చూసినవాళ్లంతా బుక్ చేసుకుంటున్నారు.. ఈ కారు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్! బుకింగ్‌ల వరద!

కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) SUV భారత మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కొనుగోలుదారుల నుంచి అసాధారణమైన స్పందనను పొందుతోంది. నవంబర్ 4, 2025న అధికారికంగా ప్రారంభించబడిన ఈ రెండవ తరం వెన్యూ, లాంచ్ రోజే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీతో ఇది పూర్తిగా ఫ్రెష్ అవతార్‌లో కనిపిస్తూ యువతతో పాటు ఫ్యామిలీ కార్ కొనుగోలుదారులను కూడా ఆకట్టుకుంటోంది. లుక్ పరంగా చూస్తే, కొత్త వెన్యూ మరింత స్టైలిష్‌గా, ప్రీమియం ఫీల్ ఇచ్చేలా డిజైన్ చేయబడింది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే కొత్త వెన్యూ భారీ డిమాండ్‌ను నమోదు చేసింది. డీలర్‌షిప్‌ల వద్ద విచారణలు పెరగడమే కాకుండా, బుకింగ్‌ల పరంగా కూడా ఈ కారు కొత్త రికార్డును సృష్టించింది.

సమాచారం ప్రకారం, ఈ వెన్యూ SUV ఇప్పటికే రికార్డు స్థాయిలో 80,000 బుకింగ్‌లు అందుకున్నట్లు తెలుస్తోంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ఇది ఒక కీలకమైన మైలురాయిగా ఆటో పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఆర్డర్లు రావడం ద్వారా భారత మార్కెట్లో వెన్యూ బ్రాండ్‌కు ఉన్న నమ్మకం మరోసారి రుజువైంది. రోజువారీ వినియోగానికి సరిపోయే సైజ్, మంచి ఫీచర్ లిస్ట్ ఈ SUVని కొనుగోలుదారుల ఫస్ట్ ఛాయిస్‌గా మార్చాయి.

Hyundai Venue Bookings Touch 80000 Strong Market Demand Details

ముఖ్యంగా నగరాల్లో డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు, హైవే ప్రయాణాల్లో కూడా మంచి కంఫర్ట్ అందించగలదు. ప్రస్తుతం కూడా కొత్త వెన్యూ బుకింగ్‌లు కొనసాగుతున్నాయి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు రూ. 25,000 అడ్వాన్స్ చెల్లించి హ్యుందాయ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా గానీ, లేదా సమీపంలోని డీలర్‌షిప్‌ను సందర్శించి గానీ SUVను బుక్ చేసుకోవచ్చు. అయితే డిమాండ్ భారీగా ఉండటంతో, కొన్నివేరియంట్లకు వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ కాంపాక్ట్ SUV ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభమై రూ. 15.69 లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉండటం వల్ల, బడ్జెట్ కార్ కొనుగోలుదారుల నుంచి ప్రీమియం ఫీచర్లు కోరుకునే కస్టమర్ల వరకు అందరికీ ఇది సరైన ఎంపికగా మారుతోంది. వేరియంట్ల విషయానికి వస్తే, వెన్యూ HX2, HX4, HX5, HX6 అనే వివిధ ట్రిమ్‌లలో లభించడం వల్ల తమ అవసరాలకు తగ్గట్టుగా కొనుగోలుదారులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

Hyundai Venue Bookings Touch 80000 Strong Market Demand Details

ఇంజిన్ ఆప్షన్లలో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 83 bhp పవర్, 114.7 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ నగర ప్రయాణాలకు, స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇంకొంచెం ఎక్కువ పవర్ కోరుకునే వారి కోసం 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తోంది. ఇది 120 bhp పవర్‌తో పాటు 172 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

డీజిల్ వేరియంట్‌ను ఇష్టపడే వారికి 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 116 bhp పవర్‌తో పాటు భారీగా 250 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, అలాగే స్పోర్టీ డ్రైవింగ్ కోసం 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌లను ఎంపిక చేసుకునే వీలుంది. మైలేజీ పరంగా సుమారు 17.9 kmpl నుంచి 20.99 kmpl వరకు అందిస్తుందని చెబుతున్నారు.

Hyundai Venue Bookings Touch 80000 Strong Market Demand Details

కారు లోపలికి అడుగుపెట్టిన వెంటనే ఆధునిక టెక్నాలజీ స్పష్టంగా కనిపిస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు డ్రైవర్ డిస్ప్లే కోసం 12.3-అంగుళాల డ్యూయల్ స్క్రీన్ సెటప్‌, 8-స్పీకర్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్‌, భద్రత విషయానికి వస్తే, 6 ఎయిర్‌బ్యాగులు, అలాగే ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, అదనంగా ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) వంటి కీలక సేఫ్టీ టెక్నాలజీలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 11, 2026, 13:10 [IST]
English summary
Hyundai venue bookings touch 80000 strong market demand details
Read more on: #hyundai motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+