ఈ కంపెనీ కార్లను ఇండియన్స్ తెగ కొంటున్నారు.. వేల మంది షోరూమ్‌కు క్యూ.. నెలలో 61 వేల పైనే!

భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటైన దక్షిణ కొరియా దిగ్గజం హ్యూందాయ్ మోటర్ ఇండియా (Hyundai Motor India), పెరుగుతున్న పోటీ మధ్య కూడా తన మార్కెట్ బలాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. టాటా మోటార్స్, మహీంద్రా & మహీంద్రా వంటి దేశీయ కంపెనీలు దూకుడుగా కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నప్పటికీ, హ్యుందాయ్ మాత్రం తన ఉత్పత్తుల శ్రేణి, ఆధునిక సాంకేతికత, వినియోగదారుల విశ్వాసంతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తాజాగా 2026 మే నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ వివరాలు పరిశీలిస్తే, హ్యుందాయ్‌కు దేశీయ మార్కెట్లో ఇప్పటికీ బలమైన డిమాండ్ కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

మే 2026లో కంపెనీ దేశీయంగా 47,837 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 43,861 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది గణనీయమైన వృద్ధి. మార్కెట్లో పెరుగుతున్న పోటీ, వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, హ్యుందాయ్ తన విక్రయాలను పెంచుకోవడం విశేషం. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న Creta, Venue, Exter, Verna వంటి మోడళ్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.

Hyundai India May 2026 Sales Recorded 61137 Units More Details Check Here

అలాగే, SUV సెగ్మెంట్‌ కూడా అమ్మకాల వృద్ధికి తోడ్పడుతోంది. క్రెటా వంటి మోడళ్లు మార్కెట్లో నిరంతరం మంచి డిమాండ్‌ను నమోదు చేస్తున్నాయి. దేశీయ అమ్మకాలతో పాటు ఎగుమతుల విభాగంలో కూడా హ్యుందాయ్ తన సత్తా చాటుతోంది. 2026 మే నెలలో కంపెనీ 13,300 వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది. దీంతో దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి గత నెలలో హ్యుందాయ్ మొత్తం 61,137 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

గత ఏడాది మే నెలలో నమోదైన 58,701 యూనిట్లతో పోలిస్తే ఇది మెరుగైన ఫలితం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హ్యుందాయ్ వాహనాలకు లభిస్తున్న ఆదరణ, భారత తయారీ కేంద్రం నుంచి జరిగే ఎగుమతుల పెరుగుదల కంపెనీ పనితీరును మరింత బలోపేతం చేస్తున్నాయి. నెలవారీ ప్రాతిపదికన, హ్యుందాయ్ అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 2026 ఏప్రిల్‌లో కంపెనీ 51,902 వాహనాలను విక్రయించగా, మే నెలలో ఆ సంఖ్య 47,837 యూనిట్లకు తగ్గింది.

Hyundai India May 2026 Sales Recorded 61137 Units More Details Check Here

అంటే ఒక నెల వ్యవధిలో దేశీయ అమ్మకాలు 7.83 శాతం తగ్గాయి. ఇక ఎగుమతుల విభాగంలో కూడా హ్యుందాయ్ కొంత ఒత్తిడిని ఎదుర్కొంది. 2025 మేలో 14,840 యూనిట్లను ఎగుమతి చేసిన కంపెనీ, ఈ ఏడాది మేలో 13,300 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది. దీంతో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 10 శాతానికి పైగా తగ్గినట్లు తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్లలో మారుతున్న పరిస్థితులు ఈ ప్రభావానికి కారణమై ఉండొచ్చు.

అయినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి హ్యుందాయ్ శుభారంభం అందుకోవడం విశేషం. FY27 తొలి రెండు నెలలైన ఏప్రిల్-మే 2026 కాలంలో కంపెనీ మొత్తం 99,739 యూనిట్ల దేశీయ అమ్మకాలను నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 88,235 యూనిట్లతో పోలిస్తే ఇది సుమారు 13 శాతం వృద్ధిని సూచిస్తోంది. అంటే నెలవారీ అమ్మకాల్లో కొంత హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, భారత మార్కెట్లో డిమాండ్ బలంగానే కొనసాగుతోంది.

Hyundai India May 2026 Sales Recorded 61137 Units More Details Check Here

కొత్త మోడళ్లపై పెరుగుతున్న ఆసక్తి, SUVల విభాగంలో బలమైన ఉనికి, అలాగే విస్తృత డీలర్ నెట్‌వర్క్ కంపెనీ వృద్ధికి ప్రధాన బలాలుగా నిలుస్తున్నాయి. రాబోయే నెలల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని హ్యుందాయ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, ఈ వృద్ధి వేగం కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే కంపెనీ 2030 నాటికి 26 కొత్త వాహనాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Article Published On: Monday, June 1, 2026, 11:16 [IST]
English summary
Hyundai india may 2026 sales recorded 61137 units more details check here
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+