షోరూమ్‌కు వెళ్లిన వారు ఇదే కారును కావాలంటున్నారు.. కేవలం 30 రోజుల్లోనే 8,096 మంది ఎంచుకున్నారు

భారత మార్కెట్లో మైక్రో ఎస్‌యూవీలకు వచ్చిన క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు చిన్న కుటుంబాల కోసం హ్యాచ్‌బ్యాక్ కార్లే ప్రధాన ఎంపికగా ఉండేవి. కానీ ఇప్పుడు అదే వినియోగదారులు కొంచెం ఎత్తుగా కనిపించే, రోడ్డుపై బలమైన ప్రెజెన్స్ ఇచ్చే, కుటుంబంతో పాటు లాంగ్ డ్రైవ్‌లకు కూడా సరిపోయే మైక్రో ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విభాగంలో ఇప్పటికే టాటా పంచ్ భారీ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా, దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యూందాయ్ మోటార్ కంపెనీ (Hyundai Motor Company) తన ఎక్స్‌టర్‌ (Exter)తో మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షించే ప్రయత్నం చేసింది. చూడటానికి చాలా అగ్రెసివ్‌గా లేకపోయినా, ఎక్స్‌టర్‌లో ఉన్న ప్రాక్టికాలిటీ మాత్రం సామాన్య కుటుంబాలకు బాగా నచ్చింది.

నగరంలో రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, వీకెండ్ ఫ్యామిలీ ట్రిప్స్, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వారికి ఈ ఎస్‌యూవీ మంచి ఆప్షన్‌గా మారింది. ముఖ్యంగా టాటా పంచ్‌లో లేని కొన్ని ఆధునిక ఫీచర్లను హ్యుందాయ్ ఇందులో అందించడం వల్ల యువత కూడా దీనిపై ఆసక్తి చూపించారు. సన్‌రూఫ్‌, డిజిటల్ ఫీచర్లు, మంచి క్యాబిన్ ఫీలింగ్‌, స్మార్ట్ డిజైన్ టచ్‌లు వంటి అంశాలు ఎక్స్‌టర్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

Hyundai Exter Posts Impressive April 2026 Sales Performance Details

అయితే గత కొన్ని నెలలుగా ఎక్స్‌టర్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో సాగలేదు. మార్కెట్లో పోటీ పెరగడం, కొత్త మోడళ్ల రాక, వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు వంటి కారణాలతో ఈ ఎస్‌యూవీ కొంత వెనుకబడింది. దీంతో హ్యుందాయ్ కంపెనీ నిశ్శబ్దంగా చిన్న మార్పులతో ఎక్స్‌టర్‌కు ఫేస్‌లిఫ్ట్ ఇచ్చింది. బయటికి చూస్తే పెద్ద మార్పులు కనిపించకపోయినా, వినియోగదారులు కోరుకున్న చిన్నచిన్న అప్‌డేట్లు ఇందులో చేర్చింది. ఇదే ఇప్పుడు అమ్మకాల రూపంలో ఫలితాన్ని చూపిస్తోంది.

కొనాలా వద్దా అని ఆలోచిస్తున్న చాలా మంది వినియోగదారులు ఇప్పుడు మళ్లీ హ్యుందాయ్ షోరూమ్‌ల వైపు చూస్తున్నారు. ఫేస్‌లిఫ్ట్ తర్వాత ఎక్స్‌టర్‌కు మార్కెట్లో మళ్లీ కదలిక కనిపించింది. ఏప్రిల్ 2026 నెలలో ఈ మైక్రో ఎస్‌యూవీకి భారీ స్పందన లభించింది. కేవలం 30 రోజుల్లోనే 8,096 మంది వినియోగదారులు ఎక్స్‌టర్‌ను ఇంటికి తీసుకెళ్లారు. టాటా పంచ్ అమ్మకాలతో పోలిస్తే ఇది తక్కువగానే కనిపించినా, అసలు ఆశ్చర్యపరిచిన విషయం వేరే ఉంది.

Hyundai Exter Posts Impressive April 2026 Sales Performance Details

గత ఏడాదితో పోలిస్తే ఎక్స్‌టర్ తన అమ్మకాలను 49 శాతం పెంచుకోవడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. మార్కెట్లో పూర్తిగా మసకబారిపోతుందని అనుకున్న మోడల్ ఒక్కసారిగా ఇలా పుంజుకోవడం చాలా అరుదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు బడ్జెట్‌లో స్టైలిష్ ఎస్‌యూవీ కోసం వెతుకుతున్న సమయంలో ఎక్స్‌టర్ వారి దృష్టిని ఆకర్షిస్తోంది. ధరకు తగ్గ ఫీచర్లు, అనువైన సైజు, ఇవన్నీ కలిసి ఈ ఎస్‌యూవీని మరోసారి మార్కెట్లో నిలబెట్టాయి.

ప్రస్తుతం హ్యూందాయ్ కంపెనీ ఎక్స్‌టర్‌ను EX, EX (O), S, S (O), SX, SX (O), SX (O) కనెక్ట్‌, అలాగే ప్రత్యేక నెట్ ఎడిషన్ వంటి విభిన్న ట్రిమ్‌లతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.79 లక్షల నుంచి రూ. 9.61 లక్షల వరకు ఉంది. హ్యుందాయ్ మే నెలలో ఎక్స్‌టర్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది.

Hyundai Exter Posts Impressive April 2026 Sales Performance Details

ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 40,000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. కొన్ని వేరియంట్లపై 100 శాతం వరకు ఆన్-రోడ్ ఫండింగ్‌, 50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు, అలాగే 100 శాతం ఫోర్‌క్లోజర్ ఛార్జీల మాఫీ వంటి ప్రయోజనాలు ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో 1.2-లీటర్ కప్పా ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కంపెనీ అందిస్తోంది.

ఈ ఇంజిన్ గరిష్టంగా 83 bhp పవర్‌తో పాటు 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. CNG బై-ఫ్యూయల్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఎక్స్‌టర్ CNG వేరియంట్ కిలోకు 27.1 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదు. మరోవైపు, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 19.4 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వగలదని, AMT వేరియంట్ 19.2 kmpl వరకు ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని హ్యుందాయ్ చెబుతోంది.

Article Published On: Monday, May 11, 2026, 10:17 [IST]
English summary
Hyundai exter posts impressive april 2026 sales performance details
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+