496 కి.మీ మైలేజ్.. 29 నిమిషాల్లో ఛార్జింగ్.. హ్యుందాయ్ నుంచి అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు లాంచ్

ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచంలో హ్యుందాయ్ (Hyundai) మరో సంచలనానికి తెరలేపింది. లగ్జరీ ఫీచర్లు, అదిరిపోయే రేంజ్, అందరికీ అందుబాటులో ఉండే ధర.. ఇవే లక్ష్యంగా సరికొత్త హ్యుందాయ్ అయానిక్ 3 (Hyundai Ioniq 3)ను గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. మిలన్ డిజైన్ వీక్ 2026 వేదికగా పరిచయం చేసిన ఈ కారు, అయానిక్ సిరీస్‌లోనే అత్యంత చౌకైన మోడల్‌గా నిలవబోతోంది. దీని లుక్ చూస్తుంటే భవిష్యత్తులో కార్లు ఇలాగే ఉంటాయేమో అన్నంత ఫ్యూచరిస్టిక్‌గా ఉంది.

హ్యుందాయ్ అయానిక్ 3ని ఆర్ట్ ఆఫ్ స్టీల్(Art of Steel) అనే సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో రూపొందించారు. దీనిని చూస్తుంటే చాలా సింపుల్‌గా అనిపించినా, లోతుగా గమనిస్తే అత్యంత అడ్వాన్సుడ్ ఫీచర్లు కనిపిస్తాయి. దీని ముందరి భాగంలో ఉండే సన్నని లైట్లు, పిక్సెల్-ఇన్‌స్పైర్డ్ లైటింగ్ కారుకు ఒక డిఫరెంట్ లుక్ ఇస్తాయి. దీనిని కంపెనీ ఏరో హ్యాచ్ అని పిలుస్తోంది. అంటే గాలి ఒత్తిడిని తట్టుకుని వేగంగా దూసుకెళ్లేలా దీని బాడీని డిజైన్ చేశారు. కారు సైజ్ చిన్నదైనా, దీని ఫ్లాట్ ఫ్లోర్, పొడవైన రూఫ్ వల్ల లోపల కూర్చునే ప్రయాణికులకు చాలా విశాలమైన స్థలం లభిస్తుంది.

Hyundai Ioniq 3 Debuts 496km Range 29-Min Fast Charging Most Affordable EV Yet

హ్యుందాయ్ అయానిక్ 3లో కస్టమర్ల అవసరాల కోసం రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లను అందిస్తున్నారు:
* స్టాండర్డ్ మోడల్: ఇందులో 42.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై సుమారు 344 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. లోకల్ ప్రయాణాలకు ఇది సరైన ఎంపిక.
* లాంగ్ రేంజ్ మోడల్: ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం 61 kWh భారీ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 496 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్ ఇస్తుంది.

Hyundai Ioniq 3 Debuts 496km Range 29-Min Fast Charging Most Affordable EV Yet

ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 170 కిలోమీటర్లు. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ద్వారా కేవలం 29 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు బ్యాటరీని నింపుకోవచ్చు.

కారు లోపల అడుగుపెడితే ఏదో ఫైవ్ స్టార్ హోటల్ రూమ్‌లో ఉన్న అనుభూతి కలుగుతుంది. హ్యుందాయ్ దీనిని ఫర్నిష్డ్ స్పేస్ థీమ్‎తో తయారు చేసింది. ఇందులో సామాన్ల కోసం 441 లీటర్ల బూట్ స్పేస్ ఉంది, దీనికి అదనంగా మెగాబాక్స్ అనే ఎక్స్‌ట్రా స్టోరేజీ కూడా ఇచ్చారు. యూరప్‌లో హ్యుందాయ్ నుంచి కొత్త Pleos Connect ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తున్న మొదటి కారు ఇదే. వేరియంట్‌ను బట్టి 12.9 ఇంచుల నుంచి 14.6 ఇంచుల వరకు భారీ టచ్ స్క్రీన్లు అందుబాటులో ఉన్నాయి. బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, అద్భుతమైన యాంబియంట్ లైటింగ్, డిజిటల్ కీ ఫీచర్లు దీనిని మరింత హైటెక్‌గా మార్చాయి.

Hyundai Ioniq 3 Debuts 496km Range 29-Min Fast Charging Most Affordable EV Yet

సేఫ్టీ విషయంలో హ్యుందాయ్ ఎక్కడా రాజీ పడలేదు. ఇందులో హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ పేరుతో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఇచ్చారు. దీనివల్ల హైవే డ్రైవింగ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్, రిమోట్ స్మార్ట్ పార్కింగ్ వంటి ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అంటే మీరు కారులో కూర్చోకుండానే రిమోట్ తో కారును పార్క్ చేయవచ్చన్నమాట. అనేక ఎయిర్‌బ్యాగులు, పటిష్టమైన బాడీ స్ట్రక్చర్‌తో ఈ కారు సేఫ్టీలో కూడా 5-స్టార్ రేటింగ్ సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతానికి హ్యుందాయ్ ఈ అయానిక్ 3ని యూరోపియన్ మార్కెట్లలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న క్రేజ్‌ను బట్టి చూస్తే, 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో ఈ కారును మన దేశంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాల సమాచారం. టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 వంటి కార్లకు ఇది గట్టి పోటీనివ్వడం ఖాయం.

More from DriveSpark

Article Published On: Tuesday, April 21, 2026, 17:52 [IST]
English summary
Hyundai ioniq 3 debuts 496km range 29 min fast charging most affordable ev yet
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+