పేదల బాధలు అర్థం చేసుకున్న హ్యుందాయ్ - ఐ20 ధర లక్ష దాకా తగ్గించిందిగా - కొత్త ధర ఎంతంటే ?
భారతదేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగొందుతున్న హ్యుందాయ్ ఐ20 (Hyundai i20) ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువకానుంది. తన మార్కెట్ వాటాను పెంచుకోవడమే లక్ష్యంగా హ్యుందాయ్ మోటార్స్ ఐ20 ధరలను భారీగా తగ్గించడమే కాకుండా, ఒక సరికొత్త బడ్జెట్ వేరియంట్‌ను కూడా రంగంలోకి దించింది. ఈ నిర్ణయంతో మారుతి సుజుకి బాలెనో, టాటా ఆల్ట్రోజ్ వంటి కార్లకు గట్టి పోటీ ఎదురుకానుంది.
హ్యుందాయ్ ఐ20 ఇప్పటివరకు కాస్త ఖరీదైన కారుగా పేరుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఎరా (Era) బేస్ వేరియంట్ ప్రారంభ ధరను కేవలం రూ.5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. అంతకుముందు ఐ20 ప్రారంభ ధర రూ.6.87 లక్షలుగా ఉండేది.

అంటే దాదాపు రూ.88 వేల రూపాయలను తగ్గించి సామాన్యుడి బడ్జెట్‌లోకి ఈ కారును తెచ్చింది హ్యుందాయ్. ఈ వేరియంట్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టైప్-సి ఛార్జర్ వంటి ఫీచర్లను అందించడం విశేషం.
కేవలం కొత్త వేరియంట్ తేవడమే కాదు, ఇప్పటికే మార్కెట్లో ఉన్న పాపులర్ వేరియంట్ల ధరలను కూడా హ్యుందాయ్ తగ్గించింది:
మ్యాగ్నా ఎగ్జిక్యూటివ్ (Magna Executive): దీని ధర గతంలో రూ.6.87 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.6.74 లక్షలకు తగ్గింది. ఇందులో కీ లెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ హెడ్ లైట్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి.

మ్యాగ్నా (Magna): దీని పాత ధర రూ.7.12 లక్షలు కాగా, ఇప్పుడు రూ.7.00 లక్షలకే లభిస్తోంది. ఇందులో అదనంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రియర్ ఏసీ వెంట్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
కొత్త ఐ20 లోపల హంగులు లగ్జరీ కార్లకు తీసిపోవు. కస్టమర్లకు కావాలంటే రూ.15,000 అదనంగా చెల్లించి 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందే అవకాశం ఉంది. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉంటుంది. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి మోడరన్ ఫీచర్లు ఐ20 ని మరింత స్టైలిష్‌గా మార్చాయి. సేఫ్టీ విషయంలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ గా రావడం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట.

భారత మార్కెట్లో హ్యుందాయ్ ఐ20 ప్రవేశించి 15 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఈ కాలంలో దాదాపు 15 లక్షల మంది కస్టమర్లు ఈ కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు ధరల తగ్గింపు మరియు కొత్త వేరియంట్ రాకతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మారుతి సుజుకి బాలెనో మరియు టాటా ఆల్ట్రోజ్ కార్ల అమ్మకాలపై ఇది భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఒకప్పుడు ప్రీమియం కారు అంటే కేవలం ధనవంతులకే అనుకునేవారు. కానీ హ్యుందాయ్ ఐ20 ఇప్పుడు ఆ అపోహను తొలగించింది. రూ.6 లక్షల లోపే 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న బ్రాండెడ్ కారు దొరకడం అంటే అది మధ్యతరగతి వారికి ఒక వరం లాంటిదే. సేఫ్టీ, స్టైల్, బ్రాండ్ వాల్యూ కోరుకునే ఎవరైనా ఈ కొత్త ఐ20 ని నిస్సందేహంగా పరిశీలించవచ్చు.


Click it and Unblock the Notifications








