నలుపు రంగులో ఉండే ఆ కిక్ వేరే లెవల్.. పూర్తి బ్లాక్ లుక్‌తో హ్యుందాయ్ వెన్యూ అదిరిపోతుంది!
కాంపాక్ట్ SUV సెగ్మెంట్ అంటే ఇప్పటికీ ప్రధానంగా టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా వంటి మోడళ్లే ముందుంటాయి. ఈ రెండింటి మధ్య తీవ్ర పోటీ కొనసాగుతున్నప్పటికీ, హ్యూందాయ్ వెన్యూ (Hyundai Venue) మాత్రం నెమ్మదిగా, కానీ స్థిరంగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రారంభం నుంచి పెద్దగా ఫిర్యాదులు లేకుండా, మంచి పనితీరు, ప్రాక్టికాలిటీతో వినియోగదారులను ఆకట్టుకుంటూ ముందుకు సాగింది. ఇటీవల ఈ మోడల్‌ను కొత్త తరానికి అప్‌గ్రేడ్ చేయడంతో, మార్కెట్‌లో దీనికి మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఈ SUVని కొనాలనుకునే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ వేగాన్ని మరింత పెంచేందుకు, దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యూందాయ్ మరో కొత్త స్టైల్‌ను జోడించింది. అదే హ్యూందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ (Hyundai Venue Night Edition).
ఈ ప్రత్యేక వేరియంట్ పూర్తిగా బ్లాక్ థీమ్‌తో వస్తూ, వాహనానికి మరింత స్పోర్టీ, బోల్డ్ లుక్‌ను అందిస్తోంది. బాడీ నుంచి డీటైల్స్ వరకు నలుపు రంగుతో రూపొందించడంతో, ఇది రోడ్డుపై ప్రత్యేకంగా కనిపించేలా చేస్తోంది. యువతను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ఈ ఎడిషన్, స్టైల్ కోరుకునే వారికి నచ్చేలా ఉంది. వేరియంట్ల విషయానికి వస్తే, ఈ నైట్ ఎడిషన్ HX5, HX6T, HX8, HX10 వంటి ట్రిమ్‌లలో అందుబాటులో ఉంటుంది.

గమనించాల్సిన విషయం ఏమిటంటే, Hyundai Venue Night Edition డిజైన్ పరంగా పూర్తిగా కొత్త మార్పులు పొందలేదు. రెగ్యులర్ మోడల్‌లో ఉన్న అదే డిజైన్‌ను కొనసాగిస్తూ, ప్రధానంగా బ్లాక్ థీమ్ ఎలిమెంట్స్‌తో మరింత స్పోర్టీగా తీర్చిదిద్దారు. Hyundai Venue Night Editionను సాధారణ మోడల్‌తో పోలిస్తే ప్రత్యేకంగా చూపించేందుకు టెయిల్‌గేట్‌పై "నైట్ ఎడిషన్" బ్యాడ్జ్ ఇచ్చారు.
బయట భాగంలానే లోపలి డిజైన్ కూడా అదే స్టైల్‌లో ఉన్నప్పటికీ, ఇందులో పూర్తిగా బ్లాక్ థీమ్‌ను ఉపయోగించారు. స్టీరింగ్, ఏసీ వెంట్స్, కంట్రోల్ బటన్లు వంటి చోట్ల ఇత్తడి (బ్రాస్) కలర్ హైలైట్స్ ఇచ్చి ప్రీమియం ఫీల్ తీసుకువచ్చారు. ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ 12.3-ఇంచ్ స్క్రీన్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి.

భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ కెమెరా, ADAS, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అన్ని వీల్స్‌కు డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంజిన్ ఆప్షన్‌లలో 1.2L పెట్రోల్, 1.0L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ వేరియంట్లు ఉండగా, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కూడా లభిస్తాయి. మొత్తంగా, స్టైలిష్ లుక్‌తో పాటు ఫీచర్లు, సేఫ్టీ ప్యాకేజ్‌గా ఈ మోడల్ నిలుస్తోంది.
వేరియంట్ల వారీగా ఒకసారి ధరలను చూసినట్లయితే, స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటున్న Hyundai Venue Night Edition ధరల విషయానికి వస్తే, HX5 పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 9.70 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, అదే ట్రిమ్‌లో డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 11.12 లక్షలుగా ఉంది. HX6T పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ రూ. 11.03 లక్షలు, HX8 డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ రూ.13.85 లక్షలకు లభిస్తుంది.

టాప్ ఎండ్ HX10 టర్బో పెట్రోల్ DCT ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.14.79 లక్షల వరకు చేరుతుంది. ఈ నైట్ ఎడిషన్ మాత్రమే కాకుండా, వెన్యూ ఇతర స్టాండర్డ్ వేరియంట్లలో కంపెనీ కొత్త ఫీచర్‌గా డాష్‌క్యామ్‌ను చేర్చింది. ఈ అప్‌డేట్ కారణంగా కొన్ని వేరియంట్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. ఉదాహరణకు, HX6T పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ఇప్పుడు రూ.10.88 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది, ఇది గతంతో పోలిస్తే రూ. 8,000 ఎక్కువ.
అలాగే HX10 టర్బో పెట్రోల్ DCT వేరియంట్ ధర రూ. 14.64 లక్షలకు చేరుకుని, రూ. 8,000 పెరుగుదల నమోదు చేసింది. డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ అయిన HX10 ధర ఇప్పుడు రూ. 15.64 లక్షలుగా ఉంది, ఇది రూ. 13,000 పెరుగుదలతో వచ్చింది. మరోవైపు, స్పోర్టీ లుక్‌తో వచ్చే N Line N10 DCT వేరియంట్ ధర కూడా రూ. 15.64 లక్షలకు చేరి, రూ. 24,000 పెరిగింది.


Click it and Unblock the Notifications








