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా EX, EX (O), S, S (O), SX, SX (O), SX (O) Connect, Knight Edition వంటి పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ దీని ధరలను నిర్ణయించింది. భారత మార్కెట్లో ఈ మైక్రో SUV ఎక్స్-షోరూమ్ ధర రూ.5.81 లక్షల నుంచి రూ.9.61 లక్షల వరకు ఉంది.

Hyundai Exter June 2026 Sales Grow 38 Percent In India Details

పనితీరు విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ కప్పా ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. ఈ ఇంజన్ నగర ప్రయాణాలతో పాటు హైవేపై కూడా సాఫీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాదు, తక్కువ ఇంధన ఖర్చు కోరుకునే వారి కోసం CNG బై-ఫ్యూయల్ వేరియంట్‌ను కూడా హ్యుందాయ్ అందిస్తోంది. మైలేజ్ పరంగా కంపెనీ CNG వెర్షన్‌కు గరిష్టంగా 27.1 కిమీ/కేజీ, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌కు 19.4 కిమీ/లీటర్ ఇస్తుంది.

అదే సమయంలో AMT వేరియంట్‌కు 19.2 కిమీ/లీటర్ వరకు ఇస్తుంది. మంచి మైలేజ్, అందుబాటు ధర, అధునాతన ఫీచర్ల కలయికతో ఎక్స్‌టర్ మైక్రో SUV సెగ్మెంట్‌లో బలమైన ఎంపికగా కొనసాగుతోంది. ఫీచర్ల పరంగా కూడా హ్యుందాయ్ ఎక్స్‌టర్ తన సెగ్మెంట్‌లో మంచి విలువను అందించే SUVగా నిలుస్తోంది. ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, స్మార్ట్‌గా మార్చే ఎన్నో ఆధునిక టెక్నాలజీలను కంపెనీ ఇందులో అందించింది.

Hyundai Exter June 2026 Sales Grow 38 Percent In India Details

ముఖ్యంగా, ముందుభాగం, వెనుకభాగంలో జరిగే ప్రయాణాన్ని రికార్డ్ చేసే ఇన్‌బిల్ట్ డ్యాష్‌క్యామ్ ఈ SUVలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో స్మార్ట్‌ఫోన్‌ను ఎలాంటి కేబుల్ అవసరం లేకుండా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ చేసుకునే ఆప్షన్ లభిస్తుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెనుక సీట్లకు టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉన్నాయి.

దీనిలో ఎత్తు సర్దుబాటు చేసుకునే డ్రైవర్ సీటు, అలాగే అడ్జస్టబుల్ రియర్ హెడ్‌రెస్ట్స్ వంటి ఫీచర్లను కూడా అందించారు. దీంతో రోజువారీ ప్రయాణాలతో పాటు లాంగ్ డ్రైవ్‌లలో కూడా మరింత సౌకర్యవంతమైన అనుభవం లభిస్తుంది. భద్రత విషయంలో కూడా హ్యుందాయ్ ఎలాంటి రాజీ పడలేదు. ఈ మైక్రో SUVలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్ అసిస్ట్ కంట్రోల్, EBDతో కూడిన ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలగునవి ఉన్నాయి.

Article Published On: Thursday, July 16, 2026, 16:27 [IST]
English summary
Hyundai exter june 2026 sales grow 38 percent in india details
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+