రోజుకు 2000మందికి పైగా కొంటున్నారు.. రోడ్డెక్కితే చాలు ఎటు చూసినా ఈ కారే

ఆటోమొబైల్ రంగంలో హ్యుందాయ్ మోటార్స్ వెన్యూ(Hyundai Venue) సంచలనం సృష్టించింది. ఇండియాలో SUV కొనాలనుకునే వాళ్ల ఫస్ట్ ఛాయిస్ ఇప్పుడు ఇదే. 2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అద్భుతమైన అమ్మకాలతో హ్యుందాయ్ వెన్యూ పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. ఈ కారులో అంతలా ఏముందో వివరంగా తెలుసుకుందాం.

ముఖ్యంగా భారతీయులు ఎంతో ఇష్టపడే SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ కంపెనీ కార్ల హవా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. కేవలం ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసి మార్కెట్లో హ్యుందాయ్ తన పట్టును మరింత బిగించింది.

Hyundai India Smashes Records New Venue SUV Sales Hit 12 420 Units in April

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించింది. ఏప్రిల్ 2026లో కంపెనీ తన చరిత్రలోనే అత్యధిక దేశీయ అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఏప్రిల్ (2025)లో 44,374 యూనిట్లు విక్రయించగా, ఈ ఏడాది అది ఏకంగా 51,902 యూనిట్లకు చేరుకుంది.

అంటే సుమారు 16.96 శాతం (సుమారు 17%) వృద్ధిని సాధించింది. ఎగుమతులతో కలిపి చూస్తే మొత్తం అమ్మకాలు 65,610 యూనిట్లకు చేరడం విశేషం. హ్యుందాయ్ సాధించిన ఈ భారీ విజయంలో న్యూ వెన్యూ (New Venue) కీలక పాత్ర పోషించింది. కేవలం ఒక్క నెలలోనే ఈ మోడల్ 12,420 యూనిట్ల అమ్మకాలను సాధించి తన పాత రికార్డులను బ్రేక్ చేసింది.

Hyundai India Smashes Records New Venue SUV Sales Hit 12 420 Units in April

ఇంతటి భారీ స్పందనకు కారణం వెన్యూలో ప్రవేశపెట్టిన సరికొత్త ఫీచర్లు, సెక్యూరిటీ స్టాండర్డ్స్ అని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా వెన్యూ, వెన్యూ ఎన్-లైన్ (N Line) కార్లు భారత్ NCAP రేటింగ్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించడం కస్టమర్లలో నమ్మకాన్ని డబుల్ చేసింది. అటు స్టైల్, ఇటు సేఫ్టీ కావాలనుకునే వారికి వెన్యూ ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది.

దేశీయంగా సేల్స్ అదరగొట్టినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం హ్యుందాయ్ కాస్త వెనుకబడింది. ఎగుమతుల విషయానికి వస్తే, ఏప్రిల్ 2025లో 16,400 యూనిట్లు ఎగుమతి కాగా, ఏప్రిల్ 2026లో ఆ సంఖ్య 13,708 యూనిట్లకు పడిపోయింది. అంటే ఎగుమతుల్లో సుమారు 16.41 శాతం తగ్గుదల కనిపించింది.

Hyundai India Smashes Records New Venue SUV Sales Hit 12 420 Units in April

అలాగే మార్చి 2026తో పోలిస్తే ఏప్రిల్‌లో దేశీయంగా అమ్మకాలు 5.74 శాతం స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ, ఏడాది ప్రాతిపదికన (YoY) చూస్తే హ్యుందాయ్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. హ్యుందాయ్ తన కార్ల లైనప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఎక్స్టర్ (Exter), వెన్యూ, ఆయోనిక్ 5 (Ioniq 5), క్రెటా వంటి మోడళ్లు అమ్మకాలను పరుగులు పెట్టిస్తున్నాయి.

ముఖ్యంగా క్రెటా సమ్మర్ ఎడిషన్, గ్రాండ్ i10 నియోస్ వైబ్ ఎడిషన్ (Vibe Edition), వెన్యూ నైట్ ఎడిషన్ (Knight Edition) వంటి లిమిటెడ్ ఎడిషన్లు యూత్‎ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సెగ్మెంట్లోనూ ఒక ప్రత్యేకమైన కారును అందుబాటులో ఉంచడం హ్యుందాయ్ కు కలిసొచ్చింది.

ప్రస్తుతానికి ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌లో హ్యుందాయ్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) మరియు హైబ్రిడ్ మోడళ్లను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

భారత్‌లో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రొడక్షన్ కెపాసిటీని కూడా పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. టాటా, మహీంద్రా వంటి కంపెనీల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, హ్యుందాయ్ తనదైన శైలిలో ఫీచర్ రిచ్ కార్లతో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది.

Article Published On: Friday, May 1, 2026, 13:04 [IST]
English summary
Hyundai india smashes records new venue suv sales hit 12 420 units in april
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+