ఒక్కసారిగా ఈ కారును కొనేవారు పెరిగిపోతున్నారు.. జనం దీనిపై మనసు పారేసుకున్నారు.!
హ్యూందాయ్ కంపెనీ భారతీయ మార్కెట్లో దిగ్గజ కార్ల తయారీదారుగా ప్రజల మన్నలను పొందుతుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన కార్లకు ఇటీవలి కాలంలో వినియోగారుల నుంచి బలమైన డిమాండ్ వస్తుంది. తాజాగా వచ్చిన కాంపాక్ట్ SUVకి సంబంధించిన అమ్మకాలు గణంకాలు భారతీయ మార్కెట్లో దీని పట్ల ఉన్న ఆదరణను తెలియజేస్తున్నాయి. సబ్-4 మీటర్ల కాంపాక్ట్ SUV అయిన హ్యూందాయ్ వెన్యూ (hyundai venue) గత నెలలో సేల్స్‌లో సత్తా చాటింది. అమ్మకాల నివేదిక ప్రకారం, ఈ కారు జూన్ 2026లో భారత మార్కెట్లో మొత్తం 10,776 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అయితే ఈ అమ్మకాలు సాధారణ సంఖ్యలు కాదు, గత ఏడాది ఇదే నెలలో నమోదైన అమ్మకాలతో పోల్చినట్లయితే ఇది భారీ మొత్తంలో వృద్ధి అని చెప్పొచ్చు.
2025 జూన్ నెలలో వెన్యూ మొత్తం 6,858 యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేయగా, ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది దాదాపుగా సగానికి పైగా అంటే, ఏకంగా 57.13 శాతం అదిరిపోయే వృద్ధిని నమోదు చేసింది. ఈ లెక్కన గతంలో కంటే ఈ సారి అమ్మకాలు అదనంగా 3,918 కార్లు ఎక్కువగా నమోదు కావడం విశేషం. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ మార్కెట్లో కూడా ఇది భారీ వృద్ధిని నమోదు చేసింది.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ, జూన్ 2026 లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్ల జాబితాలో వెన్యూ ఏకంగా చోటు సంపాదించుకుని 10 స్థానంలో నిలవడం మరో విశేషం. మారుతున్న కాలానికి అనుగుణంగా పెరుగుతున్న పోటీదారుల మధ్య కూడా హ్యూందాయ్ వెన్యూ టాప్ 10 లో నిలవడం కంపెనీ పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. రానున్న పండగల కాలంలో సేల్స్ మరింత పెరగొచ్చు.
పెరిగిన ఈ సేల్స్ కారణంగా భారత మార్కెట్లో జూన్ 2026 నాటికి హ్యుందాయ్ వెన్యూ మార్కెట్ వాటా 6.91 శాతంగా నమోదు అయింది. ప్రధానంగా ఈ కారు ఇంత అద్భుతమైన వృద్దిని సాధించడానికి ప్రధాన కారణం, వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా హ్యూందాయ్ తన వెన్యూ కారును అప్‌డేట్ చేసి సరికొత్త డిజైన్, ఆకర్షణీయమైన కలర్స్, అధునాతన ఫీచర్స్‌తో కొత్త తరం మోడల్‌ను నవంబర్ 2025లో విడుదల చేసింది.

కొత్తగా అప్‌డేట్ అయిన వెన్యూ రాక, దీని అమ్మకాలు పెరగడానికి బాగా తోడ్పాటు అందించింది. వెన్యూ సాధించిన అద్భుతమైన వృద్ధికి ఈ కొత్త తరం మోడల్ రాక ఒక ప్రధాన కారణంగా ఆటోరంగ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఎక్స్‌టీరియర్‌తో పాటు, ఇంటీరియర్లో కూడా ప్రధాన మార్పులు కస్టమర్లను ఆకట్టుకోవడం కారణంగా ఈ కారును కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో దీనికి విశేష ఆదరణ ఏర్పడింది.
ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యూందాయ్ వెన్యూ ఎంట్రీ లెవల్ బెస్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7,99,900 మాత్రమే. దీనిలో మరింత అధునాతన ఫీచర్స్‌తో కూడిన టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 15,82,700లుగా ఉంది. మరో విషయం ఏమిటంటే, దీనిలో పెర్ఫార్మెన్స్ వెర్షన్ ఎన్ లైన్ వేరియంట్ ధర రూ.10,66,100. అలాగే దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.రూ. 15,66,700 (ఎక్స్ షోరూమ్).

దీని పనితీరు విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ 3 ఇంజన్ ఆప్షన్‌లలో వినియోగదారులు కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఆప్షన్‌లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ మోడల్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కొనుగోల చేయడానికి లభిస్తుంది.


Click it and Unblock the Notifications