కేవలం రూ.6 లక్షలు.. 28 కి.మీ మైలేజ్! రోజూ డబ్బు సంపాదించి పెట్టే కార్లు వచ్చేశాయ్

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించుకున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India), ఇప్పుడు మరో కీలక అడుగు ముందుకు వేసింది. ఈరోజు అధికారికంగా తన ప్రత్యేక టాక్సీ కార్ల శ్రేణిని ప్రకటిస్తూ, వాణిజ్య వాహన విభాగంలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. ఈ కొత్త ప్రయాణానికి ప్రతీకగా ప్రైమ్ HB (హ్యాచ్‌బ్యాక్), ప్రైమ్ SD (సెడాన్) మోడళ్లను హ్యుందాయ్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఫ్లీట్ ఆపరేటర్లు, టాక్సీ యజమానులు, రోజూ ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే డ్రైవర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రైమ్ సిరీస్‌ను రూపొందించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. హ్యుందాయ్ ప్రైమ్ సిరీస్ ప్రధాన లక్ష్యం నమ్మకం, విశ్వసనీయత, తక్కువ యాజమాన్య ఖర్చు. రోజువారీ వాణిజ్య వినియోగంలో కారుకు ఎదురయ్యే కఠిన పరిస్థితులను తట్టుకునేలా ఈ వాహనాలను డిజైన్ చేసినట్లు కంపెనీ చెబుతోంది.

ముఖ్యంగా టాక్సీ రంగంలో అత్యంత కీలకమైన అంశాలైన మంచి మైలేజీ, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, దీర్ఘకాలిక పనితీరు విషయంలో ప్రైమ్ HB, ప్రైమ్ SD మోడళ్లు బలమైన పరిష్కారంగా నిలుస్తాయని హ్యుందాయ్ అభిప్రాయం. అదే సమయంలో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యం కూడా ఎక్కడా తగ్గకుండా చూసినట్లు సంస్థ పేర్కొంది. వీటి ఇంజిన్ పనితీరు కూడా చాలా అద్బుతంగా ఉంటుంది.

Hyundai Steps Into Commercial Vehicle Space Launches Prime Taxi Series

ఇంజిన్ పరంగా చూస్తే, రెండు మోడళ్లలోనూ హ్యుందాయ్ ఇప్పటికే నిరూపించుకున్న 1.2 లీటర్ కప్పా 4-సిలిండర్ ఇంజిన్ను ఉపయోగించింది. ఈ ఇంజిన్ పెట్రోల్‌తో పాటు CNG ఆప్షన్‌లో కూడా అందుబాటులో ఉండడం వాణిజ్య వాహన వినియోగదారులకు పెద్ద ప్లస్ పాయింట్. ఇంధన ధరలు పెరుగుతున్న ఈ సమయంలో CNG ఆప్షన్ టాక్సీ యజమానులకు ఖర్చు పరంగా భారీ ఊరటను అందించనుంది. హ్యుందాయ్ ప్రైమ్ సిరీస్‌ను పోటీ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రైమ్ HB ప్రారంభ ధర రూ. 5,99,900, అలాగే ప్రైమ్ SD ప్రారంభ ధర రూ. 6,89,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఈ ధరలు వాణిజ్య వాహన విభాగంలో హ్యుందాయ్‌ను బలమైన పోటీదారుగా నిలబెట్టే అవకాశముందని ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. మైలేజ్ ప్రధానంగా కావాలనుకున్న వినియోగదారులకు ఇది బాగా అనుకూలం. ప్రైమ్ SD కి 28.40 కిమీ/కిలో, ప్రైమ్ HB కి 27.32 కిమీ/కిలో మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

Hyundai Steps Into Commercial Vehicle Space Launches Prime Taxi Series

ఈ ప్రైమ్ టాక్సీ కార్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు భారతదేశం అంతటా ఉన్న ఏ హ్యుందాయ్ అధీకృత షోరూమ్‌ను సందర్శించినా సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. కేవలం రూ. 5,000 బుకింగ్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా ప్రైమ్ HB లేదా ప్రైమ్ SD మోడల్‌ను ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చు. ఇది ఫ్లీట్ ఆపరేటర్లు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వాహనాలను ప్లాన్ చేసుకునేలా మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

అదనంగా, దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ ఈ వాహనాలకు ప్రత్యేక వారంటీ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. ప్రైమ్ HB, ప్రైమ్ SD రెండూ 4వ, 5వ సంవత్సరం లేదా 1,80,000 కిలోమీటర్లు (ఏది ముందుగా పూర్తయితే అది) వరకూ వర్తించే వారంటీ ప్యాకేజీలతో అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల టాక్సీ యజమానులు, ఫ్లీట్ నిర్వాహకులకు భవిష్యత్తులో మెయింటెనెన్స్ ఖర్చులపై భారం తగ్గి, నిశ్చింతగా వాహనాలను వినియోగించే అవకాశం లభిస్తుంది.

Hyundai Steps Into Commercial Vehicle Space Launches Prime Taxi Series

ఫీచర్ల విషయానికొస్తే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వెనుక కెమెరా, 3 సంవత్సరాల వారంటీ, పానిక్ బటన్‌తో వాహన స్థాన ట్రాకింగ్ పరికరం (4 సంఖ్యలు)తో వస్తుంది. దీనితో పాటు, ముందు, వెనుక పవర్ విండోస్, వెనుక డీఫాగర్, సెంట్రల్ లాకింగ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, అత్యవసర స్టాప్ సిగ్నల్, కంపెనీ-ఇన్‌స్టాల్డ్ స్పీడ్ లిమిట్ ఫంక్షన్ (80 కిమీ/గం) వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, January 1, 2026, 10:34 [IST]
English summary
Hyundai steps into commercial vehicle space launches prime taxi series
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+