కొత్త వేరియంట్ అదిరిపోయే ఫీచర్లు.. 50 వేల మంది లైన్లో ఉన్నారు.. ధర తెలిస్తే దీన్ని అస్సలు వదలరు

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన పాపులర్ ఎస్‌యూవీ వెన్యూ(Venue)లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. భారత మార్కెట్లో వెన్యూకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ తాజాగా HX5+ అనే కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

కేవలం ఫీచర్లు మాత్రమే కాకుండా, దీని ధర కూడా మధ్యతరగతి కస్టమర్లను ఆకట్టుకునేలా ఉండటంతో అప్పుడే బుకింగ్స్ మోత మొదలైంది. ఇప్పటికే 50,000 మార్కును దాటేసిన బుకింగ్స్ గణాంకాలు చూస్తుంటే, ఈ కారు రోడ్లపై రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Hyundai Venue HX5 Debuts with 6 Airbags and Smart Features Prices Start at Rs 9 99 Lakh

ధర, ఇంజిన్ స్పెసిఫికేషన్స్
కొత్త హ్యుందాయ్ వెన్యూ HX5+ వేరియంట్ ధరను కంపెనీ రూ.9,99,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. ఇది కప్పా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (MT) గేర్‌బాక్స్‌ను అందించారు. సిటీ డ్రైవింగ్‌తో పాటు లాంగ్ జర్నీలకు కూడా ఈ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. కేవలం రూ.10 లక్షల లోపే ప్రీమియం ఎస్‌యూవీ అనుభూతిని అందించడమే లక్ష్యంగా హ్యుందాయ్ ఈ మోడల్‌ను తీర్చిదిద్దింది.

మరింత స్టైలిష్‌గా.. మరిన్ని ఫీచర్లు
కొత్త HX5+ వేరియంట్‌లో కస్టమర్లు కోరుకునే ఎన్నో స్మార్ట్ ఫీచర్లను జోడించారు. ఇందులో క్వాడ్ బీమ్ LED హెడ్‌ల్యాంప్స్, రూఫ్ రైల్స్, స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జర్, ఆటో అప్-డౌన్ పవర్ విండోస్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఉన్నాయి.

Hyundai Venue HX5 Debuts with 6 Airbags and Smart Features Prices Start at Rs 9 99 Lakh

వెనుక సీట్లో కూర్చునే వారి సౌకర్యం కోసం విండో సన్‌షేడ్స్, రియర్ వైపర్, వాషర్ కూడా అందించారు. అలాగే డ్రైవర్ సౌకర్యం కోసం ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన స్టోరేజ్ బాక్స్ కూడా ఉంది. ఈ మార్పులన్నీ కారుకు ఒక స్పోర్టీ లుక్‌ను ఇవ్వడంతో పాటు ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి.

భద్రతకు పెద్ద పీట
హ్యుందాయ్ అంటేనే సేఫ్టీకి మారుపేరు. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లను అందించడం గమనార్హం. టాప్ వేరియంట్లలో 12.3 ఇంచుల భారీ టచ్ స్క్రీన్ నావిగేషన్ సిస్టమ్, వాయిస్ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 8 స్పీకర్ల బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి లగ్జరీ ఫీచర్లు కస్టమర్లను కట్టిపడేస్తున్నాయి.

Hyundai Venue HX5 Debuts with 6 Airbags and Smart Features Prices Start at Rs 9 99 Lakh

కస్టమర్ల నుంచి భారీ స్పందన
ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. "కొత్త వెన్యూకు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే 50,000 కంటే ఎక్కువ బుకింగ్స్ వచ్చాయి.

భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా, తక్కువ ధరలో ఎక్కువ విలువను ఇచ్చే ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యం. ఈ HX5+ వేరియంట్ ఖచ్చితంగా మార్కెట్లో గేమ్ ఛేంజర్ అవుతుంది" అని ధీమా వ్యక్తం చేశారు. కారు కొనే ప్లాన్ లో ఉన్నవారికి హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 3, 2026, 7:30 [IST]
English summary
Hyundai venue hx5 debuts with 6 airbags and smart features prices start at rs 9 99 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+