బైక్ కొనే బదులు ఈ కారు కొనచ్చు.. మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉంది! 27 కి.మీ మైలేజీ

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో SUVలకు కస్టమర్ల నుంచి భారీ స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సరసమైన ధరలో లభించే మైక్రో SUVలు వినియోగదారులలో ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు సరిపడే సైజ్, SUV లుక్, మంచి మైలేజ్ వంటి అంశాలు ఈ సెగ్మెంట్ కార్లకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇదే కారణంతో హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి మోడళ్లను కంపెనీలు భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 2025కి సంబంధించిన హ్యుందాయ్ ఎక్స్‌టర్ అమ్మకాల నివేదిక తాజాగా విడుదలైంది. గణాంకాలను పరిశీలిస్తే, గత నెలలో ఈ మైక్రో SUVకి మంచి స్పందన లభించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

డిసెంబర్ 2025లో 5,612 హ్యుందాయ్ ఎక్స్‌టర్ కార్లు భారత మార్కెట్‌లో అమ్ముడయ్యాయి. ఇదే డిసెంబర్ 2024లో కేవలం 5,270 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. ఈ రెండు నెలల గణాంకాలను పోల్చి చూస్తే, సంవత్సరానికి 342 యూనిట్ల పెరుగుదల నమోదైనట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ అమ్మకాలు సుమారు 6 శాతం వృద్ధి సాధించాయి. మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎక్స్‌టర్ తన స్థిరమైన అమ్మకాల పనితీరును కొనసాగించడం గమనార్హం.

Hyundai Exter Suv December 2025 Sales Report 5612 Units Details

హ్యుందాయ్ ఎక్స్‌టర్ భారత మార్కెట్‌లో లభించే అత్యంత సరసమైన SUVలలో ఒకటిగా నిలుస్తోంది. ధర విషయంలో ఇది మైక్రో SUV సెగ్మెంట్‌లో కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ కారు ఎంట్రీ-లెవల్ వేరియంట్ ధర కేవలం రూ. 5.74 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవడం విశేషం. నిజానికి, భారత మార్కెట్‌లో అమ్ముడవుతున్న కొన్ని ప్రీమియం బైక్‌ల ధరల కంటే కూడా ఈ SUV చౌకగా ఉండటం గమనార్హమైన విషయం.

ఇదే సమయంలో, ఫుల్ ఫీచర్లతో వచ్చే టాప్ వేరియంట్ ధర రూ. 9.61 లక్షలు మాత్రమే ఉండటం వల్ల ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌. తక్కువ ధరలో SUV లుక్, అవసరమైన ఫీచర్లు, హ్యుందాయ్ బ్రాండ్ నమ్మకం ఇవన్నీ కలిసి ఎక్స్‌టర్‌ను భారతీయ వినియోగదారులలో మరింత ప్రజాదరణ పొందేలా చేస్తున్నాయి. ప్రీమియం బైక్ బడ్జెట్‌లో పూర్తి స్థాయి SUVని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఎక్స్‌టర్ నిజంగా విలువైన ఎంపికగా నిలుస్తోంది.

Hyundai Exter Suv December 2025 Sales Report 5612 Units Details

హ్యుందాయ్ ఎక్స్‌టర్ మొత్తం రెండు ఇంజన్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇందులో ఒకటి 1.2 లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్, మరొకటి 1.2 లీటర్ పెట్రోల్ + CNG ద్వి-ఇంధన ఇంజన్. పెట్రోల్ వేరియంట్‌ను 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ వేరియంట్ 19.2 kmpl మైలేజీను అందిస్తుంది. స్మూత్ డ్రైవింగ్ అనుభవం కలిగిన ఈ SUV చాలా అనుకూలంగా ఉంటుంది.

అదే సమయంలో, ఎక్స్‌టర్ CNG లభించడం మరో ప్రత్యేకత. ఇందులోని 1.2 లీటర్ పెట్రోల్ + CNG ఇంజన్ గరిష్టంగా 68 bhp పవర్, 95.2 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మైలేజీ విషయానికి వస్తే, CNG మోడల్ కిలోకు 27.1 కి.మీ మైలేజీని ఇస్తుంది. తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది బెస్ట్.

Hyundai Exter Suv December 2025 Sales Report 5612 Units Details

ఈ కారు భద్రత పరంగా అధునాతన ఫీచర్స్‌తో వస్తుంది. ప్రమాదాల సమయంలో లోపల కూర్చున్న వారిని రక్షించడానికి రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు EBDతో కూడిన ABS, 6 ఎయిర్‌బ్యాగులు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, సీట్‌బెల్ట్ రిమైండర్‌లు (అన్ని సీట్లకు), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, అన్ని వేరియంట్లలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అంశాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Sunday, January 11, 2026, 14:28 [IST]
English summary
Hyundai exter suv december 2025 sales report 5612 units details
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+