డిజైన్ అదిరింది..కానీ రేంజ్ చూస్తేనే బెదిరిపోతున్నారు..లగ్జరీ కారుతో తలపట్టుకున్న హ్యుందాయ్ కంపెనీ
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ అంటే ఒక నమ్మకం. క్రెటా, వెన్యూ వంటి మోడళ్లు నెలకు వేల సంఖ్యలో అమ్ముడవుతూ రికార్డులు సృష్టిస్తుంటే, అదే కంపెనీకి చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ కారు అయానిక్ 5 మాత్రం కేవలం రెండంకెల అమ్మకాలకే పరిమితమైంది.
గత డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా కేవలం 69 మంది మాత్రమే ఈ కారును కొనుగోలు చేశారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. 2024 డిసెంబర్ అమ్మకాలతో (కేవలం 24 కార్లు) పోలిస్తే ఇది 188 శాతం వృద్ధి అని కంపెనీ చెబుతోంది. అంటే, అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ, నెమ్మదిగా కారు క్రేజ్ పెరుగుతోందని అర్థం చేసుకోవచ్చు.

హ్యుందాయ్ అయానిక్ 5 కేవలం కారు మాత్రమే కాదు, రోడ్డు మీద నడిచే ఒక విలాసవంతమైన గది లాంటిది. ఇందులో 72.6 kWh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 217 bhp పవర్‌ను, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 631 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చేయొచ్చు. అంతేకాదు, 150 kW ఫాస్ట్ ఛార్జర్ వాడితే కేవలం 21 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ అయిపోతుంది.
ఈ కారు ఇంటీరియర్ చూస్తే మీరు ఫిదా అయిపోతారు. డ్యాష్‌బోర్డ్ మీద 12.3 ఇంచుల పరిమాణం ఉన్న రెండు భారీ స్క్రీన్లు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ సమాచారం కోసం. పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా, మరియు 6 ఎయిర్ బ్యాగులతో భద్రతకు పెద్దపీట వేశారు. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంత ఉన్నా సరే, ఈ కారు ఎందుకు అమ్ముడవడం లేదనే దానికి ప్రధాన కారణం దీని ధరే.

హ్యుందాయ్ అయానిక్ 5 ఎక్స్ షోరూమ్ ధర దాదాపు రూ. 46.30 లక్షలుగా ఉంది. ఆన్ రోడ్ వచ్చేసరికి ఇది 50 లక్షలు దాటేస్తుంది. ఇంత భారీ ధర ఉండటానికి కారణం ఏంటంటే.. ఈ కారును భారత్‌లో తయారు చేయడం లేదు. విదేశాల నుండి పూర్తిగా తయారైన కారును (CBU - Completely Built Unit) దిగుమతి చేసుకుంటున్నారు.
దీనివల్ల ప్రభుత్వం వేసే ఇంపోర్ట్ డ్యూటీ (దిగుమతి సుంకం) వల్ల కారు ధర భారీగా పెరిగిపోతోంది. టాటా ఎవిన్యా లేదా మహీంద్రా XUV 400 వంటి కార్లు తక్కువ ధరకే లభిస్తుండటంతో, సామాన్యులు ఈ కారు వైపు చూడటం లేదు.

హ్యుందాయ్ ప్రస్తుతం ఈ కారు ద్వారా ఇండియన్ మార్కెట్‌ను టెస్ట్ చేస్తోంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ కారును భారత్‌లోని ప్లాంట్‌లలోనే అసెంబుల్ చేయడం లేదా తయారు చేయడం ప్రారంభిస్తే, ధర సుమారు 10 నుండి 15 లక్షలు తగ్గే అవకాశం ఉంది. అప్పుడు ఖచ్చితంగా ఇది టాటా, బివైడి (BYD) వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. ప్రీమియం ఎలక్ట్రిక్ కారు కావాలనుకునే ధనికులకు మాత్రం ఇదొక బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి.


Click it and Unblock the Notifications








