ఇక మైలేజ్‌కు తిరుగుండదు.. మధ్యతరగతి ఫేవరెట్ కారుకు భారీ అప్‌డేట్.. i20లో కొత్త హైబ్రిడ్ పవర్!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన హ్యుందాయ్ ఐ20 (hyundai i20) మరోసారి వార్తల్లో నిలిచింది. దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ తాజాగా ఐ20 నాలుగో తరం మోడల్‌ను బ్రెజిల్ మార్కెట్లో ఆవిష్కరించి ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. కొత్త తరం మోడల్‌తో కంపెనీ కేవలం డిజైన్ పరంగానే కాకుండా టెక్నాలజీ, భద్రత, పనితీరు పరంగా కూడా భారీ మార్పులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఐ20ను హ్యుందాయ్ తన అత్యాధునిక K3 ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసింది. ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న అత్యంత ఆధునిక ప్లాట్‌ఫామ్‌లలో ఇది ఒకటి. ఈ కొత్త ఆర్కిటెక్చర్ కారణంగా కారు నిర్మాణం మరింత బలంగా మారడమే కాకుండా, ప్రయాణికుల భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత లభించింది.

ప్రమాదకర పరిస్థితుల్లో మెరుగైన రక్షణ అందించడంతో పాటు డ్రైవింగ్ డైనమిక్స్‌ను కూడా ఈ ప్లాట్‌ఫామ్ గణనీయంగా మెరుగుపరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ కొత్త తరం ఐ20లో అత్యంత ఆసక్తికరమైన అంశం దాని భవిష్యత్ పవర్‌ట్రెయిన్ ఎంపికలే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, హ్యుందాయ్ ఈ మోడల్‌కు 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో పాటు స్ట్రాంగ్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Hyundai I20 To Get New Mild Hybrid And Strong Hybrid Powertrains Soon

ఇది నిజమైతే, ఐ20 తన సెగ్మెంట్‌లో మరింత ఇంధన సామర్థ్యాన్ని అందించే హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచే అవకాశం ఉంది. మైలేజ్‌తో పాటు తక్కువ కాలుష్య ఉద్గారాలు, మెరుగైన పనితీరు, అధునాతన టెక్నాలజీ కలయికతో కొత్త ఐ20 ప్రపంచ మార్కెట్లో హ్యుందాయ్‌కు మరో విజయవంతమైన మోడల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైబ్రిడ్ టెక్నాలజీ ప్రవేశపెడితే, భవిష్యత్ మొబిలిటీ అవసరాలకు అనుగుణంగా ఈ కారు మరింత పోటీదారుగా మారనుంది.

హ్యుందాయ్ ఐ20 హైబ్రిడ్ కారు ఇండియాలో విడుదల అవుతుందో లేదో ఎలాంటి స్పష్టమైన సమాచారం లేనప్పటికి కూడా భారత మార్కెట్లో సాధారణంగా ఐ20కి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా కొనుగోలుకు అందుబాటులో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏది ఏమైనప్పటికి హ్యూందాయ్ నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రాలేము. దీనిపై త్వరలో సమాచారం రావచ్చు.

Hyundai I20 To Get New Mild Hybrid And Strong Hybrid Powertrains Soon

బ్రెజిల్ మార్కెట్లో కొత్త హ్యుందాయ్ i20, HB20, క్రెటా మోడళ్ల మధ్యలో స్థానాన్ని దక్కించుకుంది. ఇందులో 1.0-లీటర్ 3-సిలిండర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజిన్ పెట్రోల్‌తో 75 హెచ్‌పీ పవర్, 94 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తే, ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో 80 హెచ్‌పీ పవర్, 100 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ వేరియంట్‌కు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేయబడింది.

టాప్ వేరియంట్లలో 1.0-లీటర్ టర్బో ఫ్లెక్స్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 115 హెచ్‌పీ పవర్, 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. భవిష్యత్తులో ఈ మోడల్‌కు 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందించే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి ఇదే మోడల్‌ను ఇండియాలో కూడా తీసుకురావచ్చని ఆటో మొబైల్ నిపుణులు అంచనాల వేస్తున్నారు.

Article Published On: Tuesday, June 16, 2026, 14:02 [IST]
English summary
Hyundai i20 to get new mild hybrid and strong hybrid powertrains soon
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+